ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By రామన్
Last Updated : గురువారం, 31 జనవరి 2019 (09:04 IST)

31-01-2019 గురువారం దినఫలాలు - వృత్తుల వారికి... కొనుగోలుదార్లతో..

మేషం: ప్లీడర్లకు తమ క్లయింట్‌లు తీరు ఇబ్బందులకు గురిచేస్తుంది. మీ మంచి కోరుకునేవారి కంటే మీ చెడును కోరేవారే ఎక్కువగా ఉన్నారు. దూరప్రయాణాలు అనుకూలిస్తాయి. ఉద్యోగస్తులు అధికారుల వలన సమస్యలు తలెత్తినా మిత్రుల సహకారం వలన సమసిపోతాయి. మీ వ్యక్తిగత విషయాలు బయటకి తెలియజేయండి.
 
వృషభం: ఆదాయ వ్యయాలలో ప్రణాళికా బద్దంగా వ్యవహరిస్తారు. గతం కంటే ఆరోగ్యం మెరుగుగా ఉంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు అధికంగా ఉన్నయి. ప్రయత్నించండి. మీ సమర్థతపై ఎదుటివారికి నమ్మకం కలుగుతుంది. ఎదుటివారిని తక్కువ అంచనా వేయడం మంచిది కాదు. బంధువుల రాక ఇబ్బందులగు గురిచేస్తుంది. 
 
మిధునం: నిరుద్యోగులకు బోగస్ ప్రకటనల పట్ల అప్రమత్తత అవసరం. చేపట్టిన పనులు విసుకుగు కలిగించినా మొండిగా పూర్తిచేస్తారు. దైవ భక్తిలో ప్రతి కార్యక్రమాలు పూర్తి చేసుకోవాలి. కొత్తగా రుణం కోసం అన్వేషిస్తారు. ఎదుటివారిని తక్కువ అంచనా వేయడం మంచిది కాదు. బంధువుల రాక ఇబ్బందులకు గురిచేస్తుంది. 
 
కర్కాటకం: స్త్రీలకు నడుము, నరాలు, ఎముకలకు సంబంధించిన చికాకులు అధికమవుతాయి. మీ వృత్తికి సంబంధించిన వ్యవహారాలను శ్రద్ధగా మలచుకోవడం వల్లనే వాటికి పరిష్కారం లభిస్తుంది. కొన్ని విషయాల్లో అంచనాలు తారుమారవుతాయి. ప్రేమికులకు పెద్దల నుండి ప్రోత్సాహం, సన్నిహితుల సహకారం ఉంటాయి.  
 
సింహం: ఆదాయం రావడం, ఖర్చు చేయడం అన్నీ కూడా మీ ఇష్టానుసారంగా జరిగి మీరు అనందించేలా ఉంటాయి. ద్విచక్ర వాహనంపై దూరప్రయాణాలు మంచిది కాదని గమనించండి. ఉద్యోగస్తులు ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు వంటివి అందుకుంటారు. స్థిరాస్తి లేక ఇంటికి సంబంధించిన వ్యవహారాలు సఫలికృతమవుతాయి.  
 
కన్య: స్థిరాస్తి లేక ఇంటికి సంబంధించిన వ్యవహారాలు సఫలికృతం అవుతాయి. సోదరీసోదరులతో కులాసాగా గడుపుతారు. పుణ్యక్షేత్ర దర్శనములు తేలికగా పూర్తి చేయగలుగుతారు. కొబ్బరి, పండ్లు, కూరగాయలు, పూల వ్యాపారస్తులకు లాభదాయకం. భారవంతమైన పనులు కూడా మనసుకు బాధలేకుండి పూర్తిచేస్తారు.  
 
తుల: దైవ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. చేపట్టిన పనులు ఆశించినంత చురుకుగా సాగవు. చిన్ననాటి స్నేహితుల నుండి వచ్చిన ఆహ్వానాలు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. బంధువులతో కలహాలు రాకుండా జాగ్రత్త పడడం అవసరం. స్త్రీలకు షాపింగ్‌లోను, వాహనం నడుపుతున్నప్పుడు ఏకాగ్రత అవసరం. 
 
వృశ్చికం: కుటుంబంలో అదనపు బరువు బాధ్యతలు అధికమవుతాయి. పారితోషికాలు అందుకుంటారు. మీ ఆలోచనలు స్థిమితంగా ఉండవు. ప్రతి చిన్న విషయానికి ఆందోళన చెందుతారు. పాత బాకీలు అనుకోకుండా వసూలవుతాయి. మీ భవిష్యత్తుకు ఉపయోగపడేటు వంటి స్నేహితులు మీకు కొత్తగా పరిచయమవుతారు. 
 
ధనస్సు: ఉద్యోగస్తుల సమర్థతను అధికారులు గుర్తిస్తారు. ప్రముఖులతో పరిచయాలు పెంచుకుంటారు. వృత్తుల వారికి ప్రజా సంబంధాలు బలపడుతాయి. షాపు పనివారలు, కొనుగోలుదార్లతో లౌక్యంగా మెలగండి. కొత్త ప్రయత్నాలు ఏమి చేయవద్దు. దైవ దర్శనాలలో చికాకులు తప్పవు. ప్రభుత్వ కార్యక్రమాలలోని పనులూ సానుకూలమవుతాయి. 
 
మకరం: నిరుద్యోగులు వచ్చిన తాత్కాలిక అవకాశాన్ని అందిపుచ్చుకోవడం ఉత్తమం. ప్రయణాలు అనుకున్నంత సజావుగా సాగవు. ఉమ్మడి వ్యవహారాలు, ఒప్పందాల్లో ఏకాగ్రత అవసరం. స్త్రీలు కళాత్మక పోటీల్లో రాణిస్తారు. ఉపాధ్యాయుల శ్రమకు గుర్తింపు లభిస్తుంది. బంధువుల రాకతో ఖర్చులు అధికమవుతాయి.     
 
కుంభం: పత్రికా, ఎలక్ట్రానిక్ మీడియా వారికి ఒత్తిడి అధికమవుతాయి. ఆత్మీయులు, కుటుంబీకులతో ఉల్లాసంగా గడుపుతారు. మీ శ్రీమతి సలహా పాటించడం శ్రేయస్కరం. షేర్ల క్రయవిక్రయాలు ఆశించినంత లాభసాటికావు. విద్యార్థినులు ప్రేమ వ్యవహారాల్లో లౌక్యంగా ఉండాలి. కోర్టు వాయిదాలకు హాజరవుతారు.  
 
మీనం: స్త్రీలకు వాహనయోగం, కానుకలు, పారితోషికాలు అందుతాయి. వ్యాపారాల్లో లాభనష్టాలను సమీక్షించుకుంటారు. ఖర్చులు పెరిగినా భారమనిపించవు. అధిక శ్రమ, నిద్రలేమి వలన అస్వస్థతకు గురవుతారు. బ్యాంకు పనులు అనుకూలిస్తాయి. నూతన గృహం కొనుగోలు ప్రయత్నంలో ఉన్నావారికి పనులు వేగంగా సాగుతాయి.