బుధవారం, 25 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By pnr
Last Updated : మంగళవారం, 20 మార్చి 2018 (10:00 IST)

మంగళవారం (20-03-18) దినఫలాలు : స్త్రీలతో మితంగా...

మేషం : ప్రముఖుల సహకారంతో మీ పాత సమస్యలు ఒక కొలిక్కి వస్తాయి. పత్రికా, వార్తా సంస్థలలోని వారికి ఏకాగ్రత, మెళకువ అవసరం. రాబోయే ఖర్చులకు ముందుగానే ధనం సర్దుబాటు చేసుకుంటారు. స్త్రీలతో మితంగా సంభాషించడం మ

మేషం : ప్రముఖుల సహకారంతో మీ పాత సమస్యలు ఒక కొలిక్కి వస్తాయి. పత్రికా, వార్తా సంస్థలలోని వారికి ఏకాగ్రత, మెళకువ అవసరం. రాబోయే ఖర్చులకు ముందుగానే ధనం సర్దుబాటు చేసుకుంటారు. స్త్రీలతో మితంగా సంభాషించడం మంచిదని గమనించండి. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలు, పనిభారం ఒత్తిడి అధికం. 
 
వృషభం : పొగడ్తలు, మొహమ్మాటాలకు దూరంగా ఉండాలి. ఎవరికైనా ధన సహాయం చేసినా తిరిగి రాజాలదు. రేపటి సమస్య గురించి అధికంగా ఆలోచిస్తారు. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. స్త్రీలకు పనివారితో ఒత్తిడి, చికాకులు తప్పవు. ఉపాధ్యాయులకు, మార్కెట్ రంగాల వారికి ఒత్తిడి అధికమవుతుంది. 
 
మిథునం : పాత మిత్రుల కలయికతో మానసికంగా కుదుటపడతారు. బీమా ఏజెంట్లకు, స్థలాల బ్రోకర్లకు చికాకులు తప్పవు. కష్ట సమయంలో బంధువులు అండగా నిలుస్తారు. మిత్రుల రాకతో ఖర్చులు అధికమవుతాయి. దూర ప్రయాణాలలో నూతన పరిచయాలేర్పడతాయి. హోటల్, కేటరింగ్ రంగాల్లో వారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు. 
 
కర్కాటకం : వ్యాపారంలో పెరిగిన పోటీ వాతావరణం ఆందోళన కలిగిస్తుంది. నిరుద్యోగులు నిరుత్సాహం, నిర్లిప్తత వీడనాడినా సత్ఫలితాలు సాధిస్తారు. మీ అభిరుచులకు తగిన విధంగా కుటుంబ సభ్యులు మసలుకుంటారు. ఉపాధ్యాయులకు, మార్కెటింగ్ రంగాల వారికి ఒత్తిడి అధికమవుతుంది. పెద్దల ఆరోగ్యం సంతృప్తినిస్తుంది. 
 
సింహం : రియల్ ఎస్టేట్, బ్రోకర్లకు వ్యాపారస్తులకు పనివారితో చికాకులు తప్పవు. మీ సృజనాత్మక శక్తికి, తెలివితేటలకు గుర్తింపు లభిస్తుంది. మీ పాత సమస్యలు పరిష్కారం కాకపోవడంతో ఒకింత నిరుత్సాహానికి గురవుతారు. విదేశీ వ్యవహారాలు మీకు అనుకూలిస్తాయి. లాటరీ వ్యాపారస్తులకు సంతృప్తికానవస్తుంది. 
 
కన్య : స్త్రీలకు ఉదరం, నేత్ర సంబంధిత చికాకులు వల్ల ఆందోళన చెందుతారు. బ్యాంకు వ్యవహారాల్లో పనులు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగస్తులకు సభలు, సమావేశాల్లో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాలలో వారికి సదావకాశాలు లభిస్తాయి. ఉన్నతాధికారులపై దాడులు జరుగుతాయి. 
 
తుల : రచయితలకు, పత్రికా రంగంలో వారికి ప్రోత్సాహం కానవస్తుంది. మీ సంతానం వివాహ, ఉద్యోగ యత్నాలు ముమ్మరం చేస్తారు. పాత వస్తువులను కొని ఇబ్బందులు తెచ్చుకోకండి. పెంపుడు జంతువుల ఆరోగ్యములో మెళకువ అవసరం. ఆకస్మికంగా దూర ప్రయాణాలలో నూతన పరిచయాలు ఏర్పడతాయి. 
 
వృశ్చికం : పాత రుణాలు తీర్చి తాకట్టు పెట్టిన వస్తువులు విడిపిస్తారు. దైవ దర్శనాలకై చేయు ప్రయత్నాలు అనుకూలిస్తాయి. రాజకీయ నాయకులకు ప్రయాణాలలో మెళకువ అవసరం. ఎక్స్‌పోర్టు, ట్రాన్స్‌పోర్టు రంగాల వారికి పురోభివృద్ధి. పాత మిత్రుల కలయిక ఎంతో సంతృప్తినిస్తుంది. పెద్దల ఆరోగ్యంలో ఆందోళన తప్పదు. 
 
ధనస్సు : సన్నిహితులతో కలిసి చేపట్టిన పనులు సమీక్షిస్తారు. స్త్రీలు ప్రముఖుల సిఫార్సులతో దైవదర్శనాలను త్వరగా ముగించుకుంటారు. తప్పనిసరి చెల్లింపులు వల్ల ఇబ్బందులెదుర్కొంటారు. అతిథి మర్యాదలు బాగుగా నిర్వహించుటవల్ల మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. యాదృచ్ఛికంగా ఒక పుణ్యక్షేత్రం సందర్శిస్తారు. 
 
మకరం : స్త్రీల పట్టుదల, మొండివైఖరి వల్ల గృహంలో ప్రశాంతత లోపిస్తుంది. గత విషయాలు జ్ఞప్తికి వస్తాయి. ఒక్కోసారి మీ జీవితభాగస్వామి మనస్తత్వం అర్థం చేసుకోవడం కష్టమవుతుంది. బ్యాంకు వ్యవహారాలలో మెళకువ వహించండి. కొబ్బరి, పండ్లు, పూల, పానీయ కూరగాయల, చిరు వ్యాపారులకు పురోభివృద్ధి కానవస్తుంది. 
 
కుంభ : విద్యార్థులు పోటీని ఎదుర్కొనవలసి వస్తుంది. స్త్రీలు అకాల భోజనం, శారీరక శ్రమవల్ల ఆరోగ్యం మందగిస్తుంది. వృత్తి వ్యాపారాలకు సంబంధించిన విషయాలు కలవర పెడతాయి. అందరితో సఖ్యతగా మెలుగుతూ మీ పనులు పూర్తి చేసుకోగలుగుతారు. గృహంలో మార్పులు, చేర్పులు వాయిదాపడతాయి. 
 
మీనం : శ్రీవారు, శ్రీమతి వైఖరి ఉల్లాసం కలిగిస్తాయి. మీ పెద్దల ధోరణి మీకెంతో చికాకు కలిగిస్తుంది. బంధువుల రాకవల్ల గృహంలో సందడి కానవస్తుంది. ఎదుటివారితో ఎలా మాట్లాడినా తప్పుగానే భావిస్తారు. విదేశీ వ్యవహారాలు మీకు అనుకూలిస్తాయి. ప్రియతములకు విలువైన కానుకలు ఇచ్చిపుచ్చుకుంటారు.