1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
  4. Telangana sees 335 private degree colleges shut

తెలుగు రాష్ట్రంలో మూతపడుతున్న డిగ్రీ కాలేజీలు.. ఎందుకు?

Telangana
Telangana
రెండు తెలుగు రాష్ట్రాలైన తెలంగాణలో డిగ్రీ కాలేజీలు వరుసగా మూతపడుతున్నాయి. ఫలితంగా డిగ్రీ విద్యా విధానం తీవ్ర సంక్షోభంలో కూరుకునిపోయింది. విద్యార్థుల ఆదరణ తగ్గడం 
తెలంగాణలో ప్రైవేటు డిగ్రీ విద్య తీవ్ర సంక్షోభంలో కూరుకుపోతోంది. విద్యార్థుల నుంచి ఆదరణ తగ్గడం, ప్రభుత్వ ప్రోత్సాహం కొరవడటంతో ఏటా పదుల సంఖ్యలో కాలేజీలు మూతపడుతున్నాయి. గత ఐదేళ్ల వ్యవధిలో రాష్ట్రవ్యాప్తంగా ఏకంగా 335 ప్రైవేటు డిగ్రీ కాలేజీలకు తాళాలు పడటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. 2021లో 1,100గా ఉన్న మొత్తం డిగ్రీ కాలేజీల సంఖ్య, ప్రస్తుతం 783కి పడిపోయింది.
 
తాజాగా ముగిసిన మూడు విడతల 'దోస్త్' కౌన్సెలింగ్ తర్వాత కూడా సగానికి పైగా సీట్లు ఖాళీగా ఉన్నాయి. ఈ ఏడాది 9 జిల్లాల పరిధిలోని 56 కాలేజీల్లో మొత్తం 16,460 సీట్లు ఉండగా, ఒక్క అడ్మిషన్ కూడా నమోదు కాలేదు. నిబంధనల ప్రకారం, వరుసగా మూడేళ్లపాటు 25 శాతం సీట్లు భర్తీ కాని కాలేజీల గుర్తింపును రద్దు చేస్తారు. దీంతో ఈ విద్యా సంవత్సరంలో మరో 50కి పైగా కాలేజీలు మూతపడే ప్రమాదం ఏర్పడింది. ఒకప్పుడు నల్గొండ జిల్లాలో ప్రముఖంగా ఉన్న 4 దశాబ్దాల చరిత్ర గల నీలగిరి డిగ్రీ కాలేజీ సైతం గతేడాది మూతపడింది.
 
ప్రభుత్వం నుంచి సరైన సహకారం లేకపోవడమే ఈ దుస్థితికి కారణమని ప్రైవేటు డిగ్రీ కాలేజీల యాజమాన్యాల సంఘం ఆరోపిస్తోంది. ఇంజనీరింగ్, ఫార్మసీ కోర్సులకు ఇస్తున్న ప్రాధాన్యం డిగ్రీకి ఇవ్వడం లేదని, ఫీజు రీయింబర్స్‌మెంట్ కింద తమకు దాదాపు రూ.2,000 కోట్లు రావాల్సి ఉందని సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ రెడ్డి తెలిపారు. ఆర్థిక ఇబ్బందులతోనే కాలేజీలను మూసివేయాల్సి వస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 
About Writer
ఠాగూర్
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి
తర్వాతి కథనం
శబరి నది, దౌళేశ్వరం వద్ద పెరుగుతున్న నీటి మట్టం- రాత్రికి మొదటి ప్రమాద హెచ్చరిక