గురువారం, 26 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By pnr
Last Updated : ఆదివారం, 11 మార్చి 2018 (10:22 IST)

ఆదివారం మీ రాశిఫలితాలు (11-03-18) - హితోక్తులు మంచి ప్రభావం...

మేషం : ప్రింటింగ్, స్టేషనరీ రంగంలో వారు అచ్చు తప్పులు పడుటవలన మాట పడవలసి వస్తుంది. మీ అభిరుచులకు తగిన విధంగా కుటుంబ సభ్యులు మసలుకుంటారు. సిమెంటు, కలప, ఐరన్, ఇటుక వ్యాపారులకు మందకొడిగా ఉంటుంది. ప్రముఖ

మేషం :  ప్రింటింగ్, స్టేషనరీ రంగంలో వారు అచ్చు తప్పులు పడుటవలన మాట పడవలసి వస్తుంది. మీ అభిరుచులకు తగిన విధంగా కుటుంబ సభ్యులు మసలుకుంటారు. సిమెంటు, కలప, ఐరన్, ఇటుక వ్యాపారులకు మందకొడిగా ఉంటుంది. ప్రముఖుల ఇంటర్వ్యూకోసం అధిక సమయం వేచి ఉండాల్సి వస్తుంది.
 
వృషభం : సన్నిహితుల సలహాలు, హితోక్తులు మీ పై మంచి ప్రభావం చూపుతాయి. వైద్యులు అరుదైన శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తిచేస్తారు. ఆడిటర్లు, అక్కౌంట్స్ రంగాల వారికి సదవకాశాలు లభిస్తాయి. రాజకీయ నాయకులు వాగ్ధానాలు చేసి సమస్యలు తెచ్చుకోకండి. ఉద్యోగస్తులకు పై అధికారులతో చికాకులుతప్పవు.
 
మిథునం : విద్యార్థుల మొండి వైఖరి ఉపాధ్యాయులకు చికాకు కలిగిస్తుంది. ఒక పుణ్యక్షేత్రం సందర్శించాలనే మీ కోరిక నెరవేరుతుంది. కోర్టువ్యవహరాల్లో ప్లీడర్లు, ప్లీడరు గుమస్తాలకు ప్రయాసలు అధికం. ఇంట, బయట మంచి గుర్తింపు లభిస్తుంది. పట్టుదలతో శ్రమించే మీకు సన్నిహితుల సాయం తోడవుతుంది.
 
కర్కాటకం :  ఆర్థిక సమస్యలు తలెత్తిన నెమ్మదిగా సమసిపోతాయి. శత్రువులు మిత్రులుగా మారతారు. మీ సంతానం భవిష్యత్తు కోసం ప్రణాళికలు రూపొందిస్తారు. బ్యాంకు వ్యవహారాలలో అపరిచిత వ్యక్తుల పట్ల మెళుకువ అవసరం. పత్రికా సంస్థలలోని వారికి ఊహించని సమస్యలు ఎదురవుతాయి. ఖర్చులు అధికమవుతాయి.
 
సింహం : కొబ్బరి, పండు, పూల వ్యాపారులకు లాభదాయకం. కొన్ని సమస్యలు చిన్నావే అయిన మనశ్శాంతి దూరం చేస్తారు. మీ సంతానం భవిష్యత్తు కోసం ప్రణాళికలు రూపొందిస్తారు. నిరుద్యోగులు భేషజాలకు పోకుండా వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవటం మంచిది. ఉపాధ్యాయులకు ఒత్తిడి అధికమవుతుంది.
 
కన్య : కొంతమంది మీతో స్నేహం నటిస్తూనే మిమ్ములను తప్పుదారి పట్టించేందుకు యత్నిస్తారు. రావలసిన ధనం అందుతుంది. ఊహాగానాలతో కాలం వ్యర్థం చేయకండి. పెద్దల ఆరోగ్యములో మెళుకువ అవసరం. బంధువుల రాకతోగృహంలో సందడి నెలకొంటుంది. ప్రముఖులతో పరిచయాలు మీ ఉన్నతికి నాందీ పలుకుతాయి.
 
తుల : ఇంటా బయటా స్త్రీల ఆధిపత్యం కొనసాగుతుంది. ప్రయాణాలు, బ్యాంకు పనుల్లో ఏకాగ్రత, మెళుకువ అవసరం. వృత్తిపరంగా ఎదురైన సమస్యల నుంచి బయట పడతారు. ప్రింటింగ్ రంగాల వారికి బకాయిలు వాయిదాపడతాయి. బంధుమిత్రులను నుంచి అపనిందలు, అవమానాలు వంటివి ఎదుర్కొంటారు.
 
వృశ్చికం : వ్యాపారా, వాణిజ్య ఒప్పందాల్లో నిర్మొహమాటంగా వ్యవహరించండి. స్త్రీల ఏమరుపాటుతనం వల్ల విలువైన వస్తువులు చేజార్చుకునే అవకాశం ఉంది. పత్రికా సంస్థలలోని వారు ఒక ప్రకటన పట్ల ఆకర్షితులవుతారు. హోటల్, తినుబండారాలు, క్యాటరింగ్ పనివారలకు పనిభారం అధికమవుతుంది.
 
ధనస్సు : కుటుంబంలో మానసిక విజ్ఞతయుతంగా ఒక సమస్యను పరిష్కరిస్తారు. నిరుద్యోగులకు రాత, మౌఖిక పరీక్షలకు సంబంధించిన సమాచారం అందుతుంది. ఓర్పు, పట్టుదలతో శ్రమించి అనుకున్నది సాధిస్తారు. దంపతుల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. పెద్దల సలహాను పాటించి మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు.
 
మకరం : మీ శ్రీమతిని నొప్పించకుండా జాగ్రత్తగా వ్యవహరించవలసి ఉంటుంది. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. ఫ్యాన్సీ, కిరణా, మందుల వ్యాపారస్తులకు లాభదాయకం. మితిమీరిన ఆలోచనలు మీ మనస్సును వ్యాకుల పరుస్తాయి. ధనం ఎంత వస్తున్నా నిల్వచేయలేకపోతారు.
 
కుంభం : ఆర్థిక వ్యవహారాలు, నూతన పెట్టుబడులకు సంబంధించి స్పష్టమైన నిర్ణయానికి వస్తారు. స్త్రీలకు ఆర్జన పట్ల ఆసక్తి నెలకొంటుంది. వృత్తిరీత్యా ఆకస్మికంగా ప్రయాణం చేయవలసివస్తుంది. పిల్లలకోసం, ప్రియతముల కోసం అధికంగా ఖర్చు చేస్తారు. ట్రాన్స్‌పోర్ట్, ఆటోమోబైల్, మెకానికల్ రంగాల్లో వారికి మిశ్రమ ఫలితం.
 
మీనం : వస్త్ర, బంగారు, వెండి, లోహ వ్యాపారస్తులకు పనివారితో సమస్యలు తలెత్తుతాయి. స్త్రీలు అనాలోచితంగా మాటజారి ఇబ్బందులెదుర్కొంటారు. పొదుపు పథకాల్లో ఆశించిన ప్రతిఫలం అందడం కష్టం. ఉపాధ్యాయులకు, మార్కెటింగ్ రంగాల వారికి ఆశించిన అవకాశాలు లభిస్తాయి. విద్యార్థులకు ఏకాగ్రత అవసరం.