ఆదివారం, 12 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By raman
Last Updated : బుధవారం, 8 ఆగస్టు 2018 (08:58 IST)

బుధవారం (08-08-18) దినఫలాలు - నూతన దంపతుల మధ్య...

మేషం: కొత్త వ్యాపారాభివృద్ధికి శ్రమించాలి. స్వయం కృషితో రాణిస్తారు. విద్యార్థులకు కోరుకున్న టెక్నికల్, మెడికల్ కోర్సులలో ప్రవేశం లభిస్తుంది. స్థిరాస్తి క్రయవిక్రయాల్లో ప్రముఖుల సలహా పాటించడం మంచిది. బ

మేషం: కొత్త వ్యాపారాభివృద్ధికి శ్రమించాలి. స్వయం కృషితో రాణిస్తారు. విద్యార్థులకు కోరుకున్న టెక్నికల్, మెడికల్ కోర్సులలో ప్రవేశం లభిస్తుంది. స్థిరాస్తి క్రయవిక్రయాల్లో ప్రముఖుల సలహా పాటించడం మంచిది. బంధువుల రాకతో ఖర్చులు అధికమవుతాయి. సోదరీసోదరుల మధ్య విభేదాలు తలెత్తుతాయి.
 
వృషభం: ఆర్ధికపరమైన విషయాలతో పాటు పనిలో కూడా రాజీ పడవలసి వస్తుంది. వెండి, బంగారు, తాకట్టు వ్యాపారులకు శుభదాయకంగా ఉంటుంది. క్రీడా రంగాల వారికి చికాకులు తప్పవు. అవివాహితులకు అనుకూలమైన కాలం. ప్రముఖులను కలుసుకుంటారు. విద్యార్థులకు, విద్యా రంగాల వారికి మెళకువ అవసరం.
 
మిధునం: కళకారులకు, రచయితలకు పత్రికారంగాలలో వారికి మిశ్రమ ఫలితం. దూరప్రయాణాలు అనుకూలం. కాంట్రాక్టర్లలకు అధికారుల నుండి ఒత్తడి తప్పదు. నిరుద్యోగులు ఇంటర్వ్యూలలో శ్రద్ధ వహించండి. వాహనం విషయంలో సంతృప్తి కానవస్తుంది. క్రయవిక్రయ రంగాలలోని వారికి ప్రోత్సాహం కానవస్తుంది.
 
కర్కాటకం: నరాలు, పొట్ట, కాళ్లకి సంబంధించిన చికాకులను ఎదుర్కుంటారు. పండ్లు, పూల, కూరగాయ వ్యాపారులకు కలిసివస్తుంది. మీ కళత్ర వైఖరి మీకు ఎంతో ఆశ్చర్యం కలిగిస్తుంది. ఏదైనా అమ్మకానికి చేయు ప్రయత్నాలు ఫలిస్తాయి. సోదరీసోదరులతో ఏకీభవించలేకపోతారు. సన్నిహితులతో కలిసి చేపట్టిన పనులు సమీక్షిస్తారు. 
 
సింహం: ఆర్థిక ఇబ్బంది అంటూ ఉండదు. కోర్టు వ్యవహారాలు ప్రగతిపథంలో నడుస్తాయి. కాంట్రాక్టర్లకు నూతన టెండర్ల విషయంలో లౌక్యం అవసరం. బంధువులను కలుసుకుంటారు. సైన్స్, గణిత రంగాలలోవారికి గణనీయమైన పురోభివృద్ధి కానవస్తుంది. ఉద్యోగస్తులు తోటివారి కారణంగా అధికారులతో మాటపడవలసి వస్తుంది. 
 
కన్య: బంధుమిత్రులతో సంబంధ బాంధవ్యాలు బాగుగా ఉంటాయి. బ్యాంకు వ్యవహారాలలో ఆచితూచి వ్యవహరించండి. గృహంలో మార్పులు, చేర్పులకు కొంతకాలం వేచియుండటం మంచిది. మీ సంతానం మెుండివైఖరి మీకు చికాకు కలిగిస్తుంది. స్త్రీలకు వస్త్ర, వస్తులాభం వంటి శుభపరిణామాలు ఉంటాయి. 
 
తుల: చిన్న తరహా పరిశ్రమలు, చిరు వ్యాపారులకు ఆశాజనకంగా ఉంటుంది. ఖర్చులు సామాన్యంగా ఉంటాయి. విద్యార్థులు ఉన్నత విద్యలకోసం చేసే యత్నాలు అనుకూలిస్తాయి. రావలసిన ధనం చేతికందటంతో పొదుపు దిశగా మీ ఆలోచనలుంటాయి. ప్లీడర్లకు తమ క్లయింట్‌లు తీరు ఇబ్బందులకు గురిచేస్తుంది.
 
వృశ్చికం: ఉద్యోగ రీత్యా దూరప్రయాణాలు చేయవలసివస్తుంది. నిరుద్యోగులకు ఉపాధి పథకాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. కాంట్రాక్టర్లకు మిశ్రమ ఫలితాలు లభిస్తాయి. నూతన దంపతుల మధ్య సంతాన యోగం. పాత మిత్రుల కలయిక సంతృప్తినిస్తుంది. చేతి వృత్తులు, ప్రింటింగ్ రంగాలవారికి ఒత్తిడి, శ్రమ అధికమవుతాయి.  
 
ధనస్సు: ఆర్ధిక పరిస్థితి నిరాశపరుస్తుంది. తలపెట్టిన పనులు సునాయసంగా పూర్తిచేస్తారు. విద్యార్థినులు ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండడం మంచిది. ప్రముఖులను కలుసుకుంటారు. ఓర్పుగా ఎలా ఉండాలో నేర్చుకోవడం ఎంతైనా అవసరం. సంఘంలో మంచి గుర్తింపు లభిస్తుంది. దీర్ఘకాలిక రుణాలు తీరుస్తారు.
 
మకరం: గృహోపకరణాలు అమర్చుకుంటారు. వ్యాపారాలలో పోటీ పెరగడం వలన అధికంగా శ్రమించవలసి ఉంటుంది. ఉపాధ్యాయులకు విద్యార్థు వలన ఒత్తిడి, చికాకులను ఎదుర్కుంటారు. విదేశీ ప్రయాణాలు అనుకూలిస్తాయి. బిల్లులు చెల్లిస్తారు. రాజకీయ కళా రంగాలవారికి యోగదాయకంగా ఉంటుంది.  
 
కుంభం: ఒక స్థిరాస్తిని అమర్చుకోవాలనే ఆలోచన స్పురిస్తుంది. మిత్రుల సహాయంతో ఒక కార్యక్రమాన్ని పూర్తిచేస్తారు. కొత్త రుణాల కోసం అన్వేషిస్తారు. కుటుంబ విషయాలు పెద్దలతో చర్చించి నిర్ణయం తీసుకోవడం మంచిది. ఉద్యోగస్తులకు పనిభారం అధికమవుతుంది. స్త్రీలకు సంపాదన పట్ల ఆసక్తి పెరుగుతుంది. 
 
మీనం: ప్రైవేటు సంస్థలలోని వారి సేవలకు మంచి గుర్తింపు లభిస్తుంది. వృత్తుల వారికి శ్రమాధిక్యత మినహా ఆర్ధిక సంతృప్తి ఆశించినంతగా ఉండదు. ప్రయాణాలలోను, బ్యాంకు వ్యవహారాలలోను మెళకువ అవసరం. స్వయం కృషితో అనుకున్నది సాధిస్తారు. ఖర్చులు ఊహించనివి కావడంతో యత్నాలు తప్పవు.