బుధవారం, 25 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By Raman
Last Updated : సోమవారం, 19 మార్చి 2018 (13:23 IST)

శనివారం (17-03-18) దినఫలాలు : ఆశయ సాధనకు నిరంతరం...

మేషం : మీ యత్నాలకు సన్నిహితులు, కుటుంబీకుల ప్రోత్సాహం లభిస్తుంది. మీ ఆశయ సాధనకు నిరంతర కృషి అవసరం అని గమనించండి. ఉద్యోగ, విదేశీయాన, రుణయత్నాలు ఫలిస్తాయి. కొబ్బరి, పండ్ల, పూల, పానీయ వ్యాపారులకు సామాన్య

మేషం : మీ యత్నాలకు సన్నిహితులు, కుటుంబీకుల ప్రోత్సాహం లభిస్తుంది. మీ ఆశయ సాధనకు నిరంతర కృషి అవసరం అని గమనించండి. ఉద్యోగ, విదేశీయాన, రుణయత్నాలు ఫలిస్తాయి. కొబ్బరి, పండ్ల, పూల, పానీయ వ్యాపారులకు సామాన్యంగా ఉంటుంది. మీకు తెలియకుండానే దుబారా ఖర్చులు చేస్తారు.
 
వృషభం : దంపతుల మధ్య అవగాహన లోపం, చిన్న చిన్న కలహాలు తలెత్తే ఆస్కారం ఉంది. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. మీ అభిప్రాయాలకు మంచి స్పందన లభిస్తుంది. ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యం కూడదు. నిరుద్యోగులకు ఉపాధి పథకాలపై ఆసక్తి నెలకొంటుది. గృహ నిర్మాణ ప్లానుకు అభ్యంతరాలు ఎదురవుతాయి.
 
మిథునం : ఒక స్థిరాస్తి అమర్చుకోవాలనే ఆలోచన స్ఫురిస్తుంది. విద్యార్థులకు లక్ష్య సాధన పట్ల ఏకాగ్రత నెలకొంటుంది. ప్రయత్నపూర్వకంగా బాకీలు వసూలు కాగలవు. మీ శ్రీమతితో అనునయంగా మెలగాలి. ఒక అవసరానికి ఉంచిన ధనం మరొకదానికి వినియోగించవలసి రావచ్చు. కోర్టు వ్యవహారాలు వాయిదా పడతాయి.
 
కర్కాటకం : రాబడికి మించిన ఖర్చులుంటాయి, పొదుపు చేద్దామనే మీ ఆలోచన ఫలించకపోవచ్చు. ఉపాధ్యాయ రంగాలలో వారికి అభిప్రాయ భేధాలు తలెత్తవచ్చు జాగ్రత్త వహించండి. ప్రముఖుల కలయిక అనుకూలించినా ఆశించిన ప్రయోజనం ఉండదు. స్త్రీలకు స్వీయ ఆర్జన పట్ల ఆసక్తి, ప్రోత్సాహం లభిస్తాయి.
 
సింహం : నిరుద్యోగులకు ప్రకటనల పట్ల ఏకాగ్రత ముఖ్యం. స్త్రీలకు చీటికి మాటికి అసహనం, నిరుత్సాహం వంటి చికాకులు తప్పవు. విదేశాలు వెళ్ళే ప్రయత్నాల్లో సఫలీకృతులవుతారు. పాత మిత్రుల కలయికతో గత జ్ఞాపకాలు గుర్తుకు వస్తాయి. బ్యాంకు వ్యవహారాలలో అపరిచిత వ్యక్తులపట్ల మెళుకువ అవసరం.
 
కన్య : ఉద్యోగస్తులకు కొత్త అధికారులు, సహోద్యోగులతో సత్సంబంధాలు నెలకొంటాయి. లౌక్యం, సర్దుబాటు ధోరణితో వ్యవహరించటం వల్ల కొన్ని సమస్యలు పరిష్కారమవుతాయి. బిల్లులు చెల్లించ గలుగుతాయి. మీ రచనా వ్యాసాంగాలకు మంచి స్పందన లభిస్తుంది. అనాలోచితంగా మాటజారి ఇబ్బందులెదుర్కొంటారు.
 
తుల : ప్రభుత్వ కార్యాలయాల్లో మీ పనుల సానుకూలతకు పలుమార్లు తిరగవలసి ఉంటుంది. వాయిదా పడిన మొక్కుబడులు తీర్చుకుంటారు. భాగస్వామిక వ్యాపారాల నుంచి తప్పుకోవటం అన్ని విధాలా శ్రేయస్కరం. ఒక రహస్యం దాచినందుకు మీ శ్రీమతి ఆగ్రహావేశాలకు గురికావలసి వస్తుంది. ఖర్చులు అధికమవుతాయి.
 
వృశ్చికం : పత్రిక, మీడియా సంస్థల వారు అకారణంగా మాటపడవలసి వస్తుంది. వ్యాపారాల్లో మొహమ్మాటలకు తావివ్వటం మంచిది కాదు. ఉద్యోగస్తులు సభ, సమావేశాలలో పాల్గొంటారు. హోటల్, కేటరింగ్ రంగాల్లో వారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు. దైవ, సేవా, పుణ్య కార్యాల పట్ల ఆసక్తి పెరుగుతుంది.
 
ధనస్సు : వస్త్ర, బంగారు, వెండి, లోహ వ్యాపారస్థులు అధిక ఒత్తిడిని, ఇబ్బందులను ఎదుర్కొంటారు. మీరు ప్రేమించే వ్యక్తితో మరింత ఆనందాన్ని పొందుతారు. శ్రీవారు, శ్రీమతి విషయాలలో శుభపరిణామాలు సంభవం. వ్యాపారాల్లో పోటీతత్వం అధికంగా ఉంటుంది. ప్రేమికుల వ్యవహారం పెద్దలకు సమస్యగా మారుతుంది.
 
మకరం : నిజాయితీగా వ్యవహరించి అందరి ప్రశంసలు పొందుతారు. నిత్యవసర వస్తు వ్యాపారులకు కలిసిరాగలదు. స్త్రీలకు నరాలు, ఉదరం, దంతాలకు సంబంధించిన చికాకులు ఎదుర్కోవలసివస్తుంది. చిట్స్, ఫైనాన్సు రంగాల వారి తీరు ఖాతాదారులకు ఇబ్బంది కలిగిస్తాయి. గృహ నిర్మాణాల్లో పెరిగిన వ్యయం ఆందోళన కలిగిస్తుంది.
 
కుంభం : కాంట్రాక్టర్లు, బిల్డర్లకు పనివారలతో చికాకులు తప్పవు. ఖర్చులు పెరిగినా ఆదాయానికి లోటుండదు. స్త్రీలకు ఆరోగ్యభంగం, నీరసం వంటి చికాకులు తప్పవు. నిరుద్యోగులు బోగస్ ప్రకటనలు, అపరిచిత వ్యక్తులకు సొమ్ము చెల్లించే విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగస్తులు అధికారుల ఒత్తిడితో సతమతమవుతారు.
 
మీనం : రావలసిన ధనంలో కొంత మొత్తమే చేతికందుతుంది. వ్యాపార లావాదేవీలు, ఆంతరంగి విషయాలు గోప్యంగా ఉంచండి. సంఘంలో మంచి గుర్తింపు లభిస్తుంది. స్త్రీలు టీ.వీ కార్యక్రమాల్లో రాణిస్తారు. పెద్దమొత్తంలో చెక్కులిచ్చే విషయంలో మెలకువ వహించండి. పట్టువిడుపుతోనే మీ సమస్యలు పరిష్కారమవుతాయి.