సంబంధిత వార్తలు
- రవిశాస్త్రితో ప్రేమాయణమా..? ఐ లవ్ ఐస్ క్రీమ్.. నిమ్రత్ కౌర్ ట్వీట్స్
- బాలీవుడ్ హీరోయిన్‌తో క్రికెట్ లవర్ బాయ్ డేటింగ్!
- విరాట్ కోహ్లీ షాంపైన్ గిఫ్ట్.. ఎవరికిచ్చారో తెలుసా?
- ఛ... ఛ... ధోనీ బంతి తీసుకుంటేనే అంత గొడవ చేస్తారా? రవిశాస్త్రి ఆగ్రహం
- 'లైఫ్ గోల్' కొట్టిన థాయ్ బాలలు... గుహలో నుంచి సురక్షితంగా తరలింపు
తైక్వాండో పోటీలు.. 15ఏళ్ల బాలికపై కోచ్ లైంగిక దాడి..
హాలీవుడ్ నుంచి బాలీవుడ్‌కి అక్కడి నుంచి మెల్లగా దక్షిణాదికి పాకిన మీ టూ ఉద్యమం ఊపందుకున్న వేళ.. తైక్వాండో కోచ్ మనోజ్ శివహరేపై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి. ఇప్పటికే సినీ రంగంతో పాటు వివిధ రంగాలకు చెందిన వారిపై బాధితులు లైంగిక ఆరోపణలను బహిర్గతం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తైక్వాండో కోచ్ మనోజ్ శివహరే తన వద్ద శిక్షణ తీసుకునే బాలికపై లైంగిక దాడి పాల్పడ్డ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
వివరాల్లోకి వెళితే.. పూణేలో జరిగే తైక్వాండో పోటీలకు మనోజ్‌తో పాటే 15ఏళ్ల శిష్యురాలు వెళ్లారు. ఒక హోటల్‌లో దిగారు. అనంతరం రాత్రి సమయంలో కోచ్ ఆ బాలిక వద్దకు వెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ విషయం తెలుసుకున్న బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. తైక్వాండో పోటీల్లో బాలిక విజయం సాధించినప్పటికీ.. కోచ్ వద్ద ఆమెకు లైంగిక వేధింపులు మాత్రం తప్పలేదని పోలీసులు చెప్పారు.
