1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
  4. Bathukamma Festival to Be Celebrated from Oct 10 to 18

అక్టోబర్ 10 నుండి 18 వరకు వైభవంగా బతుకమ్మ పండుగ

Bathukamma
తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను అక్టోబర్ 10 నుండి 18 వరకు అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు శనివారం తెలిపారు. 
 
పండుగ ఏర్పాట్లపై ఆయన శనివారం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి వివిధ శాఖల కార్యదర్శులు మరియు పోలీసు అధికారులు హాజరయ్యారు. 
 
ఈ సందర్భంగా జాజు మాట్లాడుతూ, అక్టోబర్ 18న ట్యాంక్ బండ్ వద్ద జరిగే సద్దుల బతుకమ్మ వేడుకల్లో పెద్ద సంఖ్యలో మహిళలు అత్యంత వైభవంగా పాల్గొంటారని పేర్కొన్నారు.
About Writer
సెల్వి
Journalist since 2005. Former contributor at Eenadu & Andhra Jyothi Tamil Nadu Editions. Now in Sub Editor, Webdunia.... మరింత చదవండి
తర్వాతి కథనం
04-10-2026 నుండి 10-10-2026 వరకు వారఫలాలు - శుభలేఖ అందుకుంటారు