సంబంధిత వార్తలు
- వృద్ధుడిపై మంత్రగాడు అనే ముద్రవేసి.. మూత్రం తాగించారు.. ఎక్కడ?
- ఫోనులో కనిపించిన సిమెంట్ - డ్రమ్ పదాలు... భార్యను ప్రియుడికి అప్పగించిన భర్త...
- పెళ్లికెళ్లి రసగుల్లా తిన్నాడు.. అది గొంతులో ఇరుక్కుపోయింది.. చివరికి?
- పవన్ కళ్యాణ్ తో సినిమా మా కల, పెద్ద హిట్ అవ్వడం డబుల్ బొనాంజా : నవీన్ యెర్నేని
- వేసవిలో చల్లని వాతావరణం- తెలంగాణలోని పది జిల్లాల్లో వర్షాలు
మౌలాలి- చర్లపల్లి రైల్వే స్టేషన్ల మధ్య రైలు ఢీకొని వ్యక్తి మృతి
మౌలాలి- చర్లపల్లి రైల్వే స్టేషన్ల మధ్య, గుర్తుతెలియని రైలు ఢీకొనడంతో ఒక వ్యక్తి మృతిచెందాడు. మౌలాలి, చర్లపల్లి మధ్య రైలు పట్టాల సమీపంలో, సుమారు 50 నుండి 55 ఏళ్ల వయస్సు గల ఒక గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైనట్లు సికింద్రాబాద్ రైల్వే డిప్యూటీ సూపరింటెండెంట్ తెలిపారు.
గుర్తుతెలియని రైలు ఢీకొనడం వల్లే ఆ వ్యక్తి మరణించినట్లు ఆయన పేర్కొన్నారు. విచారణలో భాగంగా, రైలు పట్టాలు దాటుతుండగా గుర్తుతెలియని రైలు కింద పడిపోవడం వల్లే ఆ వ్యక్తి మృతి చెందినట్లు తేలింది.
మృతి చెందిన వ్యక్తి చారలు కలిగిన పసుపు రంగు చొక్కా, కాఫీ రంగు ట్రాక్ ప్యాంట్లు ధరించి ఉన్నాడు. అతని కుడి చేతికి రాఖీ కట్టి ఉంది. అలాగే ఛాతీ కుడి వైపున ఒక పుట్టుమచ్చ ఉంది. మృతిచెందిన వ్యక్తి వివరాలు ఎవరికైనా తెలిస్తే, దయచేసి 8712658581 లేదా 9440083160 నంబర్లను సంప్రదించాలని పోలీసులు కోరారు.
