శనివారం, 25 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By raman
Last Updated : ఆదివారం, 18 మార్చి 2018 (08:50 IST)

ఆదివారం (18-03-18) దినఫలాలు.. సూర్యు దేవుని ఆరాధించినా...

మేషం : ప్రముఖులకు శుభాకాంక్షలు తెలియజేస్తారు. వృత్తి వ్యాపారులకు అన్ని విధాలా అనుకూలం. కీలకమైన సమస్యలు పరిష్కారం కావడంతో మీలో కొత్త ఉత్సాహం కనిపిస్తుంది. కుటుంబీకుల కోరికలు తీరుస్తారు. చేపట్టిన పనులు

మేషం : ప్రముఖులకు శుభాకాంక్షలు తెలియజేస్తారు. వృత్తి వ్యాపారులకు అన్ని విధాలా అనుకూలం. కీలకమైన సమస్యలు పరిష్కారం కావడంతో మీలో కొత్త ఉత్సాహం కనిపిస్తుంది. కుటుంబీకుల కోరికలు తీరుస్తారు. చేపట్టిన పనులు ఆశించినత చురుకుగా సాగవు. భాగస్వామిక చర్చల్లో మీ అభిప్రాయాలకు ఆమోదం లభిస్తుంది. 
 
వృషభం : ఆర్థిక విషయాల్లో ఒక అడుగు ముందుకు వేస్తారు. మీ జీవితంలోకి ఒక కొత్త వ్యక్తి ప్రవేశించి, మిమ్మలను ఒక మార్గంలో నడిపించాలని ఆశిస్తారు. మత్స్యు కోళ్ళ  వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. ఉద్యోగస్తులు విశ్రాంతికై చేయుయత్నాలు ఫలిస్తాయి. స్త్రీలు విలువైన వస్తువులు అమర్చుకుంటారు. 
 
మిథునం : కొత్త వ్యక్తులతో పరిచయాలు మీ ఉన్నతికి నాంది పలుకుతాయి. దూర ప్రాణాలలో అపరిచిత వ్యక్తులతో అధికంగా సంభాషించడం మంచిదికాదు. ఉపాధ్యాయులు విశ్రాంతికై చేయు ప్రయత్నాలు ఫలిస్తాయి. రుణం తీర్చి తాకట్టు వస్తువులు విడిపించుకుంటారు. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు. 
 
కర్కాటకం : పత్రికా సిబ్బందికి మార్పులు అనుకూలిస్తాయి. ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తిగా సాగుతాయి. మెళకువ వహించండి. దైవ, సేవా పుణ్యకార్యాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. స్త్రీలు విశ్రాంతికై చేయుయత్నాలు ఫలించవు. బంధువుల ఆకస్మిక రాకతో గృహంలో ఖర్చులు అధికమవుతాయి. ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. 
 
సింహం : భాగస్వామ్యుల మధ్య నూతన ఆలోచనలు స్ఫురిస్తాయి. స్త్రీల మనోభావాలను, తెలివితేటలకు మంచి గుర్తింపు లభిస్తుంది. దైవారాధన పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఉల్లి, బెల్లం, పసువు, కంది, మిర్చి వ్యాపారస్తులకు స్టాకిస్టులకు కలిసివస్తుంది. ఏ వ్యక్తికీ అతి చనువు మంచిది కాదు. గత విషయాలు జ్ఞప్తికి రాగలవు. 
 
కన్య : ఉద్యోగస్తులు తోటివారితో విందు, వినోదాలలో పాల్గొంటారు. కొబ్బరి, పండ్లు, పూల వ్యాపారులకు లాభదాయకం. వాహనం నడుపునపుడు మెళకువ అవసరం. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలలో జయం పొందుతారు. సంఘంలో మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. స్త్రీలకు పరిచయాలు, వ్యాపకాలు అధికమవుతాయి. 
 
తుల : స్త్రీలు, టీవీ, చానెల్స్ కార్యక్రమాల్లో రాణిస్తారు. ఉమ్మడి, సొంత వ్యాపారాలు సంతృప్తికరంగా సాగుతాయి. సోదరీ, సోదరుల మధ్య సంబంధ బాంధవ్యాలు బాగుగా ఉంటాయి. నూతన పెట్టుబడులు పెట్టునపుడు మెళకువ అవసరం పెద్దల ఆరోగ్యంలో తగు జాగ్రత్తలు అవసరం. క్రీడల పట్ల ఆసక్తి పెరుగుతుంది. 
 
వృశ్చికం : సోదరీ, సోదరులను కలుసుకుంటారు. కొత్తగా చేపట్టిన వ్యాపారాల్లో నిలదొక్కుకోవడానికి బాగా శ్రమించవలసి ఉంటుంది. స్త్రీలకు కాళ్లు, నరాలకు సంబంధించిన చికాకులు ఎదుర్కొంటారు. విదేశీ వస్తువులు సేకరిస్తారు. తొందరపాటుతనం వల్ల కుటుంబీకులు, అవతలివారితో మాటపడవలసి వస్తుంది. 
 
ధనస్సు : పత్రికా సిబ్బందికి వార్తల ప్రచురణలో పునరాలోచన మంచిది. మీ అభిరుచికి తగిన వ్యక్తితో పరిచయాలేర్పడతాయి. కుటుంబీకుల మధ్య అనురాగవాత్సల్యాలు పెంపొందుతాయి. ప్రేమికుల ఆలోచనలు పెడదోవ పట్టే ఆస్కారం ఉంది. రాజకీయ కళారంగాల వారికి విదేశీ పర్యటనలు అనుకూలిస్తాయి. 
 
మకరం : కిరాణా, ఫ్యాన్సీ రంగాల్లో వారికి కలిసిరాగలదు. మొండిబాకీలు సైతం వసూలు కాగలవు. తలపెట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురైనా నెమ్మదిగా సమసిపోగలవు. మీ సంతానం వివాహ విషయాల పట్ల శ్రద్ధ వహిస్తారు. బంధు మిత్రులతో కలిసి ఆలయాలను సందర్శిస్తారు. సభలు, బృంద కార్యక్రమాల్లో పాల్గొంటారు. 
 
కుంభం : స్త్రీలు దైవ సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొటారు. కిరాణా ఫ్యాన్సీ రంగాల్లో వారికి కలిసిరాగలదు. కుటుంబీకులతో కలిసి విందు వినోదాల్లో పాల్గొంటారు. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానికల్, కంప్యూటర్, ఇంటర్నెట్ రంగాల వారికి పురోభివృద్ధి. బంధువుల రాకతో కొంత అసౌకర్యానికి లోనవుతారు. 
 
మీనం : భాగస్వామిక సమావేశాల్లో మీ అభిప్రాయాలకు మంచి స్పందన లభిస్తుంది. ఏ పని తలపెట్టినా తిరిగి మొదటికి వస్తుంది. అనుకున్న వ్యక్తుల కలయిక అనుకూలించకపోవడంతో ఒకింత నిరుత్సాహం చెందుతారు. కార్యసాధనలో బాగా శ్రమించాల్సి ఉంటుంది. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు.