శుక్రవారం, 24 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By selvi
Last Updated : గురువారం, 15 ఫిబ్రవరి 2018 (11:10 IST)

శెనగలను స్నాక్స్‌గా తీసుకుంటే.. బరువు పెరగరండోయ్..

నల్లటి శెనగలను ఆహారంలో చేర్చుకోవడం ద్వారా అధిక బరువు తగ్గుతారు. ఇందులోని ఫైబర్ కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. శరీరంలో చక్కెర స్థాయుల్ని నియంత్రిస్తుంది. తద్వారా మధుమేహాన్ని దూరం చేసుకోవచ్చు. ఈ శెనగల్లో

నల్లటి శెనగలను ఆహారంలో చేర్చుకోవడం ద్వారా అధిక బరువు తగ్గుతారు. ఇందులోని ఫైబర్ కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. శరీరంలో చక్కెర స్థాయుల్ని నియంత్రిస్తుంది. తద్వారా మధుమేహాన్ని దూరం చేసుకోవచ్చు. ఈ శెనగల్లో వుండే పొటాషియం రక్తపోటును నివారిస్తుంది.

ఐరన్, క్యాల్షియం ద్వారా శరీరానికి బలం చేకూరుతుంది. శెనగల్లో వుండే పీచు జీర్ణ సమస్యలను నివారిస్తుంది. చెడు కొలెస్ట్రాల్‌కు చెక్ పెట్టి.. గుండె జబ్బులను దూరం చేస్తుంది. 
 
శెనగల్లో పాస్ఫరస్ అధికంగా ఉంటుంది. ఇది శరీరంలో ఉండే ఉప్పును బయటకు పంపుతుంది. దీంతో కిడ్నీలపై భారం తగ్గుతుంది. కిడ్నీలు సరిగ్గా పనిచేస్తాయి. ఒక కప్పు శెనగలను ఉడకబెట్టుకుని రోజూ స్నాక్స్‌గా తీసుకుంటే ఎరుపు రక్త కణాలు పెరుగుతాయి. 
 
మాంసాహరం తీసుకోని వారు శెనగలను ఉడికించి తీసుకుంటే శరీరానికి శక్తి లభిస్తుంది. ఎందుకంటే మాంసాహారం కంటే శెనగల్లో ప్రోటీన్లు పుష్కలంగా వుంటాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.