ఛ... ఛ... ధోనీ బంతి తీసుకుంటేనే అంత గొడవ చేస్తారా? రవిశాస్త్రి ఆగ్రహం
టీమిండియా కోచ్ రవిశాస్త్రికి బాగా కోపం వచ్చింది. అది అందరూ అనుకుంటున్న విషయమే. ధోనీ ఇక క్రికెట్ ఆటకు పూర్తిస్థాయి రిటైర్మెంట్ ప్రకటిస్తారంటూ వస్తున్న ఊహాగానాలు. ఇంగ్లండుతో ఘోర పరాజయం చవిచూశాక ఆటగాళ్లందరు మైదానాన్ని వీడుతున్న సమయంలో టీమిండియా మాజీ సార
టీమిండియా కోచ్ రవిశాస్త్రికి బాగా కోపం వచ్చింది. అది అందరూ అనుకుంటున్న విషయమే. ధోనీ ఇక క్రికెట్ ఆటకు పూర్తిస్థాయి రిటైర్మెంట్ ప్రకటిస్తారంటూ వస్తున్న ఊహాగానాలు. ఇంగ్లండుతో ఘోర పరాజయం చవిచూశాక ఆటగాళ్లందరు మైదానాన్ని వీడుతున్న సమయంలో టీమిండియా మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోని అంపైర్లను అడిగి బంతి తీసుకున్నాడు.
అంతే.. ఇక చర్చ మొదలైంది. ధోనీ బంతి తీసుకున్నది రిటైర్మెంట్ ప్రకటించడానికే అంటూ సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. గతంలో టెస్ట్ క్రికెట్టుకు గుడ్ బై చెప్పేటపుడు కూడా మైదానంలో అంపైర్ల నుంచి వికెట్ తీసుకున్నాడని, ఇప్పుడు బంతిని తీసుకుని తన రిటైర్మెంట్ ప్రకటిస్తాడంటూ చర్చ మొదలెట్టారు.
దీనిపై రవిశాస్త్రి అసహనం వ్యక్తం చేశాడు. అందరూ అనుకుంటున్నట్లు ధోని ఎక్కడికీ వెళ్లడంలేదు. ఆయన ఇంకొంతకాలం టీమిండియాతోనే వుంటాడు. ఆ బంతిని బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్‌కు చూపించడానికే తీసుకున్నాడు తప్ప మీరనుకుంటున్నట్లు రిటైర్మెంట్ ఆలోచన ఏదీ లేదని తేల్చి చెప్పారు.