గురువారం, 26 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 15 నవంబరు 2019 (09:58 IST)

శ్రీవారి లడ్డూలో వెంట్రుకలు... గతంలో ఇనుప మేకులు కూడా...

పవిత్ర ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న తిరుమల తిరుపతి దేవస్థానం సిబ్బంది నిర్లక్ష్యం మరోమారు బయటపడింది. పరమ పవిత్రంగా భావించే శ్రీవారి లడ్డూలో వెంట్రుకలు, మేకులు వచ్చాయి. వీటిని చూసిన భక్తులు నివ్వెరపోయారు. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, హైదరాబాద్ మల్కాజిగిరి ప్రాంతానికి చెందిన భక్తులు ఇటీవల తిరుమలకు శ్రీవారి దర్శనార్థం వెళ్ళారు. శ్రీవారి దర్శనార్థం తాము బసచేసిన గదికి వెళ్లి లడ్డూ ప్రసాదాన్ని ఆరగించేందుకు తెరిచారు. 
 
అపుడు ఆ లడ్డూలో వెంట్రుకలు, దారాలను చూసి వారు అవాక్కయ్యారు. ఈ విషయం నలుగురికీ పొక్కడంతో, భక్తులంతా తిరుమల ఆలయ సిబ్బంది నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో కూడా లడ్డూలో మేకులు, వంటి వస్తువులు కూడా వచ్చిన విషయం తెల్సిందే. అయినప్పటికీ శ్రీవారి సిబ్బందిలో నిర్లక్ష్యం మాత్రం పోవడం లేదు.