కేసీఆర్ చెప్పి చేస్తున్నారు... చంద్రబాబు చెప్పకుండా చేస్తున్నారు.. ఏంటది?
తెలంగాణా సీఎం కేసీఆర్ ఫెడరల్ ఫ్రెంట్ ఏర్పాటు చేసి దేశ రాజకీయాల్లో చక్రం తిప్పాలన్న ఆలోచనలో ఉన్నారు. కాంగ్రెస్, భాజపాయేతర కూటమి ఏర్పాటు దేశానికి ప్రస్తుతం చాలా అవసరం అంటూ మమతా బెనర్జీ, దేవెగౌడ, అఖిలేష్ యాదవ్, స్టాలిన్ వంటి నేతల్ని క
తెలంగాణా సీఎం కేసీఆర్ ఫెడరల్ ఫ్రెంట్ ఏర్పాటు చేసి దేశ రాజకీయాల్లో చక్రం తిప్పాలన్న ఆలోచనలో ఉన్నారు. కాంగ్రెస్, భాజపాయేతర కూటమి ఏర్పాటు దేశానికి ప్రస్తుతం చాలా అవసరం అంటూ మమతా బెనర్జీ, దేవెగౌడ, అఖిలేష్ యాదవ్, స్టాలిన్ వంటి నేతల్ని కలిసొచ్చారు. ఇవన్నీ కేసీఆర్ బహిరంగంగా చేస్తున్నారు. అయితే చంద్రబాబు నాయుడు దేశ రాజకీయలపై పెద్దగా ఆసక్తి లేదంటూనే భవిష్యత్తు జాతీయ రాజకీయాలకు అవసరమైన పునాదులను వేసుకుంటున్నారు.
ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో కేంద్రంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన సందర్భంలో సీఎం చంద్రబాబుకు ఢిల్లీలో వివిధ పార్టీల నేతల నుంచి అనూహ్య స్పందన వచ్చింది. మరోసారి బాబు కేంద్ర రాజకీయాల్లో చక్రం తిప్పబోతున్నారని 12 పార్టీలతో కూటమి కట్టబోతున్నారంటూ జాతీయ మీడియాలో విస్తృత ప్రచారం జరిగింది. ఇదిలావుంచితే తాజాగా ఏపీ ప్రభుత్వం అమరావతిలో 11 రాష్ట్రాల ఆర్థిక మంత్రుల సమావేశం నిర్వహించి 15వ ఆర్థిక సంఘానికి సంబంధించిన విధివిధానాలను మార్చాలంటూ త్వరలోనే రాష్ట్రపతిని కలవాలని నిర్ణయించింది.
జాతీయ స్థాయిలో రాజకీయ పార్టీలను సమీకరణ కోసం ఇవన్నీ చేస్తున్నట్టు చంద్రబాబు ఎక్కడా చెప్పకపోయినా… భవిష్యత్తులో తాను పిలిస్తే ఢిల్లీ వేదికగా కలిసి పనిచేసేందుకు పలు పార్టీలు సిద్ధంగా ఉన్నాయని చెప్పకనే చెబుతున్నారు.