గురువారం, 2 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. ఆయుర్వేదం
Written By Kowsalya
Last Updated : సోమవారం, 1 అక్టోబరు 2018 (18:15 IST)

కొబ్బరి, కర్పూరం నూనెతో పిల్లలకు అలా మర్దన చేస్తే?

సాధారణంగా చిన్నారులు నిద్రలో పక్క తడుపుతుంటారు.

సాధారణంగా చిన్నారులు నిద్రలో పక్క తడుపుతుంటారు. ఈ సమస్య తొలగిపోలాంటే ఈ ఆరోగ్య చిట్కాలు పాటిస్తే చాలు.. వెంటనే ఉపశమనం లభిస్తుంది. ధనియాల పొడిలో కొద్దిగా చక్కెర కలుపుకుని రోజుకు మూడుసార్లు పిల్లలకు ఇస్తే నిద్రలో పక్క తడుపుకునే సమస్య మానుకుంటారని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
 
కొంతమంది పిల్లలకు గ్యాస్ట్రిక్ సమస్యల వలన కూడా పక్క తడుపుతుంటారు. అందుకు సోడాలో కొద్దిగా ఉప్పు, మిరియాల పొడి కలుపుకు తాపితే గ్యాస్ట్రిక్ సమస్య తొలగిపోతుంది. జలుబు జ్వరానికి వైద్య చికిత్సలు అవసరం లేదు. ఎందుకంటే.. కొబ్బరి నూనెలో కొద్దిగా కర్పూరం వేసి వేడిచేసుకుని చిన్నారులకు ముక్కుపై, వెన్నుపై ఆ నూనెతో మర్దన చేయాలి. 
 
దీంతో జలుబు వెంటనే తగ్గిపోతుంది. మరికొందరికి కళ్ళు లాగడం, తిప్పడం వంటి సమస్యలు ఏర్పడుతాయి. అలాంటప్పుడు ప్రతిరోజూ యాలకులను తేనెతో కలిపి తినిపిస్తే మంచిదని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.