1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. మనస్తత్వ శాస్త్రం
  4. Unhappy Marriage: Bad for Your Health

భార్యాభర్తలు గొడవపడ్డారో ఇక గుండెకు చేటే!

Unhappy Marriage: Bad for Your Health
భార్యాభర్తలు గొడవపడ్డారో ఇక గుండెకు చేటేనని తాజా అధ్యయనంలో తేలింది. భార్యాభర్తల మధ్య గొడవలకీ, గుండె జబ్బులకీ దగ్గరి సంబంధం ఉందని తాజా పరిశోధనలో వెల్లడైంది. వివాహ బంధంలోని దగ్గరితనం లేదా దూరం స్త్రీ, పురుషులిద్దరి ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది.
 
తాజా అధ్యయనంలో తేలిందేమిటంటే.. నిత్యం ఆనందంగా ఉండే జంటల కంటే, ఒకరిపై ఒకరికి ప్రతికూల భావాలున్న వారిలో గుండె జబ్బులూ, పక్షవాతం ప్రమాదం 8.5 శఆతం ఎక్కువని తేలింది. వీరిలో గుండెకు రక్తం సరఫరా చేసే రక్తనాళాలూ, గుండె నుంచి తల, మెడ భాగాలకు రక్తం అందించే నాళాలు దళసరిగా మారడానికి పరిశోధకులు గమనించారు. దాంతో వీరిలో హృద్రోగం, పక్షవాతాలు వంటివి ఎక్కువగా కనిపిస్తున్నాయని తేల్చారు. 
 
ఇకపై వ్యక్తి గుండె జబ్బులకు సంబంధించిన కారణాలు వెతికే వైద్యులు దంపతులిద్దరి మధ్య అనుబంధాన్నీ పరిగణనలోకి తీసుకోవాలని అధ్యయనకర్తలు చెబుతున్నారు.
About Writer
Selvi