1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
  4. New Year Effect: Record Liquor Sales In Telangana

వామ్మో.. ఏం తాగేశారు.. మూడు రోజుల్లో రూ.వెయ్యి కోట్ల మద్యం విక్రయాలు

liquor
తెలంగాణ రాష్ట్రంలో నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని మద్యం బాబులు రెచ్చిపోయారు.
2025 సంవత్సరాఖరులో ఇష్టారాజ్యంగా మద్యం సేవించారు. దీనికి నిదర్శనమే మూడు రోజుల్లో ఏకంగా వెయ్యి కోట్ల రూపాయలకు మద్యం సేవించారు. నూతన సంవత్సరం సంబరాల్లో భాగంగా, రాష్ట్ర వ్యాప్తంగా రూ.వెయ్యి కోట్లకు పైగా మద్యం విక్రయాలు జరిగినట్టు ఆ రాష్ట్ర అబ్కారీ అధికారులు వెల్లడించారు.
 
గత ఆరు రోజుల్లో రూ.1350 కోట్ల మద్యం అమ్మకాలు చేసినట్టు తెలిపారు. అయితే, కేవలం మూడు రోజుల్లో మాత్రం 8.30 లక్షల కేసుల లిక్కర్, 7.78 లక్షల కేసు బీర్ల విక్రయాలు జరిగినట్టు పేర్కొన్నారు. జనవరి ఒకటో తేదీ కూడా మద్యం విక్రయాలు జోరుగా సాగే అవకాశం ఉందని వారు తెలిపారు. 
తర్వాతి కథనం
బ్రహ్మదేవుడి కంటే నాకే ఎక్కువ తెలుసు, నేను చెప్పింది వినిసావు: యువతితో వీడియోలో అన్వేష్