ఆదివారం, 26 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By Raman
Last Updated : సోమవారం, 12 మార్చి 2018 (11:25 IST)

సోమవారం మీ రాశి ఫలితాలు.. అందరినీ అతిగా నమ్మే మీ స్వభావం...?

మేషం: పత్రిక, మీడియా సంస్థల వారు అకారణంగా మాటపడవలసి వస్తుంది. ఆదాయానికి మించి ఖర్చులున్నా వెసులు బాటు ఉంటుంది. కోర్టు వ్యాజ్యాలను ఉపసంహరించుకుంటారు. ఉద్యోగస్తులకు ట్రాన్స్‌ఫర్, ప్రమోషన్ ఆర్డర్లు చేతిక

మేషం: పత్రిక, మీడియా సంస్థల వారు అకారణంగా మాటపడవలసి వస్తుంది. ఆదాయానికి మించి ఖర్చులున్నా వెసులు బాటు ఉంటుంది. కోర్టు వ్యాజ్యాలను ఉపసంహరించుకుంటారు. ఉద్యోగస్తులకు ట్రాన్స్‌ఫర్, ప్రమోషన్ ఆర్డర్లు చేతికందుతాయి. విద్యార్థులు భయాందోళనలు వీడి శ్రమించిన సత్ఫలితాలు లభిస్తాయి.
 
వృషభం: ప్రముఖుల పరిచయాలు మీ ఉన్నతికి దోహదపడతాయి. చిన్న సమస్యదే అయినా తేలికగా తీసుకోవటం మంచిది కాదు. నిరుద్యోగులు ఉపాధి పథకాల్లో క్రమంగా నిలదొక్కుకుంటారు. మీ సంతానం పై చదువుల విషయమై పొదుపు పథకాల దిశగా ఆలోచనలు సాగిస్తారు. బంధువుల రాకతో ఖర్చులు అధికమవుతాయి.
 
మిథునం: కోర్టు వాదోపవాదాల్లో ప్లీడర్లకు గుర్తింపు లభిస్తుంది. రిప్రజెంటేటి‌వ్‌లు, ప్రైవేటు సంస్థలలోని వారికి ప్రగతితో కూడిన అవకాశాలు లభిస్తాయి. ప్రయాణాలు, విలువైన వస్తువుల కొనుగోళ్ళలో ఏకాగ్రత వహించండి. మిమ్ములను అభిమానించే వ్యక్తులు దూరమవుతారు. ప్రియతముల గురించి ఆందోళన చెందుతారు.
 
కర్కాటకం: ఉద్యోగస్తులు అనవసర బాధ్యతలు చేపట్టి ఇబ్బందులెదుర్కొంటారు. అందరినీ అతిగా నమ్మే మీ స్వభావం ఇబ్బందులకు దారితీస్తుంది. వృత్తులు, క్యాటరింగ్ పనివారలకు సదవకాశాలు లభిస్తాయి. ఆదాయ వ్యయాలకు చక్కని ప్రణాళికలు రూపొందిస్తారు. వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి.
 
సింహం: ప్రముఖుల ఇంటర్వ్యూ కోసం అధిక సమయం వేచి ఉండక తప్పదు. మీ శ్రీమతిలో వచ్చిన మార్పు సంతృప్తినిస్తుంది. షాపు గుమాస్తాలు, పనివారలను ఓ కంట కనిపెట్టండి. ఆడిట్, అక్కౌంట్స్, కంప్యూటర్ రంగాల వారికి కొత్త అవకాశాలు లభిస్తాయి. దంపతుల ఆలోచనలు పరస్పర విరుద్ధంగా ఉంటాయి.
 
కన్య: స్త్రీలు విలువైన వస్తువులు, గృహోపకరణాలు అమర్చుకుంటారు. నిరుద్యోగులు నిరుత్సాహం వీడి ఇంటర్వ్యూలకు హాజరు కావటం మంచిది కాదు. రాజీ మార్గంతోనే మీ సమస్యలు పరిష్కారం కాగలవు. బాకీలు, ఇంటి అద్దెల వసూలులో సౌమ్యంగా మెలగాలి. అలవాటు లేని పనులకు దూరంగా ఉండటం ఉత్తమం.
 
తుల: కొన్ని అనుకోని సంఘటనలు దిగ్భ్రాంతికి గురిచేస్తాయి. వాహనం నడుపునపుడు మెళుకువ అవసరం. నూతన పెట్టుబడులు, వ్యాపారాలు, సంస్థల స్థాపనలకు కావలసిన వనరులు, అనుమతులు సమకూర్చుకుంటారు. తలపెట్టిన పనులు అనుకున్న విధంగా పూర్తి కాగలవు. విద్యార్థుల ఆలోచనలు పక్కదారి పట్టే ఆస్కారం ఉంది.
 
వృశ్చికం: వ్యాపారాల్లో కొత్త కొత్త పథకాలతో కొనుగోలుదార్లను ఆకట్టుకుంటారు. స్త్రీలకు అయిన వారి రాక సంతోషం కలిగిస్తుంది. కోర్టు వ్యవహారాలు వాయిదా పడటం మంచిది. మీ బాధ్యతలు, పనులు ఇతరులకు అప్పగించి ఇబ్బందులెదుర్కుంటారు. మీ సంతానం విద్యా, ఆరోగ్య విషయాల పట్ల శ్రద్ధ వహించండి.
 
ధనస్సు: బంధువుల నుంచి ఒక ముఖ్య సమాచారం అందుతుంది. భాగస్వామిక చర్చలు వాయిదా పడతాయి. ఖర్చులు పెరగడం వల్ల భారమనిపిస్తుంది. సన్నిహితులకు మీరిచ్చిన సలహాలు, సూచనలు బాగా ఉపకరిస్తాయి. ఇసుక, క్వారీ కాంట్రాక్టర్లకు అభ్యంతరాలు, చికాకులు అధికం. సేవా సంస్థల్లో సభ్యత్వం స్వీకరిస్తారు.
 
మకరం: మీ శ్రీమతిలో వచ్చిన మార్పు సంతృప్తినిస్తుంది. విద్యార్థులు ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండాలి. ఉద్యోగస్తుల సమర్థతకు గుర్తింపు లేకపోగా మాటపడవలసి వస్తుంది. లీజు, ఏజెన్సీల గడువు పొడిగింపు, నూతన వ్యాపారాలకు మరి కొంత కాలం ఆగటం ఉత్తమం. హామీలు, మధ్యవర్తిత్వాల్లో లౌక్యంగా వ్యవహరించాలి.
 
కుంభం: ఆడంబరాలకు, బంధుమిత్రుల కోసం ధనం బాగా వ్యయం చేస్తారు. బ్యాంకు పనుల్లో జాప్యం, చికాకులు ఎదుర్కొంటారు. గత తప్పిదాలు పునరావృతమయ్యే సూచనలున్నాయి. గృహ నిర్మాణ ప్లాను ఆమోదానికి బాగా శ్రమించాలి. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు. మీ శ్రీమతి సలహా పాటించండి.
 
మీనం: హుందాగా వ్యవహరించి మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు. హోటల్, కేటరింగ్ రంగాల్లోవారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు. సోదరులతో ఏకీభవించలేరు. స్త్రీలకు ఆరోగ్య భంగం, వైద్యసేవలు అవసరమవుతాయి. ఉపాధ్యాయ రంగాలలో వారికి అభిప్రాయ భేధాలు తలెత్తవచ్చు జాగ్రత్త వహించండి.