శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ivr
Last Modified: సోమవారం, 18 జూన్ 2018 (17:43 IST)

జనసేనలోకి నేను వెళుతున్నానని వాళ్లే చెపుతున్నారు... రోజా

ఎమ్మెల్యే రోజా తను జనసేన పార్టీలో చేరుతున్నట్లు కొందరు తెదేపా నాయకులు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. జనసేన పార్టీలోకి వెళ్లాల్సిన అవసరం తనకు లేదని ఆమె స్పష్టం చేశారు. కొంతమంది తెదేపా నాయకులు చీప్ పబ్లిసిటీ కోసం ఇలాంటి గాలి వార్తలను ప్రచారం చేస్తు

ఎమ్మెల్యే రోజా తను జనసేన పార్టీలో చేరుతున్నట్లు కొందరు తెదేపా నాయకులు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. జనసేన పార్టీలోకి వెళ్లాల్సిన అవసరం తనకు లేదని ఆమె స్పష్టం చేశారు. కొంతమంది తెదేపా నాయకులు చీప్ పబ్లిసిటీ కోసం ఇలాంటి గాలి వార్తలను ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన సందర్భంగా ప్రధానితో సమావేశమైనప్పుడు ఆయన వైఖరిని విమర్శించారు.
 
ప్రధాని మోదీతో ముఖ్యమంత్రి చాలా చనువుగా మెలిగారని ఆమె విమర్శించారు. ఒకవైపు కేంద్రాన్ని నిలదీస్తానంటూ వెళ్లిన చంద్రబాబు నాయుడు అక్కడికి పోయి వెకిలిగా నవ్వుతూ ప్రధాని మోదీకి షేక్ హ్యాండ్ ఇచ్చారని విమర్శించారు. 2019 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడికి ఏపీ ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని అన్నారు.