1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
  4. TTD to restrict Tirupati temple darshan for six days in August

సిఫార్సులు బంద్.. అందరికీ సర్వదర్శనమే... తితిదే బోర్డు

తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే)లో మహాసంప్రోక్షణ జరిగే ఆగస్టు 11 నుంచి 16వ తేదీ వరకు పరిమితంగా భక్తులను దర్శనానికి అనుమతివ్వాలని తితిదే పాలక మండలి నిర్ణయం తీసుకుంది. అదేసయంలో అన్ని రకాల సేవలతో పాటు..

TTD
తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే)లో మహాసంప్రోక్షణ జరిగే ఆగస్టు 11 నుంచి 16వ తేదీ వరకు పరిమితంగా భక్తులను దర్శనానికి అనుమతివ్వాలని తితిదే పాలక మండలి నిర్ణయం తీసుకుంది. అదేసయంలో అన్ని రకాల సేవలతో పాటు.. సిఫార్సులనూ రద్దు చేసింది. పైపెచ్చు.. ఆ రోజుల్లో తిరుమలకు వచ్చే ప్రతి ఒక్కరికీ సర్వదర్శనమే కల్పిస్తామని తేల్చి చెప్పింది.
 
తిరుమల అన్నమయ్య భవనంలో మంగళవారం జరిగిన టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశమైంది. ఇందులో తీసుకున్న నిర్ణయాలను తితిదే ఛైర్మన్ సుధాకర్, ఆలయ ఈవో అనిల్ సింఘాల్‌లు మీడియాకు వెల్లడించారు.


ఎక్కువ మందికి దర్శనం కల్పించలేని పరిస్థితుల్లో ఎలా చేస్తే బాగుంటుందనేది భక్తుల నుంచి అభిప్రాయాలను సేకరించామన్నారు. ఇందులో ఎక్కువశాతం మంది సర్వదర్శనం ద్వారా క్యూలైన్‌లో అనుమతించాలని సూచించారని చెప్పారు. 
 
ఇకపోతే, మహాసంప్రోక్షణ ఘట్టంలో భాగంగా, ఆగస్టు 11వ తేదీన అంకురార్పణం రోజున 9 గంటలు, 12, 13 తేదీల్లో 4 గంటలు, 14న 6గంటలు, 15న 5 గంటలు, 16న 4 గంటలు మాత్రమే దర్శనాలకు అవకాశం ఉంటుందన్నారు. యాగశాల ఏర్పాటువల్ల విమాన ప్రాకారంలో సగభాగం ఆక్రమిస్తుందని, దాంతో దర్శనం చేసుకున్న భక్తులు కొద్దికొద్ది మంది మాత్రమే ముందుకు వెళ్లాల్సి ఉంటుందన్నారు. ఈ సమయాలను అనుసరించి రోజులో ఎంతమందిని అనుమతించాలన్న సంఖ్యను త్వరలో ప్రకటిస్తామన్నారు. ఆ సంఖ్య చేరుకొన్న తర్వాత క్యూలైన్‌ను మూసివేస్తామన్నారు. 
About Writer
pnr
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి
తర్వాతి కథనం
బుధవారం (25-07-18) దినఫలాలు - బంధువుల రాకతో ఊహించని...