కత్తి.. కత్తి.. కత్రీనాతో ఒక్క రోజంతా డేటింగ్ చేయాలి: ఉస్సేన్ బోల్ట్

ఉస్సేన్ బోల్ట్ ఆడాళ్ల విషయంలో కాస్త వీకేనని రియో ఒలింపిక్స్‌కు తర్వాత తేలిపోయింది. పరుగులో చిరుతకు సమానమైన ఉస్సేన్ బోల్ట్ రియో ఒలింపిక్స్‌లో మూడు పసిడి పతకాలతో రికార్డు సృష్టించాడు. పరుగులోనే కాదు.. అ

Selvi| Last Updated: శుక్రవారం, 26 ఆగస్టు 2016 (18:14 IST)
ఉస్సేన్ బోల్ట్ ఆడాళ్ల విషయంలో కాస్త వీకేనని రియో ఒలింపిక్స్‌కు తర్వాత తేలిపోయింది. పరుగులో చిరుతకు సమానమైన ఉస్సేన్ బోల్ట్ రియో ఒలింపిక్స్‌లో మూడు పసిడి పతకాలతో రికార్డు సృష్టించాడు. పరుగులోనే కాదు.. అమ్మాయిలను వలలో వేసుకోవడంలోనూ బోల్ట్ కిలాడీ అని తేలిపోయిన నేపథ్యంలో.. భారతీయ అమ్మాయిలపై అయ్యగారి కన్నుపడింది.

బాలీవుడ్ నటీమణి కత్తిలాంటి కత్రీనా కైఫ్‌తో ఓ రోజు డేటింగ్ చేయాలని.. ఆమెతో హోటల్‌లో బస చేయాలని, రోజంతా షికారుకెళ్లాలని బోల్ట్ తన మనసులోని మాటను ట్విట్టర్ ద్వారా బయటపెట్టేశాడు. ఇంకేముంది.. పరుగుల చిరుత తాను పరిగెత్తే వేగంతో కత్రినా లాక్కెళ్లకపోకుండా ఉంటే మంచిదని క్రీడా పండితులు అంటున్నారు.

ఇటీవల రియో డీ జెనీరోవాకు చెందిన 20 ఏళ్ల కాలేజీ అమ్మాయితో బోల్ట్ సాగించిన రాసలీలలకు చెందిన ఫోటోలు వాట్సాప్‌లో చక్కర్లు కొట్టిన సంగతి తెలిసిందే. ఈ వివాదం ముగిసిపోకముందే బోల్ట్ కత్రినా అంటే పిచ్చంటూ ట్విట్టర్లో ట్వీట్ చేయడం చర్చనీయాంశమైంది.దీనిపై మరింత చదవండి :