శనివారం, 25 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By raman
Last Updated : శుక్రవారం, 16 మార్చి 2018 (08:59 IST)

16-03-2018 శుక్రవారం.. అవివాహితులకు శుభవార్తాశ్రవణం...

మేషం: ఉద్యోగస్తులు కొత్త బాధ్యతలు చేపట్టే ఆస్కారం వుంది. అకాలభోజనం, శారీరక శ్రమ వల్ల ఆరోగ్యం మందగిస్తుంది. మీ సంతానం కోసం కొత్త కొత్త ప్రణాళికలు రూపొందిస్తారు. నమ్మకస్తులే తప్పుదారి పట్టించే ఆస్కారం వ

మేషం: ఉద్యోగస్తులు కొత్త బాధ్యతలు చేపట్టే ఆస్కారం వుంది. అకాలభోజనం, శారీరక శ్రమ వల్ల ఆరోగ్యం మందగిస్తుంది. మీ సంతానం కోసం కొత్త కొత్త ప్రణాళికలు రూపొందిస్తారు. నమ్మకస్తులే తప్పుదారి పట్టించే ఆస్కారం వుంది. ఆత్మీయులకు విలువైన కానుకలందిస్తారు. వాహనం ఇతరులకివ్వడం క్షేమం కాదు. 
 
వృషభం : మీ మంచితనమే మీకు శ్రీరామ రక్షగా ఉంటుంది. ఉద్యోగస్తులు అధికారులతో సంభాషించినప్పుడు జాగ్రత్త వహించండి. రుణాల కోసం అన్వేషిస్తారు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలలో ఏకాగ్రత ముఖ్యం. ఉపాధ్యాయులకు యాజమాన్యం ఒత్తిడి అధికమవుతుంది. బ్యాంకు డిపాజిట్లు దీర్ఘకాలిక పెట్టుబడులు అనుకూలం. 
 
మిథునం : ఆదాయ మార్గాలు అన్వేషిస్తారు. వ్యవహారాల్లో ప్రతికూలతలెదురవుతాయి. అప్రమత్తంగా వుండాలి. ఎవరినీ అతిగా విశ్వసించవద్దు. పనులు హడావుడిగా సాగుతాయి. క్రీడాకారులకు ప్రోత్సాహకరం. ఆత్మీయుల కలయికతో కుదుటపడతారు. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. 
 
కర్కాటకం: దంపతుల మధ్య అవగాహన లోపం. పొదుపు పథకాలు, పెట్టుబడులపై దృష్టి సారిస్తారు. ప్రైవేట్ సంస్థల్లో మదుపు క్షేమం కాదు. ఆహ్వానం, పత్రాలు అందుకుంటారు. ప్రయాణంలో ఒకింత అవస్థలు తప్పవు. సౌమ్యంగా సమస్యలు పరిష్కరించుకోవాలి.
 
సింహం: నిర్దిష్ట ప్రణాళికలు రూపొందించుకుంటారు. అంచనాలు ఫలిస్తాయి. ఖర్చులు భారమనిపించవు. వేడుకలను ఘనంగా చేస్తారు. మీ అతిథి మర్యాదలు ఆకట్టుకుంటాయి. శ్రమాధిక్యతతో పనులు పూర్తి చేస్తారు. అనవసర జోక్యం తగదు. మీ గౌరవానికి భంగం కలుగకుండా వ్యవహరించండి. బంధువులను కలుసుకుంటారు.
 
కన్య: తీర్థయాత్రలకు సన్నాహాలు సాగిస్తారు. ప్రయాణాలు చేయవలసివస్తుంది. ఖర్చులు విపరీతం. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. శుభకార్యాల్లో పాల్గొంటారు. సంతానం అత్యుత్సాహం ఇబ్బంది కలిగిస్తుంది. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. సకాలంలో పనులు పూర్తి కాగలవు. ఏకపక్షంగా వ్యవహరించవద్దు.
 
తుల: ఆర్థిక అంచనాలు ఫలించవు. దుబారా ఖర్చులు విపరీతం. అయిన వారికోసం బాగా వ్యయం చేస్తారు. కొన్ని పనులు ఆకస్మికంగా పూర్తవుతాయి. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సమాచారం నిరుత్సాహపరుస్తుంది. యత్నాలు విరమించుకోవద్దు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. బాధ్యతలు ఇతరులకు అప్పగించవద్దు.
 
వృశ్చికం: కష్టపడినా ఫలితం అంతంత మాత్రమే. ప్రతిభకు ఏమంత గుర్తింపు వుండదు. నిరుత్సాహం వీడి యత్నాలు సాగించండి. మీ కృషి త్వరలో ఫలిస్తుంది. దుబారా ఖర్చులు అధికం. చేతిలో ధనం నిలబడదు. ఆదాయ మార్గాలు అన్వేషిస్తారు. ఆత్మీయుల సాయం అందుతుంది. పనుల సానుకూలతకు మరింతగా శ్రమించాలి.
 
ధనస్సు: అంచనాలు ఫలించవు. పెద్ద ఖర్చు తగిలే ఆస్కారం వుంది. రుణాలు, చేబదుళ్లు స్వీకరిస్తారు. ఆంతరంగిక విషయాలు ఇతరులకు వెల్లడించవద్దు. ఆది, గురువారాల్లో ప్రముఖుల సందర్శన సాధ్యం కాదు. పనులు హడావుడిగా సాగుతాయి. మీ అశక్తతను కుటుంబీకులు అర్థం చేసుకుంటారు. అవివాహితులకు శుభవార్తాశ్రవణం.
 
మకరం: బాధ్యతలు వ్యవహారాలు ఇతరులకు అప్పగించవద్దు. ఖర్చులు విపరీతం. సంతానం అత్యుత్సాహాన్ని అదుపు చేయండి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. దైవకార్యం పట్ల దృష్టి సారిస్తారు. ప్రయాణ లక్ష్యం నెరవేరుతుంది. పత్రాలు, నగదు జాగ్రత్త. వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండాలి. అవకాశాలను అందిపుచ్చుకుంటారు.
 
కుంభం: పిల్లల విజయం సంతోషాన్నిస్తుంది. ముఖ్యులలో ఒకరికి వీడ్కోలు పలుకుతారు. కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. ఆధ్యాత్మికత పట్ల ఆసక్తి కలుగుతుంది. సన్మాన, సాహిత్య సభల్లో పాల్గొంటారు. కొన్ని విషయాలు అనుకున్నట్లే జరుగుతాయి. ఆత్మీయులను కలుసుకుంటారు. ధనమూలక సమస్యలు కొలిక్కి వస్తాయి.
 
మీనం: పదవులు, సభ్యత్వాలు స్వీకరిస్తారు. గౌరవ ప్రతిష్టలు పెంపొందుతాయి. వ్యతిరేకులు సన్నిహితులవుతారు. ధనానికి ఇబ్బంది వుండదు. పనులు సకాలంలో పూర్తి కాగలవు. వ్యవహారాల ఒప్పందాలకు అనుకూలం. అనాలోచిత నిర్ణయాలు తగవు. పెద్దల సలహా పాటించండి. దంపతుల మధ్య దాపరికం తగదు.