శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By raman
Last Updated : మంగళవారం, 14 ఆగస్టు 2018 (08:43 IST)

మంగళవారం (14-08-2018) దినఫలాలు - ఆరోగ్యం భంగం.. ఊహించని...

మేషం: గృహ మరమ్మత్తులు, నిర్మాణాలు మందకొడిగా సాగుతాయి. వ్యవసాయ రంగాలవారికి ఎరువుల కొనుగోలులో ఏకాగ్రత, మెళకువ ముఖ్యం. వృదా ఖర్చులు అదుపు చేయాలన్న మీ యత్నం నెరవేరదు. మిత్రుల ద్వారా ఆసక్తికరమైన విషయాలు గ్

మేషం: గృహ మరమ్మత్తులు, నిర్మాణాలు మందకొడిగా సాగుతాయి. వ్యవసాయ రంగాలవారికి ఎరువుల కొనుగోలులో ఏకాగ్రత, మెళకువ ముఖ్యం. వృదా ఖర్చులు అదుపు చేయాలన్న మీ యత్నం నెరవేరదు. మిత్రుల ద్వారా ఆసక్తికరమైన విషయాలు గ్రహిస్తారు. ఆరోగ్యభంగం, ఊహించని ఖర్చులు చికాకు పరుస్తాయి.
 
వృషభం: ఆర్థిక విషయాలలో జయం చేకూరుతుంది. స్త్రీలు ఆరోగ్యపరమైన సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది. విలువైన వస్తువుల అమర్చుకోవాలనే కోరిక వాయిదా వేసుకోవలసి వస్తుంది. కమీషన్ దారులకు, మధ్యవర్తులకు ఆదాయం బాగుంటుంది. పాతరుణాలు తీర్చడంతో పాటు విలువైన పరికరాలు అమర్చుకుంటారు. 
 
మిధునం: ఉపాధ్యాయులకు పనిభారం అధికమవుతుంది. నిర్మాణ పనులలో కాంట్రాక్టర్లకు, బిల్డర్లకు ఒత్తిడి పెరుగుతుంది. ప్రింటింగ్, స్టేషనరీ రంగంలో వారు అచ్చు తప్పులు పడుటవలన మాట పడవలసి వస్తుంది. బ్యాంకుల్లో మీ పనుల్లో స్వల్ప ఆటంకాలు ఎదుర్కోవలసి వస్తుంది. దూరప్రయాణాల లక్ష్యం నెరవేరుతుంది. 
 
కర్కాటకం: చేయు వృత్తి వ్యాపారాల యందు ప్రోత్సాహము, వాక్‌చాతుర్యముండును. మీ కళత్ర మెుండివైఖరి చికాకు కలిగిస్తుంది. కీలకమైన వ్యవహారాలలో మెళకువ వహిస్తారు. సోదరీసోదరులతో సమస్యలు తలెత్తుతాయి. రావలసిన ధనం చేతికందుతుంది. బంధుమిత్రుల కలయికతో మానసికంగా కుదుటపడుతారు. 
 
సింహం: కోర్టు వ్యవహారాలు వాయిదా పడుట మంచిది. రవాణా రంగాలవారికి ఇబ్బందులు అధికమవుతాయి. కొన్ని అనుకోని సంఘటనలు మనస్తాపం కలిగిస్తాయి. ఉద్యోగస్తులు ఇతర వ్యాపకాలు విడనాడి విధినిర్వహణలో అప్రమత్తంగా వ్యవహరించవలసి ఉంటుంది. స్త్రీలకు అపరిచిత వ్యక్తుల పట్ల మెళకువ అవసరం.  
 
కన్య: సంఘంలో విశేష గౌరవం లభిస్తుంది. ఉద్యోగస్తుల శ్రమకు, అధికారుల నుండి ప్రసంశలు లభిస్తాయి. స్త్రీలకు పనిభారం అధికమవుతుంది. ఉపాధ్యాయులు ఒత్తిడి సమస్యలకు లోనవుతారు. దైవ, పుణ్య, సేవాకార్యక్రమాల్లో చురుకుగా వ్యవహరిస్తారు. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కుంటారు.   
 
తుల: ముఖ్యుల కోసం ధనం బాగా వెచ్చించవలసి ఉంటుంది. బృంద కార్యక్రమాల్లో పాల్గొంటారు. స్త్రీలు పొట్ట, బి.పి, నరాలకు సంబంధించిన చికాకులను ఎదుర్కుంటారు. ఉపాధ్యాయులకు ఒక సమాచారం ఆసక్తి కలిగిస్తుంది. నూతన పెట్టుబడులు పెట్టునపుడు పునరాలోచన అవసరం. శత్రువులపై విజయం సాధిస్తారు.
 
వృశ్చికం: బ్యాంకు లావాదేవీలు, దీర్ఘకాలిక పెట్టుబడులకు అనుకూలం. గృహమునకు వస్తువులను అమర్చుకుంటారు. దైవ శుభకార్యం చేయాలనే సంకల్పం బలపడుతుంది. పెద్దల గురించి ఆందోళన చెందుతారు. ఖర్చులు పెరిగినా సంతృప్తి, ప్రయోజనం పొందుతారు. ఓర్పుతో తలపెట్టిన పనులు పూర్తిచేస్తారు.
 
ధనస్సు: విద్యార్థులకు ఒక విషయం ఎంతో ఆందోళన కలిగిస్తుంది. అవివాహితులకు ఒక వార్త ఎంతో సంతృప్తి కలిగిస్తుంది. ఒక్కోసారి మీ జీవిత భాగస్వామి మనస్థత్వం అర్థం చేసుకోవడం కష్టమవుతుంది. కానివేళలో ఇతరుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. నూనె, ఎండుమిర్చి, పసుపు, ప్రత్తి, పొగాకు కంది వ్యాపారస్తులకు కలిసి వచ్చేకాలం.
 
మకరం: ప్లీడర్లకు తమ క్లయింట్‌ తీరు ఇబ్బందులకు గురిచేస్తుంది. వృత్తుల వారికి ప్రజాసంబంధాలు బలపడుతాయి. నిరుద్యోగులకు తాత్కాలిక అవకాశం లభిస్తుంది. విదేశీయత్నాల్లో శ్రమాధిక్యత, ప్రయాసలకు లోనవుతారు. పత్రిక, ప్రైవేటు సంస్థలలోని వారి కోరుకునే మార్పులు త్వరలోనే అనుకూలించగలవు. 
 
కుంభం: బ్యాంకు వ్యవహారాలలో పరిచయం లేని వ్యక్తులతో మితంగా సంభాషించండి. ఉద్యోగస్తులకు ఊహించని చికాకులు తలెత్తినా తెలివితో పరిష్కరించగలుగుతారు. దూరప్రయాణాలలో ఊహించని ధననష్టం జరిగే అవకాశం ఉంది జాగ్రత్త వహించండి. పుణ్యక్షేత్రాల దర్శనం వలన మానసిక ప్రశాంతత చేకూరుతుంది. 
 
మీనం: ఆర్థిక సమస్యలు, ఇతర చికాకులు తొలగి మానసికంగా కుదుటపడుతారు. ముఖ్యులకు బహుమతులు అందజేస్తారు. ప్రేమ వ్యవహారాల పట్ల ఆసక్తి కనబర్చటం వలన ఒత్తిడి, మందలింపులు ఎదుర్కొనక తప్పదు. ఋణం తీర్చడానికై చేయు యత్నాలు ఫలిస్తాయి. బంధుమిత్రుల రాకతో గృహంలో సందడికానవస్తుంది.