శనివారం, 25 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By ivr
Last Modified: శనివారం, 24 మార్చి 2018 (20:21 IST)

అక్కడ పుట్టుమచ్చ వున్న స్త్రీ యొక్క భర్త బాగా సంపాదిస్తాడట...

మనిషి జీవితంలో పుట్టుమచ్చలు కీలక పాత్రను పోషిస్తాయి. ప్రత్యేకంగా స్త్రీలలో ముఖ్యంగా పుట్టుమచ్చలు ఎక్కడెక్కడ ఉంటే ఎలాంటి ప్రభావం ఉంటుందో తెలుసుకుందాం... స్త్రీలకు రెండు కనుబొమ్మలు కలిసే మధ్యలో పుట్టుమచ్చ ఉంటే ధనప్రాప్తి, మంచి భర్త, మంచి సంతానం కలుగుతు

మనిషి జీవితంలో పుట్టుమచ్చలు కీలక పాత్రను పోషిస్తాయి. ప్రత్యేకంగా స్త్రీలలో ముఖ్యంగా పుట్టుమచ్చలు ఎక్కడెక్కడ ఉంటే ఎలాంటి ప్రభావం ఉంటుందో తెలుసుకుందాం... స్త్రీలకు రెండు కనుబొమ్మలు కలిసే మధ్యలో పుట్టుమచ్చ ఉంటే ధనప్రాప్తి, మంచి భర్త, మంచి సంతానం కలుగుతుంది. ఎటువంటి కష్టాలు లేకుండా అందరి ప్రశంసలతో గౌరవించబడతారు. 
 
అలాగే స్త్రీలకు చేతిపైన గాని, నుదుటిపైన గాని ఎరుపురంగు పుట్టుమచ్చలు ఉంటే సకల శుభాలు, ఆరోగ్యం, ఐశ్వర్యం కలుగుతుంది. అలాగే నుదుటి కుడి భాగంలో పుట్టు మచ్చ ఉంటే వారి జీవితంలో అద్భుతమైన శుభాలు జరుగుతాయి. ఎడమవైపు పుట్టు మచ్చ ఉంటే సాధారణ ఫలితాలు కలుగుతాయి. 
 
ఎడమ చెక్కిలిపై పుట్టుమచ్చ ఉంటే అనంతమైన ఐశ్వర్యం కలిగిన సుఖాలు, భోగాలు కలుగుతాయి. పుట్టుమచ్చ పెదాల పైభాగాన ఉంటే వారి వల్ల కుటుంబానికి మేలు జరుగుతుండటంతో పాటు అందరితో కలుపుగోలు స్వభావం ఉంటుంది. క్రింది పెదవిపై పుట్టుమచ్చ ఉంటే భోజన ప్రియులుగా కలిగి ఉండి మంచి మిత్రులతో కలిసి ఉంటారు. 
 
నాలుకపై పుట్టుమచ్చ ఉన్నట్లయితే వారు సంగీత రంగంలో బాగా రాణిస్తారు. స్త్రీలకు ఎడమ దవడపై ఉంటే వారు సామాన్యమైన జీవితం  గడుపుతూ అందరితో సున్నితంగా వ్యవహరిస్తూ ఎవరినీ నొప్పించకుండా ఉంటారు. కుడి దవడపై పుట్టుమచ్చ ఉంటే అనారోగ్యం, ఆరోగ్య సమస్యలు ఉంటాయి. గడ్డంపైన ఉంటే నెమ్మదస్తురాలిగా ఉంటారు. అంతేకాదు వీరి భర్త బాగా సంపాదిస్తుంటారు. గడ్డంపై స్త్రీలకు పుట్టుమచ్చ ఉంటే శుభసూచికంగా భావించాలి. ముక్కు మీద ఉంటే మంచి పట్టుదల కలిగి ఉండి అనుకున్న దాన్ని సాధించగలుగుతారు. అలాగే ముక్కు చివరి భాగంలో పుట్టుమచ్చ ఉంటే అదృష్టం కలిసి వచ్చి సుఖాలు కలిగి ఉంటారు.