గురువారం, 26 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By pnr
Last Updated : ఆదివారం, 17 సెప్టెంబరు 2017 (05:45 IST)

శుభోదయం : ఈ రోజు మీ రాశి ఫలితాలు 17-09-17

మేషం: లక్ష్యసాధనకోసం మీ వ్యక్తిగత ఆనందాలను త్యాగం చేయవలసివస్తుంది. దైవ సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు. రాజకీయ విషయాలకు దూరంగా ఉండటం క్షేమదాయకం. ప్రముఖుల పరిచయం మీ ఉన్నతికి దోహదపడుతుంది. సాంఘ

మేషం: లక్ష్యసాధనకోసం మీ వ్యక్తిగత ఆనందాలను త్యాగం చేయవలసివస్తుంది. దైవ సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు. రాజకీయ విషయాలకు దూరంగా ఉండటం క్షేమదాయకం. ప్రముఖుల పరిచయం మీ ఉన్నతికి దోహదపడుతుంది. సాంఘిక, సేవా కార్యక్రమాల్లో చురుకుగా వ్యవహరిస్తారు.
 
వృషభం: కొబ్బరి, పండ్లు, పూలు, చిరు వ్యాపారులకు లాభదాయకం. విద్యార్థులు మిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు. అందరితో కలిసి విందు వినోదాల్లో పాల్గొంటారు. ఓర్పు, పట్టుదలతో శ్రమించిన గాని చేపట్టిన పనులు పూర్తి కావు. స్త్రీలు, మానసిక, శారీరక ఒత్తిడులకు లోనౌతారు. పాత సమస్యలు ఒక కొలిక్కి వస్తాయి.
 
మిథునం: ప్రేమికులకు పెద్దలకు మధ్య సమస్యలు తలెత్తుతాయి. సన్నిహితుల నుంచి ఆహ్వానాలు అందుకుంటారు. ఆశయ సాధన కోసం అవిశ్రాంతంగా శ్రమిస్తారు. దైవదీక్షలు, ఆరోగ్య విషయాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. పట్టువిడుపు ధోరణితోనే మీ సమస్యలు పరిష్కారమవుతాయి. నూతన ప్రదేశాలు సందర్శిస్తారు.
 
కర్కాటకం : ఆర్థిక విషయాల్లో కొంత పురోగతి సాధిస్తారు. నిరుద్యోగుల నిర్లిప్త ధోరణి వల్ల సదవకాశాలు జారవిడుచుకుంటారు. శత్రువులు మిత్రులుగా మారి సహాయాన్ని అందిస్తారు. చీటికి మాటికి ఎదుటివారిపై అసహనం, ఆగ్రహం వ్యక్తం చేస్తారు. మీ మాటలు ఇతరులకు జారవేసే వ్యక్తులున్నారని గమనించండి.
 
సింహం : స్త్రీలు షాపింగ్‌లో ఏకాగ్రత వహిస్తారు. మత్స్య, కోళ్ల, గొర్ర వ్యాపారస్తులకు అనుకూలం. బంధుమిత్రుల రాకతో గృహంలో సందడి కానవస్తుంది. ప్రేమికుల తొందరపాటు నిర్ణయాల ఇబ్బందులకు దారితీస్తాయి. ఎవరినీ అతిగా విశ్వసించడం మంచిది కాదు. దూర ప్రయాణాల్లో వస్తువుల పట్ల మెళకువ అవసరం.
 
కన్య: కుటుంబ సభ్యులతో కలిసి విందు, వినోదాల్లో పాల్గొంటారు. ఎటువంటి విపత్కర పరిస్థితులనైనా ధైర్యంగా ఎదుర్కొంటారు. స్త్రీలు ద్విచక్ర వాహనం నడుపుతున్నప్పుడు మెలకువ వహించండి. క్రీడా, కళా, సాంస్కృతిక రంగాల పట్ల ఆసక్తి వహిస్తారు. హోటల్ తినుబండ వ్యాపారస్తులకు సంతృప్తి చేకూరుతుంది.
 
తుల: రాజకీయాల్లోని వారికి విరోధులు వేసే పథకాలు ఎంతో ఆందోళన కలిగిస్తాయి. స్త్రీలకు పనివారితో ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. వృత్తి, వ్యాపారులకు ఆశించినంత పురోభివృద్ధి ఉండదు. ఏదైనా స్థిరాస్తి అమ్మకం చేయాలనే మీ ఆలోచన మరి కొంత కాలం వాయిదా వేయడం మంచిదని గమనించండి.
 
వృశ్చికం : ఎలక్ట్రానికల్ రంగాల వారు క్రమేణా పుంజుకుంటారు. స్త్రీలకు సంపాదన పట్ల ఆసక్తి అధికమవుతుంది. ఒంటెత్తు పోకడ మంచిగి కాదని గమనించండి. మీ పనులు మందకొడిగా సాగుతాయి. రాజకీయ నాయకులు అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తత అవసరం. నోరు అదుపులో ఉంచుకోవడం శ్రేయస్కరం.
 
ధనస్సు: వ్యాపార రీత్యా తరచూ దూర ప్రయణాలు చేయవలసి వుంటుంది. మీ తొందరపాటుతనం వల్ల వ్యవహారం బెడిసికొట్టే ఆస్కారం ఉంది. నిరుద్యోగులు చేపట్టిన ఉపాధి పథకాలకు మంచి స్పందన లభిస్తుంది. ఖర్చులు పెరిగినా ఇబ్బందులు వుండవు. గృహంలో మార్పులు, చేర్పులు అనుకూలించగలవు. 
 
మకరం : ఇతుల సలహా విన్నప్పటికీ బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవటం మంచిది. రాజకీయ పరిచయాలు లబ్ధిని చేకూరుస్తాయి. సాహస ప్రయత్నాలు విరమించకండి. ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తికరంగా సాగుతాయి. విద్యార్థుల ఆలోచనలు పక్కదారి పట్టవచ్చు. వ్యాపారాభివృద్ధికి చేయు ప్రయత్నాల్లో సఫలీకృతులౌతారు.
 
కుంభం: యాదృచ్ఛికంగా ఒక పుణ్యక్షేత్రం సందర్శిస్తారు. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు. బంధువులను కలుసుకుంటారు. ఆధ్యాత్మిక, సామాజిక కార్యక్రమాల్లో చురుకుగా వ్యవహరిస్తారు. కొబ్బరి, పండ్ల, పూల, చిరు వ్యాపారులకు కలసిరాగలదు. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి ఆశాజనకం.
 
మీనం: స్థిరాస్తి అమ్మకంపై ఒత్తిడి వల్ల ఆందోళనలకు గురవుతారు. వృత్తిపరంగా ప్రముఖులను కలుసుకుంటారు. సోదరీ సోదరుల తీరు ఆందోళన కలిగిస్తుంది. వాగ్వివాదాలకు సరైన సమయం కాదని గమనించండి. కొన్ని అనుకోని సంఘటనలు మనస్థాపం కలిగిస్తాయి. కొత్త కొత్త పథకాలు రూపొందిస్తారు.