సోమవారం, 6 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By Raman
Last Updated : ఆదివారం, 12 ఆగస్టు 2018 (09:12 IST)

12-08-2018 - ఆదివారం మీ రాశి ఫలితాలు.. కానివేళలో ఇతరుల రాక ఇబ్బంది?

మేషం: ఆలయ సందర్శనాలలో స్త్రీలకు పరిచయాలు వ్యాపకాలు అధికమవుతాయి. బంధువుల కారణంగా మీ పనులు వాయిదా వేసుకుంటారు. స్థిరాస్తి అమ్మకం లేదా కొనుగోలు వాయిదా వేయడం మంచిది. పట్టువిడుపు ధోరణితో కొన్ని సమస్యలు పరి

మేషం: ఆలయ సందర్శనాలలో స్త్రీలకు పరిచయాలు వ్యాపకాలు అధికమవుతాయి. బంధువుల కారణంగా మీ పనులు వాయిదా వేసుకుంటారు. స్థిరాస్తి అమ్మకం లేదా కొనుగోలు వాయిదా వేయడం మంచిది. పట్టువిడుపు ధోరణితో కొన్ని సమస్యలు పరిష్కారం కాగలవు. రవాణా రంగాలలో వారికి ఒత్తిడి, చికాకులు తప్పవు. 
 
వృషభం: స్త్రీలకు శ్రమాధిక్యత, విశ్రాంతి లోపం, అకాల భోజనం వలన ఆరోగ్యం మందగిస్తుంది. కళత్ర మెుండివైఖరి మీకు చికాకు కలిగిస్తుంది. ఊహించని ఖర్చులు వలన స్వల్ప ఇబ్బందులు తప్పవు. కొబ్బరి, పండ్లు, పూలు, చల్లని పానీయ వ్యాపారులకు అనుకూలమైన కాలం. బంధువుల ఆసక్మిక రాకతో సందడి కానవస్తుంది.  
 
మిధునం: వృత్తుల వారికి లభించిన అవకాశాలు ఏమాత్రం సంతృప్తినీయవు. నిరుద్యోగులకు బోగస్ ప్రకటనల వలన అప్రమత్తత అవసరం. నూనె, ఎండుమిర్చి, పసుపు, ప్రత్తి, పొగాకు కంది వ్యాపారస్తులకు కలిసి వచ్చేకాలం. రాజకీయనాయకులు సభలు, సమావేశాలలో హుందాగా వ్యవహరించి అందరినీ ఆకట్టుకుంటారు. 
 
కర్కాటకం: సంఘంలో మీ మాటకు గౌరవం పెరుగుతుంది. స్త్రీలకు తల, కాళ్లు, చేతులు, నరాలకు సంబంధించిన చికాకులు అధికమవుతాయ. దంపతుల ఆలోచనలు పరస్పర విరుద్ధంగా ఉంటాయి. ఫ్యాన్సీ, రసాయనిక, సుగంధ ద్రవ్య, మందులు వ్యాపారస్తులకు కలిసి వచ్చేకాలం. పుణ్య కార్యక్రమాలలలో పాల్గొంటారు. 
 
సింహం: ప్రింటింగ్ రంగాలవారికి బాకీలు, వసూళ్ళలో శ్రమాధిక్యత, ప్రయాసలు తప్పవు. రుణం కొంత మెుత్తం తీర్చడంతో ఒత్తిడి నుండి కుదుడపడుతారు. సోదరీసోదరుల మధ్య అనురాగ వాత్సల్యాలు పెంపొందుతాయి. వృత్తి ఉపాధి పథకాల్లో స్థిరపడుతారు. మీ అతిధఇ మర్యాదలు అందరినీ ఆకట్టుకుంటాయి.   
 
కన్య: మీపై శకునాలు, చెప్పుడు మాటల ప్రభావం అధికం. అనుభవజ్ఞుల సలహా తీసుకోవడం ఉత్తమం. ద్విచక్ర వాహనంపై దూరప్రయాణం క్షేమం కాదు. బంధువుల రాకతో పనులు ఆలస్యంగా అయినా అనుకున్న విధంగా పూర్తి కాగలవు. తప్పనిసరి చెల్లింపులు, ఆసక్మిక ఖర్చుల వలన స్వల్ప ఆటుపోట్లు ఎదుర్కుంటారు. 
 
తుల: వ్యాపార రీత్యా ఆసక్మికంగా దూరప్రయాణాలు చేయవలసి వస్తుంది. బంధుమిత్రు రాకతో గృహంలో ప్రశాంతత నెలకొంటుంది. విద్యార్థులకు విదేశీ చదువుల అవకాశం లభిస్తుంది. ఇతరుల విషయాలకు దూరంగా ఉండాలి. ఆందోళన కలిగించిన సమస్య పరిష్కారమవుతుంది. ఉపాధి పథకాల్లో స్థిరపడుతారు.  
 
వృశ్చికం: పెద్దల సలహాను పాటించి మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు. మార్కెటింగ్, ఆడిటింగ్ రంగాల వారికి ఒత్తిడి అధికంగా ఉంటుంది. ఉపాధ్యాయులకు విశ్రాంతి లభిస్తుంది. హోటల్, కేటరింగ్ రంగాల్లో వారు పనివారలతో ఇబ్బందులను ఎదుర్కుంటారు. వ్యవసాయ రంగాలవారికి నూతన ఆలోచనలు స్పురిస్తాయి.   
 
ధనస్సు: ఏదైనా విలువైన స్థిరాస్తి అమర్చుకోవాలనే మీ కోరిక నెరవేరుతుంది. దూరప్రయాణాలలో తగుజాగ్రత్తలు అవసరం. దైవ, పుణ్య కార్యాల పట్ల శ్రద్ధాసక్తులు పెరుగుతాయి. మీ శ్రీమతి సలహా పాటించడం చిన్నతనంగా భావించకండి. మీ ఉత్సాహాన్ని అదుపులో ఉంచుకోవడం శ్రేయస్కరం. బహుమతులు అందజేస్తారు.
 
మకరం: కోళ్ళ, మత్స్య, పాడి పరిశ్రమ రంగాల్లో వారికి చికాకులు అధికమవుతాయి. కుటుంబీకులతో కలిసి ఉల్లాసంగా గడుపుతారు. ఎదుటివారితో ఎలా మాట్లాడినా తప్పుగానే భావిస్తారు. వాహనం ఇతరులకుఇచ్చి ఇబ్బందులను ఎదుర్కుంటారు. మీ మౌనం వారికి గుణపాఠమవుతుంది. మీ అభిరుచికి తగిన వ్యక్తితో పరిచయాలేర్పడుతాయి.
 
కుంభం: కానివేళలో ఇతరుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. యాదృచ్ఛికంగా ఒక పుణ్యక్షేత్రం సందర్శిస్తారు. కొత్తగా చేపట్టిన వ్యాపారాలలో క్రమంగా నిలదొక్కుకుంటారు. పత్రికా సిబ్బందికి వార్తల ప్రచురణలో పునరాలోచన మంచిది. ప్రతి స్వల్ప విషయానికి అసహాన ప్రదర్శిస్తారు. ఏ వ్యక్తికీ అతి చనువు ఇవ్వడం మంచిది కాదు. 
 
మీనం: మత్స్య, కోళ్ళ వ్యాపారస్తులకు లాభదాయకం. మీ ఉన్నతిని చాటుకోవాలనే ఉద్దేశ్యంతో ధనం విరివిగా వ్యయం చేస్తారు. నూతన ఒప్పందాలు కుదుర్చుకుంటారు. వీలైనంత వరకు మీ పనులు మీరే చూసుకోవడం ఉత్తమం. మీరెదుర్కున్న సమస్య బంధువులకు ఎదురవడంతో మీ కష్టాన్ని, ఆందోళనని గుర్తిస్తారు.