గురువారం, 2 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By రామన్
Last Updated : సోమవారం, 21 జనవరి 2019 (10:09 IST)

21-01-2019 - సోమవారం మీ రాశి ఫలితాలు - ఇంటర్వ్యూలలో అనుకూల ఫలితాలు సాధిస్తారు...

మేషం: స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి కలిసివచ్చేకాలం. శ్రీవారు, శ్రీమతి వైఖరి ఉల్లాసం కలిగిస్తుంది. పెద్దలుగా మీ బాధ్యతలు నిర్వహిస్తారు. కాంట్రాక్టర్లకు ఇప్పటి వరకు వాయిదా పడుతున్న పనులు పునఃప్రారంభం కాగలవు. హోటల్, తినుబండారు వ్యాపారులకు పనివారితో సమస్యులు తలెత్తుతాయి. 
 
వృషభం: పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూలలో అనుకూల ఫలితాలు సాధిస్తారు. బంధువులతో తగాదాలు ఒత్తిడిలు తప్పవు. తలపెట్టిన కార్యక్రమాలు ఆలస్యంగా సాగుతాయి. కళల పట్ల ఆసక్తి పెరుగుతుంది. కుటుంబ విషయంలో ఇతరుల జోక్యం చికాకు కలిగిస్తుంది. స్థిరచరాస్తుల విషయంలో ఒక నిర్ణయానికి వస్తారు. 
 
మిధునం: రాజకీయ, పారిశ్రామిక రంగాల వారికి అనూహ్యమైన అవకాశాలు దక్కుతాయి. పూలు, పండ్లు, కొబ్బరి, చిరువ్యాపారులకు లాభం. ఉద్యోగస్తులు పై అధికారుల వలన మాట పడవలసివస్తుంది. పన్నులు, వడ్డీలు, పెట్టుబడులకు సంబంధించిన లావాదేవీలు లాభిస్తాయి. కొత్త ఉద్యోగ్యాల అన్వేషణ ఫలిస్తుంది. 
 
కర్కాటకం: ఆర్థిక విషయాలలో ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తారు. ప్రింటింగ్, స్టేషనరీ రంగాలవారికి పనిలో ఒత్తిడి చికాకులు తప్పవు. కళల పట్ల ఆసక్తి పెరుగుతుంది. కొత్త ఉద్యోగాల అన్వేషణ ఫలిస్తుంది. బంధువుల రాకతో ఖర్చులు అధికమవుతాయి. శత్రువులు మిత్రులుగా మారుతారు. ఆలయ సందర్శనాలలో ఇబ్బందులు తప్పవు.  
 
సింహం: ఉద్యోగంలో వృత్తుల్లో ఉన్న స్త్రీలు భాగస్వామిని వదిలి దూరప్రయాణాలు చేస్తారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. ఆస్తుల క్రయవిక్రయాలకు సంబంధించి అగ్రిమెంట్లు వాయిదా వేసుకోవలసి వస్తుంది. పలుకుబడి కలిగిన వ్యక్తుల సహకారం లభిస్తుంది. చేపట్టిన పనిలో కొంత అవాంతరాలు తలెత్తుతాయి. 
 
కన్య: శత్రువుల సైతం ఆకట్టుకుని ముందుకు సాగుతారు. విశ్రాంతికై చేయు ప్రయత్నాలు ఫలించవు. కోర్టు వ్యవహారాలు వాయిదా పడుట మంచిది. దూరదేశాలకు వెళ్ళే ప్రయత్నాలు వాయిదా పడుతాయి. జీవిత భాగస్వామితో విభేదాలు నెలకొంటాయి. దైవ, సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొని అందరినీ ఆకట్టుకుంటారు.  

తుల: బ్యాంకు డిపాజిట్లు దీర్ఘకాలిక పెట్టుబడులు అనుకూలం. కుటుంబ సభ్యులు సలహాతో కొత్త కార్యక్రమాలు చేపడతారు. ఆత్మీయులతో ఉల్లాసంగా గడుపుతారు. ప్రముఖులను కలుసుకుని బహుమతులు అందజేస్తారు. వాహనం నడుపునపుడు మెళకువ అవసరం. పనివారితో సమస్యలు తలెత్తినా నెమ్మదిగా సమసిపోతాయి. 
 
వృశ్చికం: మీ సంతానం కోసం ధనం బాగా వ్యయం చేస్తారు. స్త్రీలకు ఇరుగుపొరుగు వారితో సఖ్యత అంతగా ఉండదు. క్రయవిక్రయాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగస్తులకు పై అధికారుల నుండి ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. రావలసిన ధనం చేతికి అందడంతో ఋణం తీర్చాలనే మీ ప్రయత్నం నెరవేరగలదు. 
 
ధనస్సు: ఉద్యోగస్తులు సమర్థవంతంగా పనిచేసి అధికారులను మెప్పిస్తారు. విద్యార్థునులు ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండడం మంచిది. ఖర్చులు మీ ఆదాయానికి తగినట్లుగానే ఉంటాయి. దైవ, సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. వ్యాపారాభివృద్ధికి చేపట్టిన ప్రణాళికలు సత్ఫలితాలను ఇవ్వగలవు. 
 
మకరం: ఎప్పటి నుండో వాయిదా పడుతునన పనులు పునఃప్రారంభమవుతాయి. బంధువులు, సోదరుల మధ్య ఆత్మీయతలు నెలకొంటారు. ఇంటాబయటా మీ మాట చెల్లుబాటు కాగలదు. ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాలు, రిజిస్ట్రేషన్లు అనుకూలిస్తాయి. కుటుంబ విషయంలో కూడా మీకు సానుకూల వాతావరణం నెలకొని ఉంటుంది.    
 
కుంభం: వ్యాపార ఒప్పందాలు కుదుర్చుకుంటారు. కోర్టు వ్యవహారాలలో ప్లీడర్ల ధోరణి ఆందోళన కలిగిస్తుంది. బంధువుల కలయికతో మానసికంగా కుదుటపడుతారు. దంపతుల మధ్య ప్రేమానుబంధాలు బలపడుతాయి. విలువైన వస్తువులు కొనుగోళ్ళు నిమిత్తం ధనం బాగా ఖర్చుచేస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు.   
 
మీనం: దైవ, పుణ్య కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. సోదరీసోదరుల మధ్య సమస్యలు తలెత్తుతాయి. రుణాలు తీర్చడానికి చేయు యత్నాలు అనుకూలిస్తాయి. కూరగాయలు, పండ్లు, పూలు, వ్యాపారులకు పురోభివృద్ధి. వాహనం నడుపునపుడు మెళకువ అవసరం. మీ కళత్ర మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది.