గురువారం, 26 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By raman
Last Updated : సోమవారం, 9 అక్టోబరు 2017 (18:02 IST)

శుభోదయం : ఈ రోజు మీ రాశి ఫలితాలు 18-09-17

మేషం : ఈ రోజు ఆప్తుల బదిలీ ఆందోళన కలిగిస్తుంది. విద్యార్థులకు హడావుడి, తొందరపాటు తగదు. బ్యాంకుల్లో మీ పనుల్లో స్వల్ప ఆటంకాలు ఎదుర్కోవలసి వస్తుంది. యాదృచ్ఛికంగా ఒక పుణ్యక్షేత్రం సందర్శిస్తారు. పెద్దల స

మేషం : ఈ రోజు ఆప్తుల బదిలీ ఆందోళన కలిగిస్తుంది. విద్యార్థులకు హడావుడి, తొందరపాటు తగదు. బ్యాంకుల్లో మీ పనుల్లో స్వల్ప ఆటంకాలు ఎదుర్కోవలసి వస్తుంది. యాదృచ్ఛికంగా ఒక పుణ్యక్షేత్రం సందర్శిస్తారు. పెద్దల సలహాను పాటించి మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు. విదేశీయాన వ్యవహారాలు అనుకూలిస్తాయి. 
 
వృషభం : ఈ రోజు ఆదాయానికి తగినట్టుగానే ఖర్చులు ఉంటాయి. మిమ్మల్ని పొగిడే వారే కానీ సహకరించే వారుండరు. ఐరన్, ఆటోమొబైల్, రవాణా, మెకానికల్ రంగాల్లో వారికి ఒత్తిడి పెరుగుతుంది. పెద్దల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. క్రీడా, కళ, రంగాల్లో వారికి నూతన ఆలోచనలు స్ఫురిస్తాయి. 
 
మిథునం : ఈ రోజు మీ వైపు నుంచి పొరపాట్లు, తప్పిదాలు జరుగకుండా మెళకువవహించండి. ఆహార వ్యవహారాల్లో ఏకాగ్రత వహించండి. కోర్టు వ్యవహారాలు అనుకూలంగా సాగుతాయి. శ్రమానంతరం మీరు కోరుకున్న ప్రాజెక్టులను దక్కించుకుంటారు. ప్రభుత్వ రంగంలో వారికి శ్రమకు తగిన ప్రతిఫలం కానరాదు. 
 
కర్కాటకం : ఈ రోజు వస్త్ర వ్యాపారులు పనివారలను ఓ కంట కనిపెట్టుకుని ఉండటం శ్రేయస్కరం. డాక్టర్లు ఆపరేషన్లను విజయవంతంగా పూర్తి చేస్తారు. గృహమునకు కావాల్సిన వస్తువులు కొనుగోలు చేస్తారు. మార్కెటింగ్ ఉద్యోగస్తులకు టార్గెట్లు పూర్తి కావడం కష్టతరమవుతుంది. స్త్రీల ఆడంబరాలను చూసి ఎదుటివారు అపోహపడతారు. 
 
సింహం : ఈ రోజు ప్రముఖుల కలయిక వల్ల ఏమంత ప్రయోజనం ఉండదు. బంధు మిత్రులను కలుసుకుంటారు. ఏ యత్నం కలిసిరాక నిరుద్యోగులు నిరుత్సాహం చెందుతారు. వృత్తిరీత్యా మీ బాధ్యతలు పెరుగుతాయి. మీరు కోరుకునే మార్పులు నిదానంగా అనుకూలిస్తాయి. రుణం కొంత మొత్తం తీర్చడంతో ఒత్తిడి నుండి కుదటపడుతారు. 
 
కన్య : ఈ రోజు మీ ఉన్నతిని చూసి అసూయపడేవారు అధికమవుతున్నారని గమనించండి. దైవసేవా కార్యక్రమాల పట్ల ఆసక్తి చూపుతారు. భార్యాభర్తల మధ్య మనస్పర్థలు తలెత్తినా తెలివితో పరిష్కరిస్తారు. స్త్రీలు, శారీరక మానసిక వేదనకు గురవుతారు. ఆశావహదృక్పథంతో ఉద్యోగయత్నం సాగించండి. మార్కెటింగ్ రంగాల వారికి ఆశాజనకం. 
 
తుల : ఈ రోజు ఆర్థిక, కుటుంబ పరిస్థితులు చక్కబడతాయి. కంప్యూటర్, టెక్నికల్ రంగాల వారికి సదావకాశాలు లభిస్తాయి. సోదరీ, సోదరుల పోరు అధికంగా ఉంటుంది. అనుభవజ్ఞులు సలహా తీసుకోండి. పర్మిట్లు, లైసెన్సుల రెన్యువల్‌లో అలక్ష్యం తగదు. బ్యాంకు వివరాలు గోప్యంగా ఉంచండి. కళ, క్రీడాకారులకు ప్రోత్సాహకరం. 
 
వృశ్చికం : ఈ రోజు ఒక విషయంలో ఆప్తుల సలహా పాటించినందుకు కించిత్ పశ్చాత్తాపం చెందుతారు. కార్యసాధనకు అవిశ్రాంతంగా శ్రమిస్తారు. బోగస్ కంపెనీల వల్ల మోసపోయే ఆస్కారం ఉంది... అప్రమత్తంగా మెలగండి. అధికారులకు ధనప్రలోభం తగదు. వ్యాపారాల్లో నిలదొక్కుకుంటారు. మీ కృషికి త్వరలోనే ఫలితం లభిస్తుంది. 
 
ధనస్సు : ఈ రోజు బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. మీ ఇష్టాయిష్టాలను ఖచ్చితంగా తెలియజేయండి. దూర ప్రదేశంలోని ఆత్మీయుల క్షేమసమాచారం తెలుసుకుంటారు. సాంకేతిక, వైద్య రంగాల వారికి ఆశాజనకం. దైవ, సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. గృహంలో ప్రశాంతత నెలకొంటుంది. ఏ విషయంపైనా ఆసక్తి ఉండదు. 
 
మకరం : ఈ రోజు ఆర్థికంగా నిలదొక్కుకుంటారు. పరిచయంలేని వారితో జాగ్రత్త. పనుల మొండిగా పూర్తి చేస్తారు. వ్యాపారాల్లో నష్టాలు భర్తీ చేసుకోగలుగుతారు. సంప్రదింపులు వాయిదాపడతాయి. కాంట్రాక్టర్లు, బిల్డర్లకు పనివారలతో సమస్యలెదురవుతాయి. పత్రికా సిబ్బందికి వార్తల ప్రచురణలో పునరాలోచన మంచిది. 
 
కుంభం : ఈ రోజు దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. సన్నిహితుల సలహా పాటించండి. ఊహించని ఖర్చులే ఉంటాయి. ఆలయ సందర్శనాలలో ఇబ్బందులు తప్పవు. ఉద్యోగస్తులకు ఏకాగ్రత, సమయపాలన ప్రధానం. పరిచయస్తుల ఆకస్మిక రాక ఇబ్బంది కలిగిస్తుంది. 
 
మీనం : ఈ రోజు అవసరాలకు ధనం అందుతుంది. అవగాహనలేని విషయాల్లో జోక్యం తగదు. ద్విచక్ర వాహనంపై దూర ప్రయాణం క్షేమం కాదు. దైవదర్శనాలు అతికష్టంమ్మీద అనుకూలిస్తాయి. వివాదాలు కొలిక్కి వచ్చే సూచనలున్నాయి. సంతానం రాక సంతోషాన్నిస్తుంది. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు.