మంగళవారం, 26 నవంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By
Last Updated : శనివారం, 2 మార్చి 2019 (09:31 IST)

02-03-2019 - శనివారం మీ రాశి ఫలితాలు..

మేషం: నూతన వ్యాపారాలు చేయాలనే మీ ఆలోచన వాయిదా వేయడం మంచిది. కాంట్రాక్టర్లకు అధికారుల నుండి ఒత్తిడి, కార్మిక సమస్యలు తప్పవు. శస్త్రచికిత్సల సమయంలో వైద్యులకు ఏకాగ్రత ముఖ్యం. ధన వ్యయం అధికమైనా సార్థకత ఉంటుంది. దంపతుల మధ్య విభేదాలు తొలగిపోయి ఉల్లాసంగా గడుపుతాయి.
 
వృషభం: ప్రైవేటు, పత్రికా రంగాల్లోవారికి అధికారులతో సమస్యలు తప్పవు. టెక్నికల్, ఎలక్ట్రానిక్, కంప్యూటర్ రంగాల్లో వారికి ఒత్తిడి తప్పదు. కోర్టు వ్యవహారాలు సానుకూలమవుతాయి. వస్త్ర, బంగారం, ఫ్యాన్సీ వ్యాపారులకు సామాన్యంగా ఉంటుంది. పోస్టల్, కొరియల్ రంగాలవారికి ఒత్తిడి, త్రిప్పట అధికమవుతాయి.
 
మిధునం: తినుబండారాలు, క్యాటరింగ్ పనివారలకు సదవకాశాలు లభించినా ఆర్థిక సంతృప్తి అంతగా ఉండదు. మీ సంతానం విషయంలో ప్రత్యేక శ్రద్ధ కనపరుస్తారు. వృత్తి, ఉద్యోగస్తులకు చికాకులు తప్పవు. బంధువుల రాకపోకలు అధికంగా ఉంటాయి. రియల్ ఎస్టేట్ రంగాల వారికి కొత్త సమస్యలు తలెత్తుతాయి. 
 
కర్కాటకం: మొహమ్మాటాలు, ప్రలోభాలకు దూరంగా ఉండడం క్షేమదాయకం. పెద్దల ఆరోగ్యంలో మెళకువ అవసరం. సోదరీసోదరులతో సత్సంబంధాలు నెలకొంటాయి. ఉద్యోగస్తులు, ఉన్నతస్థాయి అధికారులు అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తంగా మెలగవలసి ఉంటుంది. దూరప్రయాణాలలో వస్తువుల పట్ల మెళకువ వహించండి.
 
సింహం: భాగస్వామిక చర్చల్లో కొత్త విషయాలు చోటు చేసుకుంటాయి. ప్రముఖుల సహకారంతో మీ పనులు సానుకూలమవుతాయి. నిరుద్యోగులు నిరుత్సాహం వీడి ఇంటర్వ్యూలకు హజరు కావడం మంచిది. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కుంటారు. మీ సంతానం కోసం ధనం అధికంగా ఖర్చుచేస్తారు.
 
కన్య: మీ ఆంతరింగిక విషయాలు, ప్రణాళికలు గోప్యంగా ఉంచండి. గృహంలో మార్పులు, చేర్పులు అనుకూలిస్తాయి. రుణ యత్నాలు ఫలిస్తాయి. విదేశీయానం, రుణ యత్నాల్లో కొంత పురోగతి కనిపిస్తుంది. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాలవారికి సదవకాశాలు లభిస్తాయి. తలపెట్టిన పనులు కొంత ఆలస్యంగా పూర్తిచేస్తారు. 
 
తుల: వ్యాపారులకు సంబంధించి ఓ సమాచారం నిరుత్సాహం కలిగిస్తుంది. ముఖ్యమైన వ్యవహారాలలో కొంతమంది మాటతీరు మీకు మనస్తాపం కలిగిస్తుంది. ఇతరులకు వాహనం ఇవ్వడం వలన సమస్యలు తలెత్తుతాయి. గృహనిర్మాణాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగస్తులు ట్రాన్స్‌ఫర్, ప్రమోషన్‌లు యత్నాలను గుట్టుగా సాగించాలి.
 
వృశ్చికం: కళ, క్రీడా, సాంకేతిక రంగాలవారికి ప్రోత్సాహం లభిస్తుంది. స్వయంకృషితో రాణిస్తారన్న విషయం గ్రహించండి. తెలివి తేటలతో వ్యవహరించడం వలన కొన్ని వ్యవహారాలు మీకు అనుకూలిస్తాయి. ఉద్యోగస్తులు పై అధికారులతో సంభాషించేటపుడు జాగ్రత్త వహించండి. మీ పనులు కార్యక్రమాలు వాయిదా పడుతాయి. 
 
ధనస్సు: స్త్రీల ఆరోగ్యంలో మెళకువ అవసరం. స్టాక్ మార్కెట్ రంగాల వారికి మిశ్రమ ఫలితం. కోర్టు వాదోపవాదాల్లో ప్లీడర్లకు మంచి గుర్తింపు లభిస్తుంది. ప్రయాణాలు, బ్యాంకు వ్యవహారాలలో మెళకువ అవసరం. ఏజెంట్లకు సదవకాశాలు లభిస్తాయి. మీ స్తోమతకు మించి వాగ్దానాల వలన ఇబ్బందులను ఎదుర్కుంటారు. 
 
మకరం: కిరాణా, ఫ్యాన్సీ, స్టేషనరీ, గృహోపకరణ వ్యాపారాలు పురోభివృద్ధి పొందుతారు. ఊహించని ఖర్చుల వలన చేబదుళ్ళు తప్పవు. వృత్తి వ్యాపారులకు మిశ్రమ ఫలితం. ఉద్యోగస్తులకు సమస్యలు తలెత్తుతాయి. వివాదాస్పద విషయాల్లో మీ ప్రమేయం లేకుండా జాగ్రత్త వహించండి. క్రయవిక్రయాలు లాభసాటిగా ఉంటాయి.  
 
కుంభం: ఆర్థిక లావాదేవీలు, కుటుంబ సమస్యలు చక్కగా పరిష్కరిస్తారు. వ్యాపారులకు సంబంధించిన ఓ సమాచారం నిరుత్సాహం కలిగిస్తుంది. ప్రయాణం చేయవలసివస్తుంది. స్త్రీలు విలువైన వస్తువులు అమర్చుకుంటారు. పారిశ్రామిక రంగాలవారికి ప్రోత్సాహకరం. విద్యార్థుల్లో ఆందోళన తొలగిపోయి నిశ్చింత చోటు చేసుకుంటుంది. 
 
మీనం: గొప్ప గొప్ప ఆలోచనలు, ఆశయాలు స్ఫురిస్తాయి. బ్యాంకింగ్, చిట్స్ రంగాల వారికి ఒత్తిడి, పనిభారం అధికమవుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. వివాదాస్పద వ్యవహారాలు సమర్థంగా పరిష్కరిస్తారు. శ్రీవారు, శ్రీమతి గౌరవ ప్రతిష్టలకు భంగం కలిగించే పరిణామాలు ఎదుర్కుంటారు.