1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
  4. union minister bandi sanjay talk about mangos

మామిడి కాయ తినాలంటే భయమేస్తుందంటున్న కేంద్ర మంత్రి.. ఎందుకు.. ఎవరు?

bandi sanjay kumar
మామిడి కాయ తినాలంటే భయమేస్తుందని కేంద్ర మంత్రి బండి సంజయ్ అంటున్నారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రంలో కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ప్రకృతి వ్యవసాయంపై ఏర్పాటు చేసిన రైతు సమ్మేళనంలో ఆయన పాల్గొని మాట్లాడారు. 'హైదరాబాద్‌లో పాలు తాగి 3 రోజులు ఆసుపత్రి పాలయ్యా. 20 ఏళ్లలో ఎప్పుడూ నాకు జ్వరం రాలేదు. బీపీ, షుగర్‌ లేదు. నరేంద్ర మోడీయే నాకు స్ఫూర్తి. ప్రస్తుతం.. భూమి అంతా రసాయనాలతో నిండిపోయింది. రోగానికి కారకులం మనమే.. నివారించగలిగేది మనమే. 
 
ప్రకృతి వ్యవసాయం దిశగా రైతులను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌లో రూ.2,400 కోట్లు కేటాయించింది. ప్రకృతి వ్యవసాయం చేస్తే రెండు.. మూడేళ్లు లాభాలు రాకపోయినా, ఆ తర్వాత రైతులు కోటీశ్వరులవుతారు. ఆర్గానిక్‌ ఉత్పత్తులను కొనేందుకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. రైతులు గమనించి ప్రకృతి వ్యవసాయం చేయాలి.
 
ముందుగా సేంద్రీయ సాగు చేసే వాళ్లు కోటీశ్వరులు కావొచ్చు. బడ్జెట్‌లో రూ.2 లక్షల కోట్లు యూరియాకు ఖర్చు చేస్తున్నాం. రూ.1.20 లక్షల కోట్ల సొమ్ము విదేశాలకు పంపి యూరియా దిగుమతి చేసుకోవడం బాధాకరం. రాబోయే రెండేళ్లలో కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో 25 వేల మంది రైతులను ప్రకృతి వ్యవసాయంవైపు మళ్లించేలా చర్యలు తీసుకుంటా. ప్రకృతి వ్యవసాయంతో వచ్చిన పంటకు మద్దతు ధర ఇచ్చేలా చూస్తాం అని కేంద్రమంత్రి బండి సంజయ్ పేర్కొన్నారు.
About Writer
ఠాగూర్
తర్వాతి కథనం
మమతా బెనర్జీకి అల్టిమేటం జారీ చేసిన టీఎంసీ ఎంపీ