సంబంధిత వార్తలు
- మొదటి గేర్డ్ ‘ఇవి’ మోటార్‌బైక్ ఎరా పరిచయం
- 47 ఏళ్ల వ్యక్తి 16 ఏళ్ల బాలికను పెళ్లి చేసుకోవాలనుకున్నాడు.. కాదనడంతో? (video)
- ఇస్రో ఖాతాలో మరో విజయం, ఎస్ఎస్ఎల్వి-డి2 ప్రయోగం సక్సెస్
- రెపోరేటు పెంచుతూ ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్
- ఉత్సాహంగా ముగిసిన ఇనార్బిట్ దుర్గం చెరువు రన్ 2023, గత సంవత్సరంతో పోలిస్తే 100% పెరిగిన రిజిస్ట్రేషన్లు
అమెజాన్‌కు తేరుకోలేని షాకిచ్చిన ఆర్బీఐ - రూ.3.06 కోట్ల అపరాధం
ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్‌కు భారత రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా తేరుకోలేని షాకిచ్చింది. ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్‌స్ట్రుమెంట్స్, కేవైసీ నిబంధనలను ఉల్లంఘించినందుకు రూ.3.06 కోట్ల జరిమానా విధిస్తున్నట్టు ఆర్బీఐ ఓ ప్రకటనలో పేర్కొంది. ఇప్పటికే ఆర్బీఐ అమెజాన్‌కు షోకాజ్ నోటీసులు ఇచ్చిది. ఇందులో జరిమానా ఎందుకు విధించకూడదు అనే అంశంపై కారణం చూపాలని సూచించింది.
ఎంటీటీ రెస్పాన్స్‌ను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే ఆర్బీఐ గైడ్‌లైన్స్ పాటించలేదన్న అభియోగం రుజువైందని తెలిపింది. అదేవిధంగా కస్టమర్ల లావాదేవీలకు పెనాల్టీతో సంబంధం లేదని స్పష్టంచేసింది. అమెజాన్ పే అనేది ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ యొక్క డిజిటల్ చెల్లింపు విభాగం. అయితే, డిజిటల్ చెల్లింపుల విషయంలో ఫోన్‌పే, గూగుల్ పే అత్యుత్తమ సేవలు అందిస్తున్నాయి. కానీ, అమెజాన్ మాత్రం కేవలం ఒక్క శాతం మేరకు మాత్రమే చెల్లింపులు జరుపుతుంది.
