శనివారం, 28 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By రామన్
Last Updated : ఆదివారం, 3 ఫిబ్రవరి 2019 (10:02 IST)

03-02-2019 ఆదివారం దినఫలాలు - స్త్రీలకు షాపింగ్ వ్యవహారాలలో..

మేషం: ఆర్థిక విషయాల్లో సహోద్యోగులు మొహమాట పెట్టె ఆస్కారం ఉంది. అందరితో కలిసి విందు వినోదాలలో పాల్గొంటారు. కాంట్రాక్టర్లకు రావలసిన ధనం కొంత ముందు వెనుకలుగానైనా పూర్తిగా అందుతుంది. గృహానికి కావలసిన వస్తువులు కొనుగోలుచేస్తారు. హోటల్, క్యాటరింగ్ రంగాల్లోవారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కుంటారు.
 
వృషభం: క్రీడా, కళా, సాంస్కృతిక రంగాల పట్ల ఆసక్తి వహిస్తారు. నిత్యవసర వస్తు వ్యాపారులకు, స్టాకిస్టులకు పురోభివృద్ధి. ముందుచూపుతో వ్యవహరించడం మంచిది. బంధువులు, సోదరుల మధ్య సత్సంబంధాలు నెలకొంటాయి. స్త్రీలకు షాపింగ్ వ్యవహారాలలో మెళకువ అవసరం. విదేశీ వస్తువుల పట్ల ఆసక్తి పెరుగుతుంది. 
 
మిధునం: ఆర్థిక ఒడిదుడుకులు తలెత్తిన మిత్రుల సహకారం వలన సమసిపోగలవు. సన్నిహితులతో కలిగి దైవ, శుభకార్యాలలో పాల్గొంటారు. క్యాటరింగ్ రంగాలలో వారికి ఒత్తిడి, పనిభారం అధికమవుతాయి. స్త్రీలకు పనివారలతో చికాకులు తప్పవు. మీ సంతానం వివాహ, విద్యా విషయాల పట్ల శ్రద్ధ వహిస్తారు. 
 
కర్కాటకం: దైవ, సేవా కార్యక్రమాలకు దానధర్మాలు చేయడం వలన మీ కీర్తి, ప్రతిష్టలు ఇనుమడిస్తాయి. రావలసిన ధనం చేతికందటంతో రుణం తీర్చాలనే మీ యత్నం నెరవేరగలదు. నిరుద్యోగులకు పోటీ పరీక్షలలో, ఇంటర్వ్యూలలో నిరాశ తప్పదు. స్త్రీలతో కలహాలు, దానధర్మాలు చేయడం వలన మీ కీర్తి, ప్రతిష్టలు ఇనుమడిస్తాయి.   
 
సింహం: చేనేత, కలంకారీ, ఖాదీ, నూలు వస్త్ర వ్యాపారులకు లాభదాయకం. ఊహించని ఖర్చులుంటాయి. రేపటి గురించి ఆందోళన చెందుతారు. ప్రేమికుల మధ్య విభేదాలు తలెత్తుతాయి. పండ్లు, పూల, కొబ్బరి వ్యాపారస్తులకు పురోభివృద్ధి కానవస్తుంది. రాజకీయనాయకులు తరచు సభావేశాలలో పాల్గొంటారు. 
 
కన్య: స్త్రీలకు విదేశీ వస్తువుల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఏ వ్యక్తికీ పూర్తిగా బాధ్యతలు అప్పగించడం మంచిది కాదని గమనించండి. ద్విచక్ర వాహనంపై ప్రయాణాలు మంచిది కాదని గమనించండి. గృహంలో ఏదైనా వస్తువు పోయేందుకు ఆస్కారం ఉంది. మెళకువ వహించండి. ఆంతరంగిక వ్యాపార విషయాలు గోప్యంగా ఉంచండి.  
 
తుల: కుటుంబీకులతో కలిగి విందు, వినోదాలలో పాల్గొంటారు. బంధువుల రాకతో వస్త్ర, విలువైన వస్తువులు కొనుగోళ్ళు నిమిత్తం ధనం విరివిగా వ్యయం చేస్తారు. నిరుద్యోగులకు పోటీ పరీక్షలలో, ఇంటర్వ్యూలలో నిరాశ తప్పదు. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలేర్పడుతాయి. ప్రముఖుల కలయిక ప్రయోజనకరంగా ఉంటుంది. 
 
వృశ్చికం: ఆర్థిక లావాదేవీలు సమర్థంగా నిర్వహిస్తారు. తలపెట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. కొత్త ఆదాయ మార్గాల అన్వేషణ ఫలిస్తుంది. వాహనం నడుపుతున్నప్పుడు ఏకాగ్రత అవసరం. స్త్రీలకు పరిచయాలు, వ్యాపకాలు అధికమవుతాయి. మీ సంతానం మొండివైఖరి మీకు చికాకు కలిగిస్తుంది. సోదరులతో విభేధాలు తలెత్తుతాయి.  
 
ధనస్సు: కుటుంబీకులతో ఆనందంగా గడుపుతారు. మిత్రుల రాక సంతోషం కలిగిస్తుంది. ఆకస్మిక ప్రయాణాలు చేయవలసివస్తుంది. మత్స్య, కోళ్ళ వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. మీరు చేసే కృషి వలన మీ ప్రతిభ వెలుగులోనికి వచ్చి మంచి విజయం సాధిస్తారు. కానివేళలో ఇతరులరాక ఇబ్బంది కలిగిస్తుంది. 
 
మకరం: గృహానికి కావలసిన వస్తువులను కొనుగోలుచేస్తారు. సొంత వ్యాపారాలు ఆశించినంత సంతృప్తికరంగా ఉండవు. క్రయవిక్రయాల్లో దూకుడు తగదు. విద్యార్థులకు మిత్ర బృందాలు పెరుగుతాయి. దంపతుల మధ్య పలు ఆలోచనలు చోటుచేసుకుంటాయి. ఎప్పటి సమస్యలు అప్పుడే పరిష్కరించడం మంచిది.    
 
కుంభం: స్త్రీల సృజనాత్మకతకు గుర్తింపు, రాణింపు లభించగలదు. గత విషయాలు జ్ఞప్తికి రాగలవు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఖర్చులు ప్రయోజనకరంగా ఉంటాయి. కొత్త వ్యక్తులతో ఆచితూచి వ్యవహరించండి. స్థిరచరాస్తుల వ్యవహారాలు ఒకంతట పరిష్కారం కాకపోవడంతో ఆందోళన చెందుతారు.   
 
మీనం: మీ శ్రీమతి ఆరోగ్యంలో ఇబ్బందులు ఎదుర్కోవలసివస్తుంది. విందులలో పరిమితి పాటించండి. నిత్యవసర వస్తు ధరలు అధికమవుతాయి. మీ పట్ల ముభావంగా ఉండే వ్యక్తులు మీకు దగ్గరయ్యేందుకు యత్నిస్తారు. మీ ఉత్సాహాన్ని అదుపులో ఉంచుకోవడం శ్రేయస్కరం. యాదృచ్ఛికంగా ఒక పుణ్యక్షేత్రం సందర్శిస్తారు.