శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Srinivas
Last Modified: బుధవారం, 9 మే 2018 (13:40 IST)

ఇంత దరిద్రమైన ఇంగ్లీషు చంద్రబాబు తప్ప ఎవ్వరూ మాట్లాడరు: రోజా( Video)

ఓటుకి నోటు కేసుకు సంబంధించి విచారణ మొదలైతే అదంతా జగన్ మోహన్ రెడ్డి కుట్ర అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించడం దారుణమని వైసీపి ఎమ్మెల్యే రోజా అన్నారు. ఆడియో టేపుల్లో వున్న గొంతు చంద్రబాబు నాయుడుదేనని నిర్థారణ అవ్వడంతో బాబుకు ఏం చేయాలో పాలుప

ఓటుకి నోటు కేసుకు సంబంధించి విచారణ మొదలైతే అదంతా జగన్ మోహన్ రెడ్డి కుట్ర అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించడం దారుణమని వైసీపి ఎమ్మెల్యే రోజా అన్నారు. ఆడియో టేపుల్లో వున్న గొంతు చంద్రబాబు నాయుడుదేనని నిర్థారణ అవ్వడంతో బాబుకు ఏం చేయాలో పాలుపోవడంలేదనీ, ఇంత దరిద్రమైన ఇంగ్లీషు చంద్రబాబు తప్ప ఎవ్వరూ మాట్లాడరని గతంలో కేటీఆర్ కూడా అన్నారని రోజా గుర్తు చేశారు.
 
ఓటుకి నోటు కేసు నుంచి తప్పించుకునేందుకు గతంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కృష్ణానది కరకట్ట మీద పలు రకాల రుచికరమైన వంటకాలతో విందు భోజనం ఏర్పాటు చేశారని రోజా ఎద్దేవా చేశారు. చూడండి ఆమె మాటల్లోనే... వీడియో...