శనివారం, 23 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By Kowsalya
Last Updated : సోమవారం, 24 సెప్టెంబరు 2018 (16:56 IST)

నిమ్మరసంలో జీలకర్ర పొడి కలుపుకుని వెంట్రుకలకు రాసుకుంటే?

ఆవనూనెలో కొద్దిగా నిమ్మరసం కలుపుకుని జుట్టుకు రాసుకోవాలి. అరగంట తరువాత తలస్నానం చేస్తే వెంట్రుకలు ఒత్తుగా పెరుగుతాయి. యాపిల్ సైడర్ వెనిగర్‌లో జీలకర్రను వేసుకుని 20 నిమిషాల పాటు బాగా నానబెట్టుకోవాలి. ఆ

ఆవనూనెలో కొద్దిగా నిమ్మరసం కలుపుకుని జుట్టుకు రాసుకోవాలి. అరగంట తరువాత తలస్నానం చేస్తే వెంట్రుకలు ఒత్తుగా పెరుగుతాయి. యాపిల్ సైడర్ వెనిగర్‌లో జీలకర్రను వేసుకుని 20 నిమిషాల పాటు బాగా నానబెట్టుకోవాలి. ఆ తరువాత తలకు రాసుకుని గంట తరువాత తలస్నానం చేయాలి. ఇలా చేయడం వలన జుట్టు పొడిబారకుండా ఉంటుంది.
 
ఒక బౌల్‌లో జీలకర్ర పొడి, పెరుగు, ఆలివ్ నూనె వేసుకుని బాగా పేస్ట్‌లా తయారుచేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని తలకు రాసుకుంటే అరగంట తరువాత తలస్నానం చేయాలి. దీంతో చుండ్రు సమస్యలు తొలగిపోతాయి. గోరింటాకు పొడిలో జీలకర్ర పొడిని కలుపుకుని జుట్టుకు రాసుకోవాలి. 20 నిమిషాల తరువాత తలస్నానం చేస్తే జుట్టు మృదువుగా మారుతుంది. 
 
నిమ్మరసంలో జీలకర్ర పొడిని కలుపుకుని పేస్ట్‌లా తయారుచేసుకుని తలకు రాసుకోవాలి. అరగంట తరువాత తలస్నానం చేస్తే మంచి ఉపశమనం లభిస్తుంది. కొబ్బరినూనెలో కొద్దిగా జీలకర్ర పొడిని కలుపుకుని వెంట్రుకలకు రాసుకోవాలి. 45 నిమిషాల తరువాత తలస్నానం చేయాలి. ఇలా చేయడం వలన జుట్టు రాలిపోవడం వంటి సమస్యలు తొలగిపోతాయి.