సంబంధిత వార్తలు
- అమావాస్య రోజున శని జయంతి- ఏకకాలంలో అదృష్ట యోగాలు.. ఈ రాశుల వారికి?
- Sri Narasimha Jayanti: నృసింహ జయంతి: పానకం, వడపప్పు... ఈ మంత్రాలతో పూజిస్తే..?
- Parashurama Jayanti 2026: ప్రదోష కాలంలో జన్మించిన పరశురాముడు.. పూజ ఇలా చేస్తే?
- రాజయోగ సంకష్ట హర చతుర్థి.. కొబ్బరి మాలను సమర్పిస్తే.. శని, రాహు-కేతు దోషాలు..?
- Lambodara Sankashti Chaturthi: లంబోదర సంకష్టహర చతుర్థి 2026.. లంబోదరుడిని ప్రార్థిస్తే?
Chaturthi vrat: బుధవారం రోజున చతుర్థి వ్రతం పాటిస్తే..?
బుధవారం రోజున చతుర్థి వ్రతం రావడం విశేషం. బుధవారం పూట సామాన్యంగా గణపతిని పూజించడం ద్వారా ఆయన ఆశీస్సులతో నవగ్రహ దోషాలు తొలగిపోతాయి. గణపతికి ఈ రోజున భక్తులు పువ్వులు, మోదకాలు, పండ్లు, కొబ్బరికాయ సమర్పిస్తారు. గణేశుడికి ఇష్టమైన మంత్రాలతో జపిస్తారు.
గణపతికి అత్యంత ప్రీతిపాత్రమైన తిధులలో ప్రధానమైనది చవితి తిథి. అయితే ఈ చవితి లేదా చతుర్థి పూజను రెండు రకములుగా ఆచరిస్తారు. మొదటిది వరదచతుర్థి, రెండవది సంకష్టహర చతుర్థి. అమావాస్య తరువాత వచ్చే చతుర్థిరోజున చేసే వ్రతంను వరదచతుర్థి అని, పౌర్ణమి తరువాత వచ్చే చతుర్థిరోజున చేసే వ్రతంను సంకష్టహర చతుర్థి అంటారు.
ఈ రెండు చతుర్థి తిథుల్లో సంకటనాశన గణేశ స్తోత్రం, సంకట హర చతుర్థి వ్రత కథను చదవాలి. ప్రారంభించిన పనుల్లో పదే పదే ఆటంకాలు ఎదురైనప్పుడు సంకష్ట హర చతుర్థి వ్రతం లేదా వరద చతుర్థి వ్రతం ఆచరిస్తే మంచి ఫలితం దక్కుతుంది. వ్యాపారం, ఉద్యోగంలో అభివృద్ధి లేనప్పుడు ఈ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరిస్తే తప్పనిసరిగా శుభఫలితం పొందుతారు.
నరదృష్టితో బాధపడేవారు దాన్నుంచి బయటపడేందుకు సంకష్ట హర చతుర్థి వ్రతం చేస్తే మిమ్మల్ని కాపాడుతుంది. ఆర్థిక సంబంధిత సమస్యలున్నా, సంతానం లేకపోయినా, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నా ఈ వ్రతాలను ఆచరించడం మంచిది.
