పుష్కరాలకు ముందు శాకంబరిగా బెజవాడ కనకదుర్గమ్మ....
విజయవాడ ఇంద్రకీలాద్రి: ఇంద్రకీలాద్రిలో వెలసి ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి అమ్మ వారికి జులై 17 నుంచి 19 వరకు శాకంబరి ఉత్సవాలు జరగనున్నాయి. 17వ తేదీ ఉదయం 7.30 గంటలకు విఘ్నేశ్వర పూజతో ఈ ఉత్సవాలను ప్రారంభంకానున్నాయి.

ఉదయం పూజ పూర్తి అయ్యాక పుణ్యాహవచనం, కలశస్థాపన, అగ్నిప్రతిష్టాపన జరుగుతుంది. 18న ఉదయం 8.30 నుంచి 6 గంటల వరకు మూలమంత్ర హవనాలు, చండీహోమం, మండప పూజలు, హారతి కార్యక్రమాలు జరుగుతాయి. 19న ఉదయం 8 నుంచి 10 గంటల వరకు కూష్మాండ హోమాలు, శాంతి పౌష్టిక హోమాలు, మహాపూర్ణాహుతి, కలశోద్వాసన, ఆశీర్వచన కార్యక్రమాలు జరగడంతో శాకంబరి ఉత్సవాలు ముగుస్తాయి.