శనివారం, 11 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By
Last Updated : గురువారం, 8 నవంబరు 2018 (14:11 IST)

చిన్నారులకు దిష్టి తగిలితే.. కర్పూరంతో...?

నరుడి కంటి దృష్టితో చిన్నారులు నానా రకాల ఇబ్బందులు ఎదుర్కొంటారని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు. నరదృష్టి కారణంగా వచ్చే ఇబ్బందులను దూరం చేసుకోవాలంటే.. పిల్లలకు దిష్టి తీయాలని.. కర్పూరంతో చేస్తే ఇంకా మేలుంటుందని.. వారు సూచిస్తున్నారు.


పిల్లలకు దృష్టి అనేది సులభంగా తగులుతుంది. పిల్లలంటే చాలామంది ఇష్టపడుతుంటారు. వారికే తెలియకుండా వారి దృష్టి లోపం పిల్లలపై పడుతుంది. ఫలితంగా పిల్లల్లో నలత, జ్వరం, జలుబు వంటి రుగ్మతలు ఏర్పడుతాయి.
 
కంటి దృష్టి లోపాలు తొలగిపోవాలంటే.. బుగ్గపై కాటుక పెట్టాలి. అన్నం తినకుండా మారాం చేస్తే కంటి దృష్టి పడి వుంటుందని భావించి.. రాళ్ల ఉప్పుతో దిష్టి తీయాలి. ఆపై ఆ ఉప్పును నీళ్లలో కలిపేయాలి.

ఐదేళ్లు దాటిన పిల్లలకు అన్నం వార్చి.. పసుపు, కుంకుమతో కలిపి వాటితో దిష్టి తీయాలి. ముఖ్యంగా కర్పూరంతో దిష్టి తీయాలి. అప్పుడప్పుడు పిల్లలు కింద పడితే.. కర్పూరాన్ని పళ్లెంలోకి తీసుకుని.. పిల్లలను మూడు సార్లు తిప్పి.. పక్కన తీసేయాలి. కర్పూరం కరిగేట్లు కంటి దృష్టి కూడా కరిగిపోతుందని.. విశ్వాసం.