ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By రామన్
Last Updated : శనివారం, 2 ఫిబ్రవరి 2019 (09:08 IST)

02-02-2019 శనివారం దినఫలాలు : పాతమిత్రుల కలయికతో...

మేషం: వస్త్ర, బంగారు, వెండి, లోహ వ్యాపారస్తులకు పనివారలతో సమస్యలు అధికమవుతాయి. కోర్టు వ్యవహారాల్లో ప్లీడర్లు, ప్లీడరు గుమస్తాలకు చికాకులు తప్పవు. నిరుద్యోగులకు చిన్న సదవకాశం లభించిన సద్వినియోగం చేసుకోవడం మంచిది. రావలసిన ధనం అందటంతో పొదుపు దిశగా మీ ఆలోచనలు కొనసాగుతాయి. 
 
వృషభం: మీ ఉన్నతిని చాటుకోవడం కోసం ధనం విరివిగా ఖర్చు చేస్తారు. కాంట్రాక్టర్లు ప్రముఖుల సహకారంతో పెద్ద పెద్ద కాంట్రాక్టులు చేజిక్కించుకుంటారు. పెరిగిన కుటుంబ అవసరాలు, రాబడికి మించిన ఖర్చుల వలన ఆటుపోట్లు తప్పవు. యూనియన్ కార్యకలాపాల్లో ఆచితూచి వ్యవహరించవలసి ఉంటుంది.
 
మిధునం: ప్రైవేటు సంస్థల్లో వారికి ప్రగతితో కూడిన అవకాశాలు లభిస్తాయి. ఐరన్, కలప, ఇటుక, ఇసుక, సిమెంట్ వ్యాపారస్తులకు, స్టాకిస్టులకు మిశ్రమ ఫలితం. వ్యాపారాల్లో గణనీయమైన మార్పులు ఉంటాయి. క్లిష్టమైన సమస్యలు తలెత్తినా సమర్ధతతో ఎదుర్కుంటారు. ఆడిటర్లకు ఒత్తిడి, ఇంజనీరింగ్ రంగాలలో వారికి చికాకు తప్పదు. 
 
కర్కాటకం: ఆర్థికంగా ఒక అడుగు ముందుగు వేస్తారు. కాంట్రాక్టర్లకు, బిల్డర్లకు నిర్మాణ పనులలో నాణ్యత లోపం వలన నష్టాలు చవిచూడవలసివస్తుంది. నూతన ఉద్యోగ యత్నాలకు విఘాతం కలిగే అవకాశం ఉంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. పాతమిత్రుల కలయికతో మానసిక ప్రశాంతత చేకూరుతుంది.  
 
సింహం: ఆర్థిక వ్యవహారాల్లో భాగస్వామిక వైఖరి మనస్తాపం కలిగిస్తుంది. ఉద్యోగస్తులకు స్థానమార్పిడి, కొత్త బాధ్యతల చేపట్టే ఆస్కారం ఉంది. ఎప్పటి నుండో వాయిదా పడుతూ వస్తున్న పనులు పునఃప్రారంభించాలనే ఆలోచన స్పురిస్తుంది. ఓర్పు, నేర్పులతో మీరు అనుకున్నది సాధిస్తారు. కష్ట సమయంలో బంధువులు అండగా నిలుస్తారు. 
 
కన్య: కోర్టు వ్యవహారాల్లో ప్లీడర్లు, ప్లీడరు గుమస్తాలకు చికాకులు తప్పవు. మీ ఆశయానికి, అభిరుచులకు తగిన వ్యక్తులతో పరిచయాలేర్పడుతాయి. కష్ట సమయంలో సన్నిహితులకు అండగా నిలుస్తారు. ఇతరులకు హామీలు ఇచ్చే విషయంలోను, మధ్యవర్తిత్వ వ్యవహారాలకు దూరంగా ఉండడం అన్ని విధాలా మంచింది.  
 
తుల: ఉల్లి, ధాన్యం, అపరాలు, నూనె హోల్‌సేల్, రిటైల్ వ్యాపారులకు పురోభివృద్ధి. విద్యార్థులు ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండడం క్షేమదాయకం. పత్రికా, ప్రైవేటు సంస్థల్లోని వారికి మార్పులు అనుకూలించవు. వైద్య రంగాలలోని వారికి పురోభివృద్ధి. ఋణం తీర్చడానికై చేయు యత్నాలు ఫలిస్తాయి.  
 
వృశ్చికం: ఆర్థిక పరిస్థితి అనుకున్నంత సంతృప్తిగా సాగదు. ఒకేసారి అనేక పనులు మీదపడడంతో అసహానానికి లోనవుతారు. ఉద్యోగస్తులు అధికారుల తీరును గమనించి మెలగవలసి ఉంటుంది. నిర్మాణ పనులు చురుకుగా సాగడంతో మీలో సంతృప్తి, ఉత్సాహం కానవస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు.  
 
ధనస్సు: రాజకీయాలలో వారికి మంచి గుర్తింపు లభిస్తుంది. పోస్టల్, ఎల్.ఐ.సి., ఏజెంట్లకు ఒత్తిడి పెరుగుతుంది. ప్రేమికుల అవగాహన సాహిత్యం అనర్థాలకు దారితీస్తుంది. అనుక్షణం భాగస్వామికుల తీరును గమనించడం శ్రేయస్కరం. మీ పట్ల ముభావంగా ఉండే వ్యక్తులు మీకు దగ్గరయ్యేందుకు యత్నిస్తారు. 
 
మకరం: మీ సంతానం పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తారు. స్త్రీల మాటకు వ్యతిరేకత ఎదురవుతుంది. బ్యాంకు లావాదేవీలు, రుణ ప్రయత్నాలకు అడ్డంకులు ఎదురయ్యే అవకాశం ఉంది. మిమ్ములను కొంత మంది ధన సహాయం అర్ధిస్తారు. సహాయం చేసిన తిరిగిరాజాలదు. ఏదైనా ఒక స్థిరాస్తి కొనుగోలు చేస్తారు.     
 
కుంభం: అకాల భోజనం, శ్రమాధిక్యత, విశ్రాంతి లోపం వలన అప్పుడప్పుడు అస్వస్థతకు గురవుతారు. ఉద్యోగస్తులు నూతన బాధ్యతలు చేపట్టే ఆస్కారం ఉంది. గృహనిర్మాణం, ఫర్నీచర్ అమరికలకు అవసరమైన నిధులు సమకూర్చుకోవడంలో ఇబ్బందులను ఎదుర్కుంటారు. ఖర్చులు పెరగడంతో రుణ యత్నాలు, చేబదుళ్ళు తప్పవు.   
 
మీనం: ఆర్థిక ఇబ్బందులు, కుటుంబంలో అశాంతి, చికాకులు ఎదుర్కుంటారు. ప్రేమికులకు పెద్దల నుండి తీవ్ర వ్యతిరేకత ఇతరత్రా చికాకులు అధికమవుతాయి. చేతి వృత్తుల వారికి సంతృప్తి. రావలసిన మొండి బాకీలు సైతం వసూలుకాగలవు. ప్లీడర్లకు ఒత్తిడి, అక్కౌంట్స్ రంగాల వారికి పనిభారం, చికాకులు అధికమవుతాయి.