మంగళవారం, 26 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By TJ
Last Modified: సోమవారం, 16 జులై 2018 (17:03 IST)

తిరుమల గుడి మూసేసి ఏం చేయబోతున్నారు? వైసిపి ఎమ్మెల్యే రోజా ప్రశ్న(Video)

టిటిడి ఛైర్మన్ పుట్టాసుధాకర్ యాదవ్‌కు కనీస ఆలోచన లేదని తీవ్రస్థాయిలో మండిపడ్డారు వైసిపి ఎమ్మెల్యే రోజా. ఆగష్టు 9వ తేదీ నుంచి 17వ తేదీ వరకు శ్రీవారి ఆలయంలో భక్తులను దర్శనానికి అనుమతించకూడదంటూ టిటిడి పాలకమండలి నిర్ణయం తీసుకోవడంపై తీవ్రస్థాయిలో మండిపడ్డ

టిటిడి ఛైర్మన్ పుట్టాసుధాకర్ యాదవ్‌కు కనీస ఆలోచన లేదని తీవ్రస్థాయిలో మండిపడ్డారు వైసిపి ఎమ్మెల్యే రోజా. ఆగష్టు 9వ తేదీ నుంచి 17వ తేదీ వరకు శ్రీవారి ఆలయంలో భక్తులను దర్శనానికి అనుమతించకూడదంటూ టిటిడి పాలకమండలి నిర్ణయం తీసుకోవడంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు రోజా. గతంలో ఎప్పుడూ లేని విధంగా 9 రోజుల పాటు శ్రీవారి ఆలయంలోకి భక్తులను అనుమతించకూడదంటూ నిర్ణయం తీసుకోవడం ఏమిటని ప్రశ్నించారు. 
 
టిటిడి ఛైర్మన్‌గా పుట్టా సుధాకర్ యాదవ్ బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి వివాదాస్పదమైన నిర్ణయాలు తీసుకుంటున్నారని, ఇలాంటి నిర్ణయాలు మానుకుంటే మంచిదని సలహా ఇచ్చారు. శ్రీవారి ఆలయంలో జరుగుతున్న వ్యవహారాలపై రమణదీక్షితులు చేసిన ఆరోపణలు నిజమనే విధంగా టిటిడి పాలకమండలి వ్యవహరిస్తోందంటూ మండిపడ్డారు రోజా. అసలు గుడి మూసేసి ఏం చేయబోతున్నారు... రమణ దీక్షితులు చెప్పినట్లు ఏమయినా దొంగ పనులు చేయాలని చూస్తున్నారా? సీసీ కెమేరాలు పనిచేయవని ఎందుకు అంటున్నారు.. ఇవన్నీ అనుమానాలను రేకెత్తిస్తున్నాయని వ్యాఖ్యానించారు. వీడియో చూడండి..