మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By raman
Last Updated : శనివారం, 24 మార్చి 2018 (11:43 IST)

24-03-2018 శనివారం మీ రాశి ఫలితాలు.. ఏమరుపాటుతనం వల్ల?

మేషం: ఆడిటర్లకు అకౌంట్స్ రంగాల వారికి పనిభారం అధికమవుతుంది. కుటుంబీకుల మధ్య పరస్పర అవగాహన లోపం, చికాకులు అధికమవుతాయి. వీలైనంత వరకూ మీ పనులు మీరే చూసుకోవడం ఉత్తమం. రాజకీయనాయకులు సభలు సమావేశాల్లో హుందాగ

మేషం: ఆడిటర్లకు అకౌంట్స్ రంగాల వారికి పనిభారం అధికమవుతుంది. కుటుంబీకుల మధ్య పరస్పర అవగాహన లోపం, చికాకులు అధికమవుతాయి. వీలైనంత వరకూ మీ పనులు మీరే చూసుకోవడం ఉత్తమం. రాజకీయనాయకులు సభలు సమావేశాల్లో హుందాగా వ్యవహరించి అందరినీ ఆకట్టుకుంటారు.
 
వృషభం: ఆర్థిక లావాదేవీలు, కుటుంబ వ్యవహారాలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. గృహానికి కావలసిన వస్తువులను కొనుగోలు చేస్తారు. స్త్రీలకు పరిచయాలు, వ్యాపకాలు అధికమవుతాయి. మీ పథకాలు, ప్రణాళికలు కార్యరూపం దాల్చుతాయి. ఊహించని పరిణామాలు ఎదురవుతాయి.
 
మిథునం: చేపట్టిన పనుల్లో స్వల్ప ఆటంకాలు, చికాకులు ఎదుర్కొంటారు. చేతివృత్తులు, ఏజెంట్లు, బ్రోకర్లకు శ్రమాధిక్యత మినహా ఆశించిన ప్రతిఫలం లభించదు. ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాలు, వాణిజ్య ఒప్పందాల్లో ఏకాగ్రత అవసరం. రియల్ ఎస్టేట్, మార్కెట్ రంగాల వారికి ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు.
 
కర్కాటకం: మీ యత్నాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. కుటుంబంలో కొత్త ఉత్సాహం నెలకొంటుంది. స్టాక్ మార్కెట్ రంగాల వారికి నూతన ఆలోచనలు స్ఫురిస్తాయి. పత్రికా రంగంలోని వారి ప్రతిభకు మంచి గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగస్తులకు శుభవార్తలు అందుతాయి. అవాహితులు కొత్త అనుభూతికి లోనవుతారు. 
 
సింహం: నిరుద్యోగులకు రాత, మౌఖిక పరీక్షల్లో ఏకాగ్రత అవసరం. విలువైన పత్రాలు, రశీదులు చేతికందుతాయి. కాంట్రాక్టర్లకు ఇంజనీరింగ్ విభాగం నుంచి ఒత్తిడి పెరుగుతుంది. చేతివృత్తులు, వ్యాపారులకు అన్ని విధాలా కలిసిరాగలదు. అధికారులకు తమ కిందిస్థాయి ఉద్యోగస్తుల తీరు అసహనం కలిగిస్తుంది.
 
కన్య: ఉన్నతస్థాయి అధికారులకు అపరిచిత వ్యక్తుల వల్ల చికాకులు తప్పవు. శస్త్రచికిత్సల సమయంలో వైద్యులకు ఏకాగ్రత ముఖ్యం. మీ ఏమరుపాటుతనం వల్ల విలువైన వస్తువులు చేజారిపోయే ఆస్కారం వుంది. కొంతమంది మీ ఆలోచనలను తప్పుదారి పట్టించేందుకు యత్నిస్తారు. మీ ప్రత్యర్థుల తీరు ఆందోళన కలిగిస్తుంది.
 
తుల: నిర్మాణ పనులలో నాణ్యతాలోపం వల్ల కాంట్రాక్టర్లు కష్టనష్టాలు ఎదుర్కొంటారు. మాట్లాడలేనిచోట మౌనం వహించడం మంచిది. ప్రముఖుల సహకారంతో ఒక సమస్య నుంచి గట్టెక్కుతారు. ఆకస్మిక ఖర్చులు, ధనం సమయానికి అందకపోవడం వంటి చికాకులు ఎదుర్కొంటారు. అనుకోకుండా కొన్ని పనులు పూర్తిచేస్తారు. 
 
వృశ్చికం: రవాణా రంగాలవారికి ప్రయాణీకులతో ఇబ్బందులు తప్పవు. ఏజెంట్లు, బ్రోకర్లకు ఒత్తిడి, పనిభారం అధికమవుతాయి. మీ ధైర్య సాహసాలకు మంచి గుర్తింపు లభిస్తుంది. ఆధ్యాత్మిక, సామాజిక కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఉద్యోగస్తులు ఆశిస్తున్న ప్రమోషన్ రావటానికి మరికొంత కాలం వేచివుండక తప్పదు. 
 
ధనస్సు: స్త్రీలు ఆగ్రహావేశాలు అదుపులో వుంచుకోవడం క్షేమదాయకం. దూరపు బంధువులు నుంచి అందిన ఆహ్వానం ఆశ్చర్యం కలిగిస్తుంది. కుటుంబ సౌఖ్యం, మానసిక ప్రశాంతత నెలకొంటాయి. ప్రేమికులకు సన్నిహితుల నుంచి ప్రోత్సాహం లభిస్తుంది. ప్రయాణాల లక్ష్యం నెరవేరదు. సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. 
 
మకరం: కొబ్బరి పండ్ల, పూల, తినుబండారాల, వ్యాపారులకు పురోభివృద్ధి కానవస్తుంది. పెద్దల ఆరోగ్యం సంతృప్తినిస్తుంది. స్థిరచరాస్తుల క్రయ విక్రయాలు అనుకూలిస్తాయి. ఒకానొక విషయంలో మిత్రుల తీరు ఆగ్రహం కలిగిస్తుంది. ఆహార వ్యవహారాల్లో ఏకాగ్రత వహించండి. వాహన చోదకులకు ఊహించని చికాకులెదురవుతాయి.
 
కుంభం: మీ బలహీనతలు, అలవాట్లు అదుపులో ఉంచుకోవడం శ్రేయస్కరం. కొత్త ప్రదేశాల సందర్శనలు ఉల్లాసం కలిగిస్తాయి. నిత్యావసర వస్తు వ్యాపారులకు, స్టాకిస్టులకు అధికారుల నుంచి వేధింపులు అధికమవుతాయి. విదేశీయానం కోసం ప్రయత్నాలు అనుకూలిస్తాయి. రాజకీయ రంగాల్లో వారికి అప్రమత్తత అవసరం. 
 
మీనం: ఆర్థిక విషయాల్లో లౌక్యంగా వ్యవహరించండి. సంఘంలో మీ గౌరవ ప్రతిష్టలు ఇనుమడిస్తాయి. ప్రత్యర్థులు మీ శక్తి సామర్థ్యాలను గుర్తిస్తారు. ఆకస్మిక ప్రయాణం తలపెడతారు. కపటంలేని మీ ఆలోచనలు, సలహాలు మీకు అభిమానుల్ని సంపాదించి పెడుతుంది. భాగస్వామిక చర్చల్లో కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు.