మంగళవారం, 31 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By
Last Updated : శుక్రవారం, 25 జనవరి 2019 (08:42 IST)

25-01-2019 శుక్రవారం దినఫలాలు.. వ్యాపారాల్లో నిలదొక్కువాలంటే...

మేషం: వృత్తి ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. విద్యార్థినులకు ప్రేమ వ్యవహారాల్లో చుక్కెదురవుతుంది. ఉద్యోగస్తులకు యూనియన్ వ్యవహారాలతో హడావుడిగా ఉంటారు. రావలసిన ధనం సమయానికి అందడంతో కుదుటపడుతారు. దైవదర్శనాలలో ఇబ్బందులను ఎదుర్కుంటారు. కోర్టు, ఆస్తి, స్థల వివాదాలు నిరుత్సాహపరుస్తాయి. 
 
వృషభం: బ్యాంకుల్లో మీ పనుల్లో స్వల్ప ఆటంకాలు ఎదుర్కోవలసి వస్తుంది. ఉపాధ్యాయులకు, మార్కెటింగ్ రంగాల వారికి ఒత్తిడి అధికమవుతుంది. ఆడిట్, అక్కౌంట్క్ రంగాల వారికి ఒత్తిడి, పనిభారం అధికంగా ఉంటాయి. ఇతరుల స్థితిగతులలో పోల్చుకోవద్దు. వ్యాపారాల్లో ఆశించిన లాభాలు లేకున్నా నష్టాలను అధిగమిస్తారు. 
 
మిధునం: వ్యాపారాల్లో నిలదొక్కుకోవడానికి మరింతగా శ్రమించాలి. ఆదాయానికి తగ్గట్టుగా వ్యయాలు రూపొందించుకుంటారు. ప్లీడర్లతో సంప్రదింపులు జరుపుతారు. ప్రయాణంలో వస్తువుల పట్ల మెళకువ అవసరం. ఉపాధ్యాయులకు యాజమాన్యం ఒత్తిడి అధికమవుతుంది. దంపతుల మధ్య కొత్త విషయాలు చర్చకు వస్తాయి.  
 
కర్కాటకం: అదనపు రాబడిపై దృష్టి సారిస్తారు. ప్రతి విషయంలోను కొత్త ఉత్సాహంతో శ్రమిస్తారు. సంప్రదింపులు, సమావేశాల్లో ప్రముఖంగా వ్యవహరిస్తారు. మ శ్రీమతితో కొత్త విషయాలు ప్రస్తావిస్తారు. మీ సంతానం మొండితనం ఇబ్బందులకు దారితీస్తుంది. బ్యాంకు పనులు వాయిదా పడడం వలన నిరుత్సాహం చెందుతారు.  
 
సింహం: పెద్దమొత్తం ధనసహాయం క్షేమం కాదు. మీ సంతానం భవిష్యత్తుకోసం చక్కని ప్రణాళికలు రూపొందించుకుంటారు. వాహనం నిదానంగా నడపడం శ్రేయస్కరం. వివాదాల్లో మీ ప్రమేయం లేకుండా జాగ్రత్త వహించండి. ప్రియతముల అనారోగ్యం ఆందోళన కలిగిస్తుంది. పోగొట్టుకున్న పత్రాలు తిరిగి పొందుతారు. 
 
కన్య: మీ శ్రీమతితో అనునయంగా మెలగండి. లీజు, ఏజెన్సీలు, కాంట్రాక్టులు అనుకూలిస్తాయి. వ్యవహారాల్లో మొహమ్మాటాలకు తావివ్వకండి.  ప్రయాణాల్లో చికాకులు తప్పవు. దైవ, సేవా, సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. కోర్టు వాదోపవాదాల్లో ప్లీడర్లు రాణిస్తారు. విద్యార్థుల ఆలోచనులు పక్కదారి పట్టే సూచనలున్నాయి.   
 
తుల: ఒక స్థిరాస్తి కొనుగోలుకు అడ్డంకులు తొలగిపోగలవు. ఆలయాలను సందర్శిస్తారు. మీ యత్నాలు గుంభనంగా సాగించాలి. మీ సంతానం భవిష్యత్తు కోసం పొదుపు పథకాలు చేపడతారు. ఒక సమస్య నుండి గట్టెక్కుతారు. కుటుంబ విషయాలపై దృష్టి సారిస్తారు. నూతన దంపతుల మధ్య ప్రేమానుబంధాలు బలపడుతాయి. 
 
వృశ్చికం: ఇంటాబయటా ప్రశాంతత నెలకొంటుంది. హామీలు, ఒప్పందాల్లో మీ శ్రీమతి అభిప్రాయం తెలుసుకోవడం ఉత్తమం. కొబ్బరి, పండ్లు, పూలు, చిరువ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. ఓర్పుతో సర్దుకుపోవడానికి యత్నించండి. పాత బాకీలు వసూలవుతాయి. ఉద్యోగస్తులకు అధికారులతో పర్యటనలుంటాయి.  
 
ధనస్సు: కళా, క్రీడా, సాంకేతిక రంగాల వారికి ప్రోత్సాహకరం. పత్రికా సిబ్బందికి ఒత్తిడి, పనిభారం అధికం. వృత్తి వ్యాపారాల్లో రాణిస్తారు. కొత్తగా వచ్చిన అధికారులతో సత్సంబంధాలు నెలకొంటాయి. ఇష్టం లేకున్నా కొన్ని విషయాల్లో సర్దుకుపోవలసి ఉంటుంది. ఉద్యోగ బాధ్యతల్లో మార్పులు సంభవం. కొత్త వ్యక్తులకు దూరంగా ఉండాలి.  
 
మకరం: వృత్తిపరంగా చిన్న చిన్న చికాకులు ఎదుర్కుంటారు. కోర్టు వాయిదాలు విసుగు కలిగిస్తాయి. వ్యాపారాల అభివృద్ధికి చేపట్టిన పథకాలు మంచి ఫలితాలిస్తాయి. ఆపద సమయంలో బంధువులు అండగా నిలుస్తారు. శ్రమకు తగిన ప్రతిఫలం అందుతుంది. భాగస్వామిక సమావేశాలు వాయిదా పడుతాయి.     
 
కుంభం: ఆర్థిక లావాదేవీలు, వ్యవహార ఒప్పందాల్లో జాగ్రత్త అవసరం. అగ్రిమెంట్లు, బయానా చెల్లింపుల్లో మెళకువ వహించండి. కిట్టని వారు మిమ్ములను తప్పుదారి పట్టించేందుకు యత్నిస్తారు. సంఘంలో మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. నిరుద్యోగులు వచ్చిన అవకాశాన్ని తక్షణం వినియోగించుకోవాలి.   
 
మీనం: ఆలయాలను సందర్శిస్తారు. ఆస్తి, స్థల వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. మితిమీరిన ఆలోచనలు మీ మనస్సును వ్యాకుల పరుస్తాయి. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. కొబ్బరి, పండ్లు, పూలు, చిరువ్యాపారులకు లాభదాయకం. గత తప్పిదాలు పునరావృతం కాకుండా జాగ్రత్త వహించండి.