గురువారం, 26 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By pnr
Last Updated : గురువారం, 21 సెప్టెంబరు 2017 (05:41 IST)

శుభోదయం : ఈ రోజు మీ రాశిఫలితాలు 21-09-17

మేషం : రియల్ ఎస్టేట్ రంగాల వారి అంచనాలు నిరుత్సాహపరుస్తాయి. ప్రతి వ్యవహారం స్వయంగా చూసుకోవాలి. విలాస వస్తువులు కొనుగోలు చేస్తారు. వ్యాపారాల్లో ఆటుపోట్లను ధీటుగా ఎదుర్కొంటారు. మీ అభిప్రాయాలను కచ్చితంగా

మేషం : రియల్ ఎస్టేట్ రంగాల వారి అంచనాలు నిరుత్సాహపరుస్తాయి. ప్రతి వ్యవహారం స్వయంగా చూసుకోవాలి. విలాస వస్తువులు కొనుగోలు చేస్తారు. వ్యాపారాల్లో ఆటుపోట్లను ధీటుగా ఎదుర్కొంటారు. మీ అభిప్రాయాలను కచ్చితంగా తెలియజేయండి. ఉద్యోగస్తులకు చేసే పనియందు ధ్యాస పెట్టడం మంచిది.
 
వృషభం: విద్యార్థులకు పరిచయాలు బలపడతాయి. ఆశాదృక్పథంతో ఉద్యోగయత్నం సాగించండి. దైవదర్శనాలు సంతృప్తికరం. విజ్ఞతతో వ్యవహరిస్తారు. ఉన్నత పదవులు చేజిక్కించుకుంటారు. ప్రకటనలు, దళారులను విశ్వసించవద్దు. ప్రేమికుల మధ్య అపార్ధాలు తొలగిపోతాయి. ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం తగదు. 
 
మిథునం : సంతానం అత్యుత్సాహాన్ని అదుపు చేయండి. మార్కెట్ రంగాల వారికి ఆదాయాభివృద్ధి. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. కొన్ని పనులు ఆకస్మికంగా పూర్తి కాగలవు. దూరపు బంధువుల రాక ఆశ్చర్యం కలిగిస్తుంది. కొబ్బరి, పండ్ల, పూల, చిరు వ్యాపారులకు, చిన్నతరహా పరిశ్రమల వారికి ఆశాజనకం. 
 
కర్కాటకం: పెట్టుబడులు కలిసివస్తాయి. పనులు మొండిగా పూర్తి చేస్తారు. ఉద్యోగస్తులకు ధనప్రలోభం తగదు. సేవ, సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. అధికారులకు అదనపు బాధ్యతలు, విశ్రాంతి లోపం. పనుల ప్రారంభ దశలోనే అర్థాంతంగా ముగించవలసివస్తుంది. సన్నిహితుల నుంచి ఆహ్వానాలు అందుకుంటారు. 
 
సింహం : దంపతుల మధ్య ఏకాభిప్రాయం నెలకొంటుంది. ఎంత కష్టమైన పనైనా అవలీలగా పూర్తి చేస్తారు. పాత మిత్రులను కలుసుకుంటారు. బ్యాంకు వివరాలు వెల్లడించవద్దు. స్థానచలనానికి చేయు ప్రయత్నాలు ఫలిస్తాయి. సమస్యలతో రాజీపడటానికి యత్నించండి. స్థిరచరాస్తుల విషయంలో ఒక నిర్ణయానికి వస్తారు.
 
కన్య : వృత్తుల వారికి ఆదాయాభివృద్ధి. సన్నిహితులతో సంప్రదింపులు జరుపుతారు. హోటల్ తినుబండ వ్యాపారస్తులకు సంతృప్తి చేకూరుతుంది. ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తికరంగా సాగుతాయి. హోటల్ తినుబండ వ్యాపారస్తులకు సంతృప్తి చేకూరుతుంది. కీలక వ్యవహారాలు సమర్థంగా నిర్వహిస్తారు. మీ మాటలు కొంతమంది వక్రీకరించే ఆస్కారం ఉంది. పాత రుణాలు తీరుస్తారు. 
 
తుల : బ్యాంకు వివరాలు, ఆంతరంగిక విషయాలు గోప్యంగా ఉంచండి. ఉద్యోగంలో శ్రమకు మంచి గుర్తింపు లభిస్తుంది. పెద్దల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. మీ లక్ష్యం పట్టుదలే మిమ్మల్ని ముందుకు నడిపిస్తాయి. రుణం ఏ కొంతైనా తీర్చాలనే మీ ధ్యేయం నెరవేరుతుంది.
 
వృశ్చికం : అయిన వారి కోసం బాగా వ్యయం చేస్తారు. సోదరులతో స్వల్ప అభిప్రాయ భేదాలు తలెత్తుతాయి. దైవదర్శనం చేస్తారు. కాంట్రాక్టర్లకు, బిల్డర్లకు నిర్మాణ పనుల్లో పనివారలతో చికాకులు తప్పవు. దైవ, పుణ్య కార్యాలకు సహాయ సహకారాలు అందిస్తారు. మీ మనసు మార్పును కోరుకుంటుంది.
 
ధనస్సు: సహోద్యోగులతో ఉల్లాసంగా గడుపుతారు. ఏ విషయంలోను తొందరపడక బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది. విద్యార్థులు ప్రేమ వ్యవహారాల్లో అతిగా వ్యవహరించి చిక్కుల్లో పడతారు. ఒంటరిగా ఏ పని చేయడం క్షేమం కాదని గమనించండి. పోగొట్టుకున్న పత్రాలు తిరిగి పొందుతారు.
 
మకరం: సేవ, సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. రాజకీయనాయకులు సభలు, సమావేశాలు బృంద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆడిటర్లు మతిమరుపు పెరుగుట వలన ఆందోళన చెందుతారు. సంతానం విజయం ఉత్సాహాన్నిస్తుంది. ముఖ్యులలో ఒకరికి వీడ్కోలు పలుకుతారు. వ్యవహార దక్షతతో రాణిస్తారు.
 
కుంభం: ఆర్థిక అంచనాలు ఫలిస్తాయి. అనుకున్న మొక్కులు తీర్చుకుంటారు. పెట్టుబడుల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. అప్రయత్నంగా అవకాశాలు కలిసివస్తాయి. అవివాహితుల్లో ఉత్సాహం నెలకొంటుంది. కుటుంబీకుల మధ్య ప్రేమానుబంధాలు బలపడతాయి. విందులు, వినోదాల్లో అత్యుత్సాహం తగదు. 
 
మీనం: కళాకారులకు ప్రోత్సాహకరం. నిర్దిష్ట ప్రణాళికలతో ముందుకు సాగుతారు. విదేశీ చదువులు, రుణ యత్నాలు ఫలిస్తాయి. గృహమార్పు కలిసివస్తుంది. వృత్తి ఉద్యోగ బాధ్యతల్లో రాణిస్తారు. ద్విచక్ర వాహనంపై దూర ప్రయాణం తగదు. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. ఆందోళన కలిగించిన సమస్య సద్దుమణుగుతుంది.