తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య ప్రసాదమైన లడ్డూ ధర పెంపుపై తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) వెనక్కి తగ్గింది. శ్రీవారి ప్రసాదమైన లడ్డూ ధరను పెంచబోవడం లేదని తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. ఆయన ఆస్ట్రేలియా పర్యటనను ముగించుకుని చెన్నైకు శనివారం తిరిగివచ్చారు. ఆయన్ను చెన్నైలోని ప్రముఖ సామాజిక సేవా సంస్థ ఉంగలుక్కాక చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకుడు డాక్టర్ సునీల్ సాదరస్వాగతం పలికారు. ...