సంబంధిత వార్తలు
- ఇంట్లో కాలు జారి పడ్డానని చెప్తే సాయం కోసం వెళ్లింది.. చివరికి అత్యాచారం?
- కన్నడ నటుడు దర్శన్ అరెస్ట్- రేణుకా స్వామి హత్య
- మైనర్ల ఫోటోలు మార్ఫింగ్.. వాట్సాప్‌లో షేర్.. నలుగురు అరెస్ట్
- బెంగుళూరు రేవ్ పార్టీ కేసు : బెంగుళూరు పోలీసుల అదుపులో సినీ నటి హేమ??
- ప్రజ్వల్ - ఎయిర్‌పోర్టులో అడుగుపెట్టగానే అరెస్టు చేస్తాం : కర్నాటక హోం మంత్రి
సైబర్ నేరగాళ్లకు సిమ్ కార్డుల పంపిణీ.. ముగ్గురి అరెస్ట్
తెలంగాణ రాష్ట్ర సైబర్ సెక్యూరిటీ బ్యూరో (TGCSB) సిమ్ కార్డులు, బ్యాంకు ఖాతాల అక్రమ సేకరణకు పాల్పడిన ముగ్గురు వ్యక్తులను పట్టుకుంది. సైబర్ సెక్యూరిటీ బ్యూరో వారి వద్ద నుంచి 113 సిమ్ కార్డులు, మూడు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకుంది.
తెలంగాణ రాష్ట్ర సైబర్ సెక్యూరిటీ బ్యూరో సంక్లిష్టమైన సైబర్ క్రైమ్ నెట్‌వర్క్‌పై సమగ్ర దర్యాప్తును ప్రారంభించింది. ఈ క్రమంలో అంతర్జాతీయంగా దుబాయ్, థాయిలాండ్, కంబోడియా వంటి దేశాలలో సిమ్ కార్డులు, బ్యాంకు ఖాతాల హ్యాక్‌కు పాల్పడిన ముగ్గురిని అరెస్ట్ చేశారు.
అరెస్టయిన వారిలో జగద్గిరిగుట్టకు చెందిన షేక్ సుభాని (26), జీడిమెట్ల చింతల్‌కు చెందిన కె నవీన్ (22), ఎం ప్రేమ్ కుమార్ అలియాస్ మైఖేల్, ఆర్టీసీ ఎక్స్ రోడ్డుకు చెందిన మైక్ టిస్సన్ (24) ఉన్నారు. నిందితులు వివిధ వ్యక్తులు, సంస్థల గుర్తింపులను ఉపయోగించి సిమ్ కార్డులను సేకరించినట్లు పోలీసులు తెలిపారు. ఈ సిమ్ కార్డులు సైబర్ నేరగాళ్లకు పంపడం జరిగిందని దర్యాప్తులో తేలింది.
తర్వాతి కథనం
