గురువారం, 26 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By raman
Last Updated : శుక్రవారం, 3 ఆగస్టు 2018 (08:43 IST)

శుక్రవారం (03-08-18) దినఫలాలు - ఆధ్యాత్మిక చింతన....

మేషం: నూతన పెట్టుబడుల వ్యవహారంలో ఒక నిర్ణయానికి వస్తారు. దూరప్రయాణాలలో వస్తువు పట్ల మెళకువ అవసరం. ఆత్మీయు కిచ్చిన మాట నిలబెట్టుకుంటారు. బంధుమిత్రులతో సఖ్యత నెలకొంటుంది. స్త్రీలకు ఆరోగ్యంలో తగు జాగ్రత్

మేషం: నూతన పెట్టుబడుల వ్యవహారంలో ఒక నిర్ణయానికి వస్తారు. దూరప్రయాణాలలో వస్తువు పట్ల మెళకువ అవసరం. ఆత్మీయు కిచ్చిన మాట నిలబెట్టుకుంటారు. బంధుమిత్రులతో సఖ్యత నెలకొంటుంది. స్త్రీలకు ఆరోగ్యంలో తగు జాగ్రత్తలు అవసరం. ప్రతి విషయం మీ జీవితభాగస్వామికి తెలియజేయడం మంచిది.
 
వృషభం: రిప్రజెంటేవివ్‌లు, పోస్టల్, ఎల్.‌ఐ.సి ఏజెంట్లు టార్గెట్లను అధికమిస్తారు. మీ కళత్ర మెుండివైఖరి మీకు చికాకు కలిగిస్తుంది. ఆస్తి పంపకాల విషయమై పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు. రేషన్ డీలర్లు, నిత్యావసర వస్తు స్టాకిస్టులకు అధికారుల తనిఖీలు ఆందోశన కలిగిస్తాయి. స్త్రీలకు పనివారలతో చికాకులు తప్పవు. 
 
మిధునం: ఆర్ధిక వ్యవహారాలు, నూతన పెట్టుబడులకు సంబంధించి స్పష్టమైన నిర్ణయానికి వస్తారు. భార్య, భర్తల మధ్య విబేధాలు తలెత్తవచ్చు. కోర్టు వ్యవహారాలు వాయిదాపడుట మంచిది. మాటలతో ఎదుటివారిని ఆకట్టుకుంటారు. స్వయంకృషితో అనుకున్నది సాధిస్తారు. వ్యాపారాభివృద్ధికి మరింతగా శ్రమించాల్సి ఉంటుంది. 
 
కర్కాటకం: పత్రిక, ప్రైవేటు సంస్థలలోని వారికి మార్పులు అనుకూలం. సినిమా, విద్యా కార్యక్రమాలలో పాల్గొంటారు. వర్తమానంపై మరింత దృష్టిపెట్టండి. చేపట్టిన ప్రాజెక్టులలో జాప్యం ఎదురవ్వచ్చు. ధనం ఏమాత్రం నిల్వచేయలేకపోతారు. గతంలో జరిగిన తప్పుల నుంచి మంచిని నేర్చుకోండి. కుటుంబీకుల ప్రేమకు మరింత దగ్గరవుతారు. 
 
సింహం:  ఆర్ధిక ఇబ్బందులు లేకపోయినా వెలితిగా ఉంటుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వస్త్ర, ఫ్యాన్సీ, పచారీ, మందులు, రసాయ, సుగంధ ద్రవ్య వ్యాపారులకు పురోభివృద్ధి కానవస్తుంది. ఒక వ్యవహారం నిమిత్తం ప్లీడర్లతో సంప్రదింపులు జరుపుతారు. ప్రముఖులతో పరిచయాలు, వ్యాపకాలు అధికమవుతాయి.
 
కన్య: దైవారాధన పట్ల ఆసక్తి పెరుగుతుంది. సోదరీసోదరుల మధ్య సఖ్యతా లోపం, కలహాలు చోటు చేసుకుంటాయి. విద్యార్థులు ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండడం శ్రేయస్కరం. బ్యాంకు వ్యవహారాలలో అపరిచిత వ్యక్తులపట్ల మెళకువ అవసరం. కొంతమంది మిమ్ములను తప్పుదారి పట్టించేందుకు యత్నిస్తారు. 
 
తుల: ఆఫీసులో తొందరపాటు నిర్ణయాలతో కాక, మీ సినీయర్ల సలహాలను తీసుకొని ముందుకు సాగండి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. స్థిరాస్తి, క్రయవిక్రయం విషయంలో మంచి లాభం ఉంటుంది. వాహనం ఇతరులకు ఇచ్చి సమస్యలను ఎదుర్కుంటారు. పాత ప్రాజెక్టులనను దిగ్విజయంగా పూర్తి చేస్తారు.
 
వృశ్చికం: స్త్రీలకు శ్రమ, బంధువుల మధ్య ఏర్పడిన సందిగ్ధ పరిస్థితులు తీరిపోతాయి. ఉద్యోగస్తులు అపరిచిత వ్యక్తుల వలన చిక్కుల్లో పడే ఆస్కారం ఉంది. కాంట్రాక్టర్లకు మిశ్రమ ఫలితం. రవాణా రంగాలలో వారికి మిశ్రమ ఫలితం కానవస్తుంది ప్రముఖులను కలుసుకుంటారు. ఆకస్మికంగా సన్నిహితులతో మార్పులు కానవస్తాయి.  
 
ధనస్సు: వృత్తి వ్యాపారాలు సంతృప్తిగా సాగుతాయి. విదేశీయానం కోసం చేసే యత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగస్తులకు పై అధికారుల నుండి మంచి గుర్తింపు లభిస్తుంది. స్త్రీలకు ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తుతాయి. ఫైనాన్స్, చిట్‌ఫండ్ రంగాలలో వారికి చికాకులు తప్పవు. రుణం ఏ కొంతైనా తీర్చాలనే మీ లక్ష్యం నెరవేరుతుంది. 
 
మకరం: స్త్రీలకు షాపింగ్ వ్యవహారాలు, అపరిచిత వ్యక్తుల విషయంలోను అప్రమత్తత అవసరం. సొంతంగా వ్యాపారం చేయాలనే దృక్పథం బలపడుతుంది. నిరుద్యోగులకు సదవకాశాలు లభించినప్పటికి వాటిని సద్వినియోగం చేసుకోలేకపోతారు. ఇంజనీరింగ్, మెడికల్, కంప్యూటర్, శాస్త్ర రంగాల వారికి పురోభివృద్ధి. 
 
కుంభం: ఆర్ధిక విషయాల్లో కొంత మేరకు పురోగతి సాధిస్తారు. కొబ్బరి, పండ్ల, పూల, కూరగాయాలు, చిరు వ్యాపారులకు పురోభివృద్ధి కానవస్తుంది. ఉపాధ్యాయులకు ఒత్తిడి, పనిభారం తప్పవు. బంధువులతో చిన్న చిన్న కలహాలు జరిగే ఆస్కారం ఉంది. శత్రువులు సైతం మిత్రులుగా మారి సహాయ సహకారాలు అందిస్తారు. 
 
మీనం: కుటుంబీకులతో స్వల్ప విభేదాలు తలెత్తినా నెమ్మదిగా సమసిపోతాయి. దంపతుల మధ్య అవగాహనా లోపం. సంఘంలో మీ మాటకు, గౌరవ మర్యాదలు లభిస్తాయి. మీ నైపుణ్యతకు, సామర్ధ్యమునకు తగినటు వంటి గుర్తింపు లభిస్తుంది. పాత రుణాలు తీర్చడంటో పాటు విలువైన పరికరాలు అమర్చుకుంటారు.