మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By raman
Last Updated : మంగళవారం, 31 జులై 2018 (08:53 IST)

మంగళవారం (31-07-2018) దినఫలాలు - వీలైనంత వరకు మీ పనులు...

మేషం: బంగారం వ్యాపారుల పనివారలకు ఊహించని చికాకులు తలెత్తుతాయి. వీలైనంత వరకు మీ పనులు మీరే చూసుకోవడం ఉత్తమం. స్త్రీలకు ఇరుగుపొరుగు వారితో సఖ్యత అంతగా ఉండదు. విదేశీయానం కోసం చేసే యత్నాలు అనుకూలిస్తాయి.

మేషం: బంగారం వ్యాపారుల పనివారలకు ఊహించని చికాకులు తలెత్తుతాయి. వీలైనంత వరకు మీ పనులు మీరే చూసుకోవడం ఉత్తమం. స్త్రీలకు ఇరుగుపొరుగు వారితో సఖ్యత అంతగా ఉండదు. విదేశీయానం కోసం చేసే యత్నాలు అనుకూలిస్తాయి. మీ ముఖ్యుల కోసం ధనం బాగుగా వెచ్చించవలసి ఉంటుంది.
 
వృషభం: కుటుంబీకుల మధ్య కొత్త విషయాలు చర్చకు వస్తాయి. సన్నిహితుల నుండి ఒక ముఖ్య సమాచారం అందుకుంటారు. వృదా ఖర్చులు అధికంగా ఉంటాయి. గతంతో పోల్చుకుంటే ప్రస్తుత ఆర్థికస్థితి కొంత మెరుగనిపిస్తుంది. సందర్భోచితంగా నిర్ణయాలు తీసుకోవడం వలన కొన్ని వ్యవహారాలు మీకు లాభిస్తాయి.
 
మిధునం: దంపతుల మధ్య చికాకులు అధికమవుతాయి. మీ మంచితనంతో ఇతరులు లబ్ధి పొందుతారు. నిరుద్యోగుల ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. వార్తా సంస్థలలోని వారికి మార్పులు అనుకూలిస్తాయి. రావలసిన పత్రాలు, రశీదులు చేతికందుతాయి. రుణ, విదేశీయాన యత్నాల్లో కొంత పురోగతి కనిపిస్తుంది. 
 
కర్కాటకం: స్త్రీలకు స్వీయ సంపాదన పట్ల ఆసక్తి ఏర్పడుతుంది. విద్యార్థినులకు కొత్త పరిచయాలు సంతృప్తినిస్తాయి. మీ బలహీనతలు, అలవాట్లు అదుపులో ఉంచుకోవడం మంచిది. బంధువుల రాకతో గృహంలో సందడి నెలకొంటుంది. వస్త్ర, బంగారం, ఫ్యాన్సీ, మందులు, ఆల్కహాలు వ్యాపారాలు ఊపందుకుంటాయి. 
 
సింహం: కొబ్బరి, పండ్లు, పూల, కూరగాయల వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. స్త్రీల సృజనాత్మకతకు తగిన గుర్తింపు, రాణింపు లభిస్తుంది. ఏ విషయంలోను ఒంటెద్దు పోకడ మంచిది కాదు. తీర్థయాత్రలు, దూర ప్రయాణాలు అనుకూలిస్తాయి. వైద్య, ఇంజనీరింగ్ రంగాల్లో వారికి మెళకువ అవసరం. స్త్రీలు కళా రంగాల్లో రాణిస్తారు.
 
కన్య: పొదుపు పథకాలు, వ్యాపారాల విస్తరణలు అనుకూలిస్తాయి. ఉద్యోద విరమణ చేసిన వారికి తోటివారు సాదర వీడ్కోలు పలుకుతారు. మీ సంతానం ఉన్నత విద్యల గురించి అవిశ్రాంతంగా శ్రమిస్తారు. బంధువుల రాకతో స్త్రీలకో ఉత్సాహం చోటు చేసుకుంటుంది. ప్రముఖ కంపెనీల షేర్లు నష్టాల బాటలో నడుస్తాయి.
 
తుల: బ్యాంకు వ్యవహారాల్లో అపరిచిత వ్యక్తుల పట్ల ఏకాగ్రత వహించండి. దైవ, సేవా, పుణ్యే కార్యాల్లో పాల్గొంటారు. స్త్రీలకు ప్రకటనలు, స్కీముల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఆకస్మిక ఖర్చులు వలన స్వల్ప ఒడిదుడుకులు ఎదుర్కుంటారు. శ్రమాధిక్యత మినహా ఆశించిన ఫలితాలు పొందలేరు. నూతన పరిచయాలు, వ్యాపకాలు అధికమవుతాయి. 
 
వృశ్చికం: కుటుంబంలో మనస్పర్థలు, చికాకులు తొలగి ప్రశాంతత నెలకొంటుంది. వ్యాపారాల్లో నష్టాలను కొంత మేరకు అధికమిస్తారు. ఒక కార్యం నిమిత్తం ఆకస్మిక ప్రయాణం తలపెడుతారు. నిరుద్యోగులకు అవకాశం చేజారిపోయే ఆస్కారం ఉంది. రియల్‌ఎస్టేట్ రంగాలవారికి నూతన వెంచర్ల విషయంలో మెళకువ అవసరం. 
 
ధనస్సు: సోదరీసోదరుల మధ్య అవగాహన ఏర్పడుతుంది. కొత్త ప్రాజెక్టులు చేపడతారు. ఆదాయం గత సంవత్సరం కంటే మెరుగుగా ఉండవచ్చు. రాజకీయనాయకులు చర్చల విషయంలో స్పష్టమైన నిర్ణయానికి వస్తారు. పత్రిగా సంస్థలలోని వారికి కీలకమైన వార్తల ప్రచురణలో ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది.  
 
మకరం: తలపెట్టిన పనులు నిర్విఘ్నంగా పూర్తిచేస్తారు. అడిటర్లకు నెమ్మదిగా మార్పు కానవస్తుంది. సొంతంగా వ్యాపారం చేసినా పురోభివృద్ధి చెందుతారు. వాహనం చోదకులకు చికాకులు తప్పవు. రాజకీయాలలోని వారికి ఒక సమాచారం ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. రుణ విముక్తులు కావడంతో పాటు కొత్త రుణాలు అనుకూలిస్తాయి. 
 
కుంభం: ఇంట్లో మార్పులు చేర్పులు అసౌకర్యం కలిగిస్తాయి. రుణ విముక్తులు కావడంతో పాటు కొత్త రుణాలు అనుకూలిస్తాయి. చిన్నారులు, ప్రియతములతో ఉల్లాసంగా గడుపుతారు. శ్రీవారు, శ్రీమతితో ప్రయాణాలు, సంభాషణలు అనుకూలిస్తాయి. తెలివితేటలతో వ్యవహరించడం వలన కొన్ని వ్యవహారాలు మీకు అనుకూలిస్తాయి.
 
మీనం: రాజకీయనాయకులు సభలు, సమావేశాలు, బృంద కార్యక్రమాల్లో పాల్గొంటారు. చిన్నారుల, విద్య, ఖరీదైన వస్తువుల కొనుగోలు విషయాల్లో ఖర్చులు అంచనాలు మించుతాయి. ఉద్యోగస్తులకు రావలసిన అలవెన్సులు, క్లైమ్‌లు మంజూరవుతాయి. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాలవారికి సామాన్యంగా ఉంటుంది.