బుధవారం, 25 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. గృహాలంకరణ
Written By selvi
Last Updated : శుక్రవారం, 21 సెప్టెంబరు 2018 (10:33 IST)

ఇంట్లో సాంబ్రాణి పొగ వేస్తున్నారా?

ఇంట్లో సాంబ్రాణి పొగ వేస్తే ఎంత మేలో తెలుసా? పసిపిల్లలు ఇంట్లో వున్నప్పుడు సాంబ్రాణి పొగ వేస్తుంటారు. కానీ వర్షాకాలంలో ప్రతి ఇంట్లో సాంబ్రాణి పొగ వేసుకోవడం మంచిది. ఇంట్లో దుర్వాసనలు, క్రిమికీటకాలతో సహ

ఇంట్లో సాంబ్రాణి పొగ వేస్తే ఎంత మేలో తెలుసా? పసిపిల్లలు ఇంట్లో వున్నప్పుడు సాంబ్రాణి పొగ వేస్తుంటారు. కానీ వర్షాకాలంలో ప్రతి ఇంట్లో సాంబ్రాణి పొగ వేసుకోవడం మంచిది. ఇంట్లో దుర్వాసనలు, క్రిమికీటకాలతో సహా సాంబ్రాణి పొగతో దూరమవుతాయి. సాంబ్రాణితో ఇల్లంతా మంచి సువాసనను సంతరించుకుంటుంది. అలాగే కర్పూరాన్ని కూడా ఇలా వాడొచ్చు. 
 
కర్పూరం వెలిగించిన కాసేపే ఆ వాసన ఉంటుంది. అందుకే అలా చేయకుండా.. ఆరు కర్పూరం బిళ్లలో అగరొత్తుల పొడి కలిపి ఇంట్లో లేదంటే స్నానాల గదుల్లో ఉంచి చూడండి. ఆ వాసన ఎక్కువ సేపు ఉంటుంది. పైగా కర్పూర పరిమళానికి ఈగలు కూడా దరిచేరవు. ఇంకా నిమ్మ, లావెండర్‌, దాల్చిన చెక్క నూనెలు బజార్లో దొరుకుతాయి. ఇవి ఇంట్లో పరిమళాలను వెదజల్లడంతోపాటు ఒత్తిడినీ దూరం చేస్తాయి. వీటిలో దూదిని ముంచి ఓ గదిలో పక్కన పెడితే చాలు.. ఇల్లంతా సువాసనతో నిండిపోతుంది. 
 
అలాగే వంటగదిలో రంధ్రాలున్న చిన్న గిన్నె తీసుకుని అందులో కొన్ని కాఫీ గింజల్ని నింపి మూత పెట్టాలి. ఈ గిన్నెను వంటింట్లో ఓ మూలన ఉంచాలి. కాఫీ గింజలు ఇతర దుర్వాసనల్ని పీల్చుకుని వాటి వాసనల్ని వెదజల్లుతుంటాయి. మసాలా వాసన, చేపల వాసన పోవాలంటే.. స్ప్రే సీసాలో వెనిగర్‌ని తీసుకుని వంటిల్లూ, ఇతర గదుల్లో చల్లి చూస్తే మంచి ఫలితం వుంటుంది.