బుధవారం, 25 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By pnr
Last Updated : బుధవారం, 20 సెప్టెంబరు 2017 (05:50 IST)

శుభోదయం : ఈ రోజు మీ రాశిఫలితాలు 20-09-17

మేషం : ఈ రోజు మీ పేరు ప్రతిష్టలకు భంగం కలుగకుండా జాగ్రత్త వహించాలి. కొత్త పనులు చేపట్టకుండా ప్రస్తుతం చేస్తున్న వాటిపైనే శ్రద్ధ వహించండి. సతీసమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. విద్యార్థులకు వ

మేషం : ఈ రోజు మీ పేరు ప్రతిష్టలకు భంగం కలుగకుండా జాగ్రత్త వహించాలి. కొత్త పనులు చేపట్టకుండా ప్రస్తుతం చేస్తున్న వాటిపైనే శ్రద్ధ వహించండి. సతీసమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. విద్యార్థులకు వాహనం నడుపుతున్నపుడు ఏకాగ్రత ముఖ్యం. హామీలు, మధ్యవర్తిత్వాలకు దూరంగా ఉండటం క్షేమదాయకం. 
 
వృషభం : ఈ రోజు టెక్నికల్, ఎలక్ట్రానిక్, కంప్యూటర్ రంగాల్లో వారికి ఒత్తిడి తప్పదు. మీ ఉత్సాహాన్ని అదుపులో ఉంచుకోవడం శ్రేయస్కరం. సిమెంట్, కలప, ఐరన్, ఇటుక, వ్యాపారులకు పురోభివృద్ధి. ఆధ్యాత్మిక, ఆరోగ్య విషయాలపై శ్రద్ధ వహిస్తారు. ప్రయాణాలలో చికాకులు తప్పవు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలలో విజయం పొందుతారు. 
 
మిథునం : ఈ రోజు ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శించాలనే కోరిక స్ఫురిస్తుంది. కోర్టు వ్యవహారాలు మీరు కోరుకున్నట్టుగానే వాయిదాపడతాయి. అలౌకిక విషయాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. బంధువులతో తెగిపోయిన సంబంధాలు బలపడతాయి. మీ శ్రీమతి సలహాను తేలికగా కొట్టివేయకండి. ఆత్మీయులను విందులు, వేడుకలకు ఆహ్వానిస్తారు. 
 
కర్కాటకం : ఈ రోజు బ్యాంకుల్లో మీ పనుల్లో స్వల్ప ఆటంకాలు ఎదుర్కోవలసి వస్తుంది. పాతమిత్రుల కలయికతో గత అనుభవాలు జ్ఞప్తికి వస్తాయి. సహకార సంఘాల్లో వారికి ప్రైవేటు సంస్థల్లో వారికి గుర్తింపు లభిస్తుంది. ప్రతి చిన్న విషయానికి ఇతరులపై ఆధారపడటం మంచిది కాదు. పట్టుదలతో శ్రమించినగాని పనులు పూర్తికావు. 
 
సింహం : ఈ రోజు ఉపాధ్యాయులకు, మార్కెటింగ్ రంగాల వారికి ఒత్తిడి అధికమవుతుంది. నిర్మాణ పనుల్లో కాంట్రాక్టర్లకు, బిల్డర్లకు ఏకాగ్రత ఎంతో ముఖ్యం. దైవదర్శనాలు, ప్రయాణంలో చికాకులు తప్పవు. బంధువులు ఇరకాటంలో పెట్టేందుకు యత్నిస్తారు. వ్యాపారాల్లో ఆటంకాలను ధీటుగా ఎదుర్కొంటారు. జూదాల జోలికి పోవద్దు. 
 
కన్య : ఈ రోజు హోటల్, కేటరింగ్ రంగాల్లో వారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు. వాణిజ్య ఒప్పందాలు రిజిస్ట్రేషన్ వ్యవహారాల్లో మెలకువ వహించండి. ముక్కుసూటిగా పోయే మీ ధోరణి ఇబ్బందులకు దారితీస్తుంది. సర్వత్రా అనుకూలతలుంటాయి. అనేక పనులతో సతమతమవుతారు. కావలసిన వ్యక్తుల కలయిక సాధ్యంకాదు. 
 
తులం : ఈ రోజు పత్రికా సిబ్బందికి వార్తల ప్రచురణలో పునరాలోచన మంచిది. కొంత ఆలస్యంగానైనా అనుకున్న పనులు పూర్తి చేస్తారు. ముఖ్యమైన వ్యవహారాలు గోప్యంగా ఉంచండి. పోస్టల్, ఎల్ఐసీ ఏజెంట్లకు పురోభివృద్ధి. విదేశీ వ్యవహారాలకు అవసరమైన నిధులు సమకూర్చుకుంటారు. వ్యాపారాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. 
 
వృశ్చికం : ఈ రోజు మీ కోపాన్ని, చిరాకును ఎక్కువగా ప్రదర్శించడం మంచిది కాదు. మీ కళత్ర మొండివైఖరి మీకు చికాకు కలిగిస్తుంది. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి ఒత్తిడి, చికాకులు తప్పవు. ఒక వ్యవహారంలో పెద్దల జోక్యం అనివార్యం. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుటారు. ఎదుటివారి నైజం గ్రహిస్తారు. 
 
ధనస్సు : ఈ రోజు ఉద్యోగస్తులకు పండుగ అడ్వాన్సులు మంజూరుకాగలవు. ముఖ్యులతో సంభాషించేటపుడు ఆచితూచి వ్యవహరించడం మంచిది. శత్రువులు మిత్రులుగా మారి సహాయ సహకారాలు అందిస్తారు. దైవ, పుణ్య, సేవాకార్యాల్లో పాల్గొంటారు. ప్రేమికులకు సన్నిహితుల ప్రోత్సాహం లభిస్తుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. 
 
మకరం : ఈ రోజు ఆదాయం బాగున్నా ఏదో తెలియని అసంతృప్తి, అసహనానికి లోనవుతారు. నిరుద్యోగులకు తాత్కాలిక అవకాశాలు లభిస్తాయి. మీకు నచ్చని సంఘటనలు కొన్ని ఎదురుకావొచ్చు. ఉద్యోగస్తులు తోటివారి నుంచి ఆసక్తికరమైన విషయాలు గ్రహిస్తారు. మీ ఉన్నతిని చూసి అసూయపడేవారు అధికమవుతున్నారని గమనించండి. 
 
కుంభం : ఈ రోజు కోర్టు వ్యవహారాలు వాయిదాపడుట మంచిది. ప్రముఖుల కలయిక ప్రయోజనకరంగా ఉంటుంది. దైవ, సాంఘిక కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలలో ఏకాగ్రత ఎంతో ముఖ్యం. వైద్యులకు ఆపరేషన్లు చేయునపుడు మెలకువ అవసరం. చేతి వృత్తి వ్యాపారులకు అనూకలమైన కాలం.
 
మీనం : ఈ రోజు పెరిగిన ధరలు, చాలీచాలని ఆదాయంతో సతమతమవుతారు. వార్తా సంస్థలలోని సిబ్బందికి మార్పులు అనుకూలిస్తాయి. సోదరీ, సోదరుల మధ్య కలహాలు తలెత్తుతాయి. రాజకీయాలలో వారికి ప్రత్యర్థులు మార్పులు అనుకూలిస్తాయి. సోదరీ, సోదరుల మధ్య కలహాలు తలెత్తుతాయి. రాజకీయాలలోని వారికి ప్రత్యర్థులు పెరుగుతున్నారని గమనించండి. బ్యాంకు వ్యవహారాలలో అపరిచిత వ్యక్తుల పట్ల మెళకువ అససరం.