సంబంధిత వార్తలు
- New Political Party: తెలంగాణలో కొత్త రాజకీయ పార్టీ.. కొత్త పార్టీ పెట్టేదెవరంటే?
- ఆపరేషన్ చేసి పాము ప్రాణం పోసిన వెటర్నరీ డాక్టర్ (వీడియో)
- తెలంగాణాలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు
- కాంగ్రెస్ తీరు... హంతకుడే సంతాప సభ పెట్టినట్టుగా ఉంది : హరీష్ రావు
- తెలంగాణ ఉద్యోగులకు శుభవార్త - రూ.1.50 కోట్లకు ప్రమాద బీమా
పిక్నిక్‌కు వెళ్లారు.. యాదగిరి గుట్టలో ఆ ముగ్గురిని కలిశారు.. చివరికి?
వయోబేధం లేకుండా మహిళలపై అకృత్యాలు జరుగుతున్నాయి. తాజాగా సరదాగా బయటకు వెళ్లిన ముగ్గురు బాలికలు ముగ్గురు మృగాళ్ల చేతిలో చిక్కారు. మాయమాటలు చెప్పి పిక్నిక్ పేరుతో యాదగిరిగుట్టకు తీసుకెళ్లి అత్యాచారం చేశారు. వివరాల్లోకి వెళితే.. వెంకటాపురానికి చెందిన ముగ్గురు తొమ్మిదవ తరగతి విద్యార్థినీలు బడిలో బతుకమ్మ వేడుకలు ఉన్నాయని ఇంట్లోవాళ్లకు చెప్పి ఈనెల 20న ఆధార్ కార్డులు పట్టుకొని బయటకు వెళ్లారు. అయితే ఆ ముగ్గురు స్కూలుకు వెళ్లకుండా ఆల్వాల్ గోల్నాక చౌరస్తావద్ద బస్సెక్కి సికింద్రాబాద్‌కు చేరుకున్నారు.
ఈ లోపు ఓయూ మాణికేశ్వరి నగర్‌కు చెందిన, జీహెచ్‌ఎంసీలో కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న 19 ఏళ్ల యువకుడు గండికోట్ మధు(19) బాలికలను చూసి వారితో మాటలు కలిపాడు. అనంతరం అతడి స్నేహితులు వారాసిగూడకు చెందిన గడ్డం వంశీ అరవింద్ (22), అతడి సమీప బంధువు మల్లేశ్వర్‌నగర్‌కు చెందిన ఈసం నీరజ్ (21)ను పిలిచాడు. అనంతరం అందరూ కలిసి ఓ హోటల్‌లో భోజనం చేశారు.
మంచిగా మాట్లాడటంతో బాలికలకు వీరిపై నమ్మకం పెరిగింది. సరదాగా బయటకు వెళ్దామని అందరూ అనుకుని బస్సులో యాదగిరిగుట్టకు తీసుకెళ్లారు. అక్కడే లాడ్జిలో మూడు వేర్వేరు గదులు అద్దెకు తీసుకున్నారు. రాత్రంతా ఆ గదిలోనే ఉన్నారు. ఆ రాత్రి బాలికలపై అత్యాచారానికి పాల్పడ్డారు. 21వ తేదీన ఆరుగురు కలిసి హైదరాబాద్‌కు వచ్చారు.
ఓయూ పీఎస్ పరిధిలో బాలికలను వదిలిపెట్టి, ముగ్గురు యువకులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయితే 20వ తేదిన ముగ్గురు విద్యార్థినీలు బడికి రాకపోవడంతో ఓ టీచర్.. తల్లిదండ్రులకు ఫోన్ చేశారు. అయితే వారు గట్టిగా నిలదీసేసరికి.. జరిగిదంతా చెప్పారు. వైద్య పరీక్షలు చేయించగా అత్యాచారం జరిగినట్లు నిర్ధారణ అయింది. పోలీసులు నిందితులతోపాటు గది అద్దెకు ఇచ్చిన సోమేశ్‌ను అరెస్టు చేసి రిమాండుకు తరలించారు.
తర్వాతి కథనం
