అప్పుల భారం తాళలేక దంపతుల ఆత్మహత్య.. అనాధలుగా నిలిచిన పిల్లలు
Couple
సొంత ఇల్లు కొనుగోలు చేయడం కోసం ఈ దంపతులు కొద్ది నెలల క్రితం రూ. 90 లక్షల రుణం తీసుకున్నారు. అయితే ఆశించిన రుణం మంజూరు కాకపోవడంతో, ఇంటిని విక్రయించి కొంత అప్పును తీర్చారు.
మిగిలిన అప్పు గురించి నరేష్ ఆందోళన చెందుతుండేవారని, అలాగే మానసిక వైద్యుని వద్ద చికిత్స కూడా పొందుతున్నారని బంధువులు తెలిపారు. ఈ పరిస్థితుల్లో, పిల్లలు బడికి వెళ్లిన వెంటనే నరేష్ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకోగా, మేఘన పురుగుల మందు తాగి ప్రాణాలు తీసుకుంది. మేఘన తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
